Karisma Kapoor : కరిష్మా కపూర్ మెచ్చిన వేసవి పానీయం ఇదే !

సమ్మర్‌లో వేడి తట్టుకోలేక చాలామంది కూల్ డ్రింక్స్ తాగుతారు. వాటికంటే కూడా నేచురల్ డ్రింక్స్ మనం ఇంట్లో తయారు చేసుకుని తాగడం ఎంతో మంచిది. బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ తనకి ఇష్టమైన సమ్మర్ డ్రింక్ ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

Karisma Kapoor

ఒకప్పుడు బాలీవుడ్‌ను ఒక ఊపు ఊపేసిన అందాల నటి కరిష్మా కపూర్ స్క్రీన్‌పై ఇప్పుడు పెద్దగా కనిపించట్లేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటారు. రీసెంట్‌గా వేసవికాలంలో తనకి ఇష్టమైన పానీయం షేర్ చేసుకుంటూ పోస్ట్ పెట్టారు. ఇక వేసవిలో ఎండ వేడిని తట్టుకోవాలంటే ఎలాంటి పానీయాలు తీసుకోవాలి.. అంటే

Curd Rice In Summer : వేసవిలో ఎండల తీవ్రత నుండి శరీరాన్ని చలబరిచే పెరుగన్నం !

ఎండలో బయట తిరిగి ఇంటికి రాగానే గ్లాసుడు చల్లటి పానీయం తాగాలి అనిపిస్తుంది. అలా తాగడం వల్ల ఎక్కడ లేని శక్తి వస్తుంది. చాలామంది వేసవిలో ఇంట్లోనే రకరకాల పానీయాలను తయారు చేసుకుంటారు. తాజాగా బాలీవుడ్ నటి కరిష్మాకపూర్ తనకి ఇష్టమైన సమ్మర్ డ్రింక్‍ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. పుదీనా ఆకులు వేసిన నిమ్మరసం ఉన్న గ్లాసుని పట్టుకుని ఇది ”వేసవి సమయం” అంటూ ట్యాగ్ చేశారు. కరిష్మాకి ఇష్టమైన నేచురల్ డ్రింక్ చూసారుగా .. అయితే సమ్మర్‌లో ఎండ వేడి నుంచి మనకు ఉపశమనాన్ని ఇచ్చే మరికొన్ని డ్రింక్స్ ఉన్నాయి.

 

జీలకర్ర పొడి,నిమ్మరసం, నల్ల ఉప్పు నీటిలో కలిపి తాగినా ఎండ వేడికి శక్తి వస్తుంది. దీనికే మసాలా షికంజీ అని పేరు. ఇంట్లో రెగ్యులర్‌గా ఉండే మజ్జిగ ఎండనుంచి చాలా ఉపశమనం ఇస్తుంది. మజ్జిగ తాగితే బరువు కూడా తగ్గుతారట. అయితే ఈ మజ్జిగలో జీలకర్ర పొడిని కలుపుకుంటే మరింత మంచిది.

Lassi : వేసవిలో శరీరానికