Health Tips: నిలబడి నీళ్లు తాగుతున్నారా? కిడ్నీ ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంది.. ఒక్కసారి ఇది తెలుసుకోండి.

Health Tips: ఆధునిక కాలంలో మానవులు నిలబడి నీళ్లు తాగడం అలవాటుగా చేసుకున్నారు. ఇలా నిలబడి నీళ్లు తాగడం వల్ల అనేకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

Health Tips: నిలబడి నీళ్లు తాగుతున్నారా? కిడ్నీ ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంది.. ఒక్కసారి ఇది తెలుసుకోండి.

Health problems caused by drinking water while standing

Updated On : August 14, 2025 / 2:46 PM IST

మానవ జీవక్రియల్లో నీరు ప్రధాన పాత్ర పోషిస్తుంది. కేవలం రోజు సరిపడా నీళ్లు తాగడం వల్ల చాలా రకాల రోగాలు రాకుండా కాపాడుకోవచ్చు. కాబట్టి, మన ఆరోగ్యం విషయంలో నీరు అత్యంత కీలకం. అయితే, నీరు తాగడం సరే కానీ, దానిని ఎలా తాగుతున్నాం అనేది కూడా ముఖ్యమే. మన పురాణాల్లో, ఆయుర్వేదంలో, సాంప్రదాయ వైద్యంలో ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెబుతారు. అదేంటంటే, నీళ్లు తాగేటప్పుడు కూర్చుని తాగాలి అని. కానీ ఆధునిక కాలంలో మానవులు నిలబడి నీళ్లు తాగడం అలవాటుగా చేసుకున్నారు. ఇలా నిలబడి నీళ్లు తాగడం వల్ల అనేకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మరి ఆ సమస్యులు ఏంటి? ఎందుకు ఆ సమస్యలు వస్తాయి అనేది ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

నిలబడి నీళ్లు తాగడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు:

1.జీర్ణ సమస్యలు:
నిలబడి నీళ్లు తాగడం వల్ల నీరు శరీరంలో వేగంగా వెళ్లిపోతుంది. అలా వెళ్లడం వల్ల జీర్ణ వ్యవస్థలోని ఎంజైమ్స్, ఆమ్లాలు నీటితో కలిసిపోయి ఆహారం జీర్ణం కావడంలో ఆటంకం ఏర్పడుతుంది. దీని ఫలితంగా అజీరణం, గ్యాస్, పేగులలో వాయువు వంటి సమస్యలు ఏర్పడతాయి.

2.కిడ్నీపై ఒత్తిడి:
నిలబడి నీళ్లు తాగడం వల్ల శరీరం ఆ నీటిని సరైన పద్ధతిలో శోషించలేకపోతుంది. కాబట్టి, అది నేరుగా మూత్రాశయానికి చేరుతుంది. ఫలితంగా కిడ్నీలపై అధిక ఒత్తిడి ఏర్పడి దీర్ఘకాలంలో కిడ్నీ స్టోన్, మూత్రపిండాల వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

3.ఊపిరితిత్తుల వద్దకు నీరు చొచ్చుకుపోవడం:
తీవ్రమైన వేగంతో నిలబడి నీళ్లు తాగడం వల్ల కొన్నిసార్లు ఆ నీరు వ్రాంగ్ పైపు (trachea) వైపు వెళ్లే అవకాశం ఏర్పడుతుంది. ఇలా జరగడం వల్ల దీర్ఘకాలంలో ఇది ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ లేదా ఇబ్బంది కలిగించవచ్చు.

4.హార్ట్ ఫంక్షన్ మీద ప్రభావం:
శరీరంలో నీరు సరిగా శోషించకుండా నేరుగా రక్తంలోకి వెళ్లడం వల్ల హఠాత్‌గా రక్తంద్రవంగా మారుతుంది. ఇది గుండె పనితీరును తాత్కాలికంగా ప్రభావితం చేసే ప్రమాదం ఉంది. గుండె జబ్బులు ఉన్నవారికి ఈ సమస్య మరింత తీవ్రం కావచ్చు.

శరీరానికి అనుకూలంగా నీళ్లు తాగే సరైన విధానం:

  • కూర్చుని నీళ్లు తాగాలి
  • శరీరం సడలిన స్థితిలో ఉన్నప్పుడు, నీరు మెరుగ్గా శోషించబడుతుంది.
  • ఒక్కసారిగా కాకుండా మెల్లగా తాగాలి
  • బాటిల్ కన్నా గ్లాస్ ద్వారా తాగడం మంచిది
  • ఖాళీ కడుపుతో తాగడం శరీరాన్ని శుభ్రపరుస్తుంది.