చైనాలో ఉద్భవించిన కరోనా వైరస్..(COVID-19) ప్రపంచ దేశాలకు వ్యాపించింది. వందల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా చైనాలో 80వేల కేసులు, సౌత్ కొరియాలో 5వేల మంది, ఇటలీలో 2వేల మందికి వైరస్ సోకినట్టు ధ్రువీకరించారు. కానీ, భారత్‌లో అదృష్టవశాత్తూ కరోనా కేసులు ఆరు మాత్రమే నమోదయ్యాయి. వైరస్ వ్యాప్తి తక్కువగా ఉన్నప్పటికీ చైనా తర్వాత అతిపెద్ద జనాభా ఉన్న భారతదేశంలో వైరస్ తీవ్రత పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందులో పట్టణ ప్రాంతాల్లో తగినంత పరిశుభ్రత లేనిచోట అధికంగా ఉండే అవకాశం ఉంది. భారతదేశంలోని చాలా ప్రధాన నగరాలు ఫిబ్రవరిలో 10 నుండి 35 ° C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కరోనా NCoV భౌగోళిక వ్యాప్తి ఇప్పటివరకు శీతల వాతావరణం ఉన్న దేశాలకు మాత్రమే పరిమితమైంది. అయినప్పటికీ, కొత్త కరోనా వైరస్‌ను అరికట్టడానికి అధిక ఉష్ణోగ్రత ఒక్కటి మాత్రమే సాయపడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వాతావరణందే కీలక పాత్ర :
కరోనా వైరస్ ప్రభావిత దేశాల నుంచి వచ్చే లక్షలాది మందిని పరీక్షించడం, ప్రయాణ సూచనలను అమలు చేయడం, అనుమానాస్పద కేసులను నిర్థారించడం, అపోహలను తొలగించడం వంటివి భారతదేశంలో ప్రాణాంతక వైరస్ వ్యాప్తిని పరిమితం చేయడంలో సహాయపడ్డాయి. వాతావరణంలో కూడా పాత్ర ఉందా అనే కోణంలో నిపుణులు పరిశోధిస్తున్నారు. ఆర్ఎన్ ఠాగూర్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాక్ సైన్సెస్ (RTIICS) క్రిటికల్ కేర్ హెడ్ సౌరెన్ పంజా జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశంలో వైరల్ దాడులకు వాతావరణం ఖచ్చితంగా నిరోధకంగా ఉంటుందని అన్నారు. nCov భౌగోళిక వ్యాప్తి ఇప్పటివరకు శీతల వాతావరణం ఉన్న దేశాలకు మాత్రమే పరిమితం చేయబడిందని సౌరెన్ చెప్పారు.
చైనా వుహాన్ సిటీలో గరిష్ట సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఇక్కడ జనవరి, ఫిబ్రవరి రెండింటిలో సబ్-జీరో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దక్షిణ కొరియాలోని సియోల్‌లో కూడా.. ఇటీవల ధృవీకరించబడిన కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఫిబ్రవరిలో కనీస ఉష్ణోగ్రతలు 0° C కంటే తక్కువగా నమోదయ్యాయి. ఇటలీలోని రోమ్ ఇరాన్‌లోని టెహ్రాన్‌లో కూడా ఫిబ్రవరిలో సబ్-జీరో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విరుద్ధంగా, భారత్‌లో చాలా ప్రధాన నగరాలు ఫిబ్రవరిలో 10 నుండి 35 ° C వరకు ఉష్ణోగ్రత నమోదయ్యాయి. ఢిల్లీలో నమోదైన అతి తక్కువ ఉష్ణోగ్రత కూడా 5 ° C కంటే ఎక్కువ. ఫిబ్రవరిలో కోల్‌కతాలో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 ° C ఉండగా, బెంగళూరు, హైదరాబాద్‌లో నగరాల్లో 15 ° C కంటే ఎక్కువగా నమోదు కాగా, ముంబై చెన్నైలలో 20 ° C కంటే ఎక్కువగా నమోదయ్యాయి.
