It is dangerous to feed honey to young children.
తేనె.. రుచికి తియ్యగా ఉండే ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. మన పూర్వీకులు ఆయుర్వేదంలోనూ, ఇంటి చిట్కాల్లోనూ తేనెను వాడేవారు. ఇది సీజనల్ అలెర్జీలు, జలుబు, దగ్గు, జీర్ణకోశ సమస్యలను తగ్గించడంలో అద్భుతం సహాయపడుతుంది. కానీ, చిన్న వయసు పిల్లల విషయంలో ముఖ్యంగా 1 సంవత్సరం లోపు పిల్లల విషయంలో మాత్రం తేనే హానికరంగా మారవచ్చు. ఇది నిపుణులు సైతం చెప్తున్న మాట. మరి దానికి సంబానిదించిన కారణాలను ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
తేనెలో సహజంగానే క్లాస్ట్రిడియం బోటులినం అనే బ్యాక్టీరియాల స్పోర్లు (spores) అధికంగా ఉంటాయి. ఇవి పెద్దవారిలో గాస్ట్రిక్ యాసిడ్, ఆరోగ్యకరమైన గట్స్ బ్యాక్టీరియాను నియంత్రించగలవు. కానీ, చిన్న పిల్లల్లో ప్రేగులు ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల ఈ స్పోర్లు చురుకుగా పెరిగి బోటులిజం అనే తీవ్రమైన వ్యాధిని కలిగించే అవకాశం ఉంది.
ఇది 1 సంవత్సరం కన్నా తక్కువ వయసున్న చిన్న పిల్లల్లో తేనె కారణంగా వచ్చే తీవ్రమైన వ్యాధి. నలిపిన ముఖం, తినడానికి ఆసక్తి తగ్గడం, బలహీనంగా ఏడవడం, మలమూత్రాలు క్రమం తప్పడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలను కనబరుస్తుంది. అలాగే వ్యాధి తీవ్రమైనప్పుడు శరీర అవయవాలు కూడా పనిచేయకపోవడం జరుగుతుంది. దేనిని వెంటనే గుర్తించకపోతే జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం పడే ప్రమాదం ఉంది.
ప్రఖ్యాత ఆరోగ్య సంస్థలు WHO, CDC, American Academy of Pediatrics సూచించిన ప్రకారం 1 సంవత్సరానికి పైబడి ఉన్న పిల్లలకు మాత్రమే తేనే ఇవ్వాలి.