Intermittent Fasting : ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్.. మీ గుండెకు మంచిది కాదట.. 8 గంటల గ్యాప్‌తో గుండెపోటు మరణాల ముప్పు!

Intermittent Fasting : ఇంతకీ, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్.. సురక్షితమేనా? బరువు తగ్గడానికి ఎక్కువ మంది చేస్తున్న ఈ ఫాస్టింగ్ విధానం వల్ల గుండె సంబంధిత మరణాల ముప్పు అధికంగా ఉందని కొత్త అధ్యయనంలో తేలింది.

Intermittent Fasting : ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్.. అదేనండీ.. పరిమితం సమయంలోనే ఉపవాసం.. ప్రస్తుత రోజుల్లో ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది బాగా పాపులర్ అయింది. ప్రత్యేకించి అధిక బరువు తగ్గాలనుకునే వారు ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ తెగ ఫాలో అయిపోతుంటారు. ఇంతకీ.. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏంటి? అంటారా? ఏమి లేదండీ.. ఒక రోజులో ఆహారం తీసుకునే సమయాన్ని పరిమితం చేయడం, కేలరీలను తగ్గించడమే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ (Intermittent fasting) అని అంటారు.

Read Also : Gut Health Tips : చలికాలంలో మలబద్ధకాన్ని నివారించే అద్భుతమైన 8 ఆహారాలివే.. తప్పక తెలుసుకోండి !

91శాతం పెరిగిన మరణాల ముప్పు :
ఈ విధానంలో రోజులోని 24 గంటల్లో కేవలం 8 లేదా 6 గంటల పాటు మాత్రమే ఆహారం తీసుకుంటారు. ఇక, మిగతా 16 గంటలు లేదా 18 గంటల పాటు నీరు తప్ప ఏ ఆహారం తీసుకోకూడదు. అయితే, ఈ రకమైన ఉపవాసంతో బరువు తగ్గడం ఏమో కానీ, గుండె సంబంధిత సమస్యలు మాత్రం కచ్చితంగా వస్తాయని కొత్త అధ్యయనంలో తేలింది. గుండెపోటు మరణాల ముప్పు కూడా అధికంగా ఉంటుందని చికాగోలోని పరిశోధకులు తేల్చేశారు. భోజన సమయాలను రోజుకు కేవలం ఎనిమిది గంటల వ్యవధికి పరిమితం చేయడం వల్ల గుండె జబ్బుల వల్ల మరణించే ప్రమాదం 91శాతం పెరుగుతుందని గుర్తించారు.

ఉపవాసంతో అంతర్లీన గుండెజబ్బుల ముప్పు :
దీనికి సంబంధించి అధ్యయనాన్ని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రచురించింది. (AHA) ప్రకారం.. అధ్యయనం విడుదలకు ముందు ఇతర నిపుణులచే లోతుగా సమీక్షించారు. ప్రస్తుతం బరువు తగ్గిందుకు జీవనశైలిపరంగా అనేక మార్గాలు ఉన్నాయి. కానీ, ఈ రకమైన ఉపవాసంతో కలిగే ముప్పుపై అధ్యయనం ఫలితాలను కొంతమంది వైద్యులు సైతం ప్రశ్నించారు. ఉపవాసం ఉన్న వారు, ఉపవాసం చేయని వారి మధ్య తేడాలను పరిశీలించారు. వీరిలో ఉపవాసం ఉన్నవారిలో అంతర్లీనంగా గుండె జబ్బులు వంటివి 12 గంటల నుంచి 16 గంటలపాటు రోజువారీ వ్యవధిలో ఆహారాన్ని తీసుకునే వారి మధ్య తేడాలను గుర్తించారు.

ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్.. అనేది ఆహారంలో క్యాలరీలను తగ్గించే సాధనంగా ప్రసిద్ధి చెందిందని ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలోని ఎమెరిటస్ ప్రొఫెసర్ కీత్ ఫ్రాయిన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉపవాసంతో కలిగే ప్రభావాలపై దీర్ఘకాలిక అధ్యయనాలు అవసరమన్నారు. కానీ, దీనిపై అనేక ప్రశ్నలకు ఆయన సమాధానం ఇవ్వలేదు.

20వేల మంది పెద్దల నుంచి డేటా విశ్లేషణ :
షాంఘై జియావో టోంగ్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన విక్టర్ జాంగ్ నేతృత్వంలోని పరిశోధకులు, యూకే సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్, నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామినేషన్ సర్వేలో సుమారు 20వేల మంది పెద్దల నుంచి డేటాను విశ్లేషించారు. ఈ అధ్యయనంలో 2003 నుంచి 2019 వరకు మరణాల డేటాతో పాటు అనేక అంశాలను పరిశీలించింది. ఉపవాసం చేసే వారు రెండు రోజుల పాటు తిన్న వాటిని ఫారమ్‌లపై నింపాలని సూచించినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు.

8 గంటల గ్యాప్‌తో ఆహారం గుండెకు హానికరమే :
ఉపవాసం చేసే సగం మంది పురుషుల్లో సగటు వయస్సు 48ఏళ్లు కాగా.. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఎంతకాలం కొనసాగించారనేది స్పష్టంగా తెలియలేదు. అయినప్పటికీ వారు ఉపవాసాన్ని కొనసాగించారని పరిశోధకులు భావించారు. జాంగ్ ప్రకారం.. ఉపవాసం చేసినవారిలో అధిక స్థాయిలో బీఎంఐతో పాటు సమయానికి ఆహారం తీసుకోని యువకులే ఎక్కువగా ఉంటారని ఇమెయిల్ ద్వారా తెలిపారు. స్వీయ నివేదికల ఆధారంగా పరిశీలిస్తే.. వారికి రక్తపోటు, మధుమేహం, హృదయ సంబంధ వ్యాధుల ప్రాబల్యం తక్కువగా ఉందని చెప్పారు. అయితే, 8 గంటల గ్యాప్‌తో ఆహారం తీసుకోవడం కారణంగా గుండెపోటు మరణాల ముప్పు ఉందని జాంగ్ పేర్కొన్నారు.

Read Also : Kiwis Health Benefits : కివీస్ పండ్లను తీసుకోవడం వల్ల కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలివే!

ట్రెండింగ్ వార్తలు