వేడి, తేమతో కూడిన పరిస్థితులు :
ప్రస్తుత కరోనావైరస్ వ్యాప్తి మాత్రమే కాదు.. అంతకుముందు ఆసియా, అమెరికా ఆఫ్రికా అంతటా వేలాది మందిని చంపిన MERS, SARS, ఎబోలా ఎల్లో జ్వరం వంటి అంటువ్యాధులు కూడా భారతదేశంలో తక్కువ ప్రభావాన్ని చూపాయి. అందువల్ల, అధిక ఉష్ణోగ్రత, తేమ వంటి శీతల వాతావరణం ఉన్న దేశాలలో ఈ వర్గం వైరల్ ఇన్ఫెక్షన్లు భారతదేశంలో వేగంగా వ్యాపించకపోవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
ఈ తరహా వాతావరణంలో ప్రాణాంతక వైరస్‌లు మనుగడ సాగించడం శక్తివంతంగా మారడం కష్టమేనని చెప్పవచ్చు. “వైరస్‌లు తక్కువ ఉష్ణోగ్రతలలో వృద్ధి చెందుతాయి. అందువల్ల భారతదేశం కంటే చల్లగా తక్కువ తేమతో ఉన్న ఆగ్నేయ ఆసియా దేశాలకు nCov వేగంగా వ్యాపించింది. దక్షిణ కొరియా జపాన్ వేగంగా వ్యాప్తిచెందాయి. అదే సమయంలో.. భారతదేశంలో తేమ తక్కువగా ఉండటంతో వైరస్ వ్యాప్తి తక్కువగా ఉండి ఉండొచ్చునని అంటున్నారు.
వేసవి నిజంగా మనలను కాపాడుతుందా? :
ఎండలు మనల్ని వైరస్ బారి నుంచి నిజంగా కాపాడగలవా? అంటే పూర్తి స్థాయిలో కచ్చితంగా అని చెప్పలేం. కరోనావైరస్ గుర్తించకుండానే వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని అగర్వాల్ సూచిస్తున్నారు. దేశంలోని పెద్దవాళ్లల్లో న్యుమోనియా అధికంగా ఉండటం అసలు కరోనావైరస్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తుందని అంటున్నారు. SARS-CoV-2 న్యుమోనియా వేగంగా అభివృద్ధి చెందుతున్న అన్ని కేసులను పరీక్షించాలని అగర్వాల్ సూచిస్తున్నారు. అంతేకాకుండా, ఫిబ్రవరిలో 23 నుండి 33 ° C మధ్య ఉష్ణోగ్రతలు పెరిగిన సింగపూర్ వంటి దేశాలలో 110 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. అందువల్ల.. కొత్త కరోనావైరస్‌ను అరికట్టడానికి అధిక ఉష్ణోగ్రత మాత్రమే సహాయపడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
2003లో ఇదే విధమైన వైరస్ SARS చివరి వ్యాప్తి జూలై వరకు కొనసాగింది. ఉత్తర అర్ధగోళంలో వేసవిలో MERS కూడా మధ్యప్రాచ్య దేశాలను ఎక్కువగా ప్రభావితం చేసింది. ఇవి ఏడాది పొడవునా వాతావరణాన్ని కలిగి ఉంటాయి. యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) అధ్యక్షుడు డాక్టర్ నాన్సీ మెషెనియర్ కూడా ఈ వైరస్ కాలానుగుణమని ఊహించడం కష్టమని చెప్పారు. ఇప్పుడు ఈ వ్యాధి నిజంగా పూర్తిగా నిర్మూలించలేకపోవచ్చునని శాస్త్రవేత్తలు అంటున్నారు. సాధారణ జలుబు ఫ్లూ వంటి శాశ్వత వ్యాధిగా మారే అవకాశం ఉందని సూచిస్తున్నారు. వ్యాప్తిని నివారించడానికి బలమైన వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడం ఎంతో కీలకమని స్పష్టం చేశారు. వేసవికాలంలో వైరల్ ప్రభావం తగ్గుతుందో లేదో చెప్పడం కష్టమే..