Hair Transplantation: బట్టలతకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సరైనదేనా? ఇది ఎలా చేస్తారు.. నిజంగా జుట్టు వస్తుందా

Hair Transplantation: తల వెనుక భాగం నుండి ఒక స్ట్రిప్ తీసుకుంటారు. ఆ స్ట్రిప్‌ను చిన్న చిన్న ఫాలిక్యులర్ యూనిట్లుగా విడగొట్టి ముందువైపు లేదా జుట్టు లేని భాగంలో ప్రవేశపెడతారు.

Is hair transplantation right for people with hair loss?

ఈ మధ్య కాలంలో చాలా మంది బట్టతల సమస్యతో బాధపడుతున్నారు. యువకుల్లో ఈ సమస్య చాలా ఎక్కువగా కనిపిస్తోంది. అలాంటి వారి బాధ వర్ణనాతీతం. అయితే, బట్టతల సమస్య ఉన్నవారికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ (Hair Transplantation) అనేది ఒక శాశ్వత పరిష్కారంగా మారుతోంది. ఇది ఒక సర్జికల్ విధానం, ఇందులో తల మీద లేదా శరీరంలోని ఇతర భాగాలనుంచి జుట్టును తీసి, జుట్టు లేని భాగాల్లో అతికిస్తారు.

హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎలా పనిచేస్తుంది?

ఈ ప్రక్రియలో, సాధారణంగా డోనర్ ఏరియా నుండి ఆరోగ్యమైన హెయిర్ ఫాలికల్స్ తీసుకొని రిసిపియంట్ ఏరియాలో రోపణ చేస్తారు.

హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ విధానాలు:

1.ఫాలిక్యులార్ యూనిట్ ట్రాన్స్ప్లాంటేషన్:

దీనిలో తల వెనుక భాగం నుండి ఒక స్ట్రిప్ తీసుకుంటారు. ఆ స్ట్రిప్‌ను చిన్న చిన్న ఫాలిక్యులర్ యూనిట్లుగా విడగొట్టి ముందువైపు లేదా జుట్టు లేని భాగంలో ప్రవేశపెడతారు. కొంచెం మచ్చలు ఉండొచ్చు, కానీ మంచి డెన్సిటీ వస్తుంది.

2.ఫాలిక్యులార్ యూనిట్ ఎక్సట్రాక్షన్:
ప్రతి హెయిర్ ఫాలికల్‌ను ఒకదానికొకటి విడిగా డోనర్ ఏరియాలో నుంచి తీసి రిసిపియంట్ ఏరియాలో సెట్ చేస్తారు. ఇందులో మచ్చలు తక్కువగా ఉంటాయి. రికవరీ టైం కూడా త్వరగా ఉంటుంది.

హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్‌కు ముందే తెలుసుకోవాల్సిన విషయాలు

  • ఇది ఒక శస్త్రచికిత్స (సర్జరీ), కాబట్టి అర్హత ఉండాలి.
  • జుట్టు పూర్తిగా కోల్పోయిన చోట ఫలితాలు తగ్గవచ్చు.
  • డోనర్ జోన్‌లో సరిపడా జుట్టు ఉండాలి.
  • భారతదేశంలో దీని ఖర్చు రూ.40,000 నుంచి ₹1,50,000 వరకు ఉండొచ్చు

ప్రాసీజర్ తర్వాత చూసుకోవాల్సిన జాగ్రత్తలు;

  • కొన్ని రోజులు తల స్నానం చేయకుండా ఉండాలి.
  • డాక్టర్ చెప్పిన మందులు, ఆయింట్‌మెంట్లు వాడాలి.
  • ఫలితాలు కనిపించేందుకు 3 నుంచి 6 నెలలు పట్టవచ్చు
  • కొన్ని సందర్భాల్లో శాశ్వతంగా జుట్టు పెరుగుతుంది.

హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ యొక్క లాభాలు

  • శాశ్వత పరిష్కారం.
  • సహజంగా కనిపించే జుట్టు.
  • స్వయంగా మీ జుట్టు కావడంతో, రెజెక్షన్ ఛాన్స్ తక్కువ.