Is morning walking better or evening walking better?
నడక అనేది ఆరోగ్యానికి అత్యంత సరళమైన, సురక్షితమైన, సమర్థవంతమైన వ్యాయామం అని చెప్పాలి. ఏ వయసు వారైనా చాలా సులభంగా చేయగలిగే వ్యాయాయం ఇది. అయితే చాలామందిలో ఉన్న సందేహం ఏంటంటే.. ఉదయం నడక మంచిదా? లేక సాయంత్రం నడక మంచిదా? అని. మరి ఈ విషయంపై నిపుణులు ఏమంటున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఆరోగ్యకరమైన గాలి: ఉదయపు గాలిలో పొల్యూషన్ తక్కువగా ఉంటుంది. ఆక్సిజన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.
మెటబాలిజం స్టార్ట్ అవుతుంది: ఖాళీ కడుపుతో నడక వల్ల బాడీ ఫ్యాట్‌ను వేగంగా ఉపయోగించుకుంటుంది. దీనివల్ల బరువు సులభంగా తగ్గుతుంది.
మెదడు ఉల్లాసంగా ఉంటుంది: ఉదయపు సూర్యకాంతి సిరోటోనిన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. దీనివల్ల మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది.
ఉత్సాహంగా ఉంటుంది: ఉదయం నడకవల్ల రోజు మొత్తం ఉత్సాహంగా సాగుతుంది.
నిద్ర నాణ్యత మెరుగవుతుంది: ఉదయపు వ్యాయామం రాత్రి మంచి నిద్రకు సహాయపడుతుంది.
చలికాలంలో లేదా అలసటగా ఉన్నప్పుడు తెల్లవారుజామున లేవడం కాస్త కష్టమవుతుంది.
ఆస్తమా లేదా శ్వాసకోశ సమస్యలున్నవారు చలిలో బయటికి వెళ్లడం ఇబ్బందిగా ఉంటుంది.
బరువు నియంత్రణకు సహాయపడుతుంది: సాయంత్రం నడక ముఖ్యంగా భోజనానంతరం నడక జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. శరీరంలో ఊబకాయాన్ని తగ్గించడంలో తోడ్పడుతుంది.
స్ట్రెస్ రిలీఫ్: రోజంతా పనిపోటీతో ఒత్తిడికి గురైన వారికి సాయంత్రం నడక ఓ విశ్రాంతిని ఇస్తుంది.
ఫ్యామిలీ/ఫ్రెండ్స్‌తో నడవొచ్చు: ఉదయం ఒంటరిగా నడక వేయాల్సి వస్తే, సాయంత్రం సామూహికంగా చేయడం వల్ల ఉత్సాహం పెరుగుతుంది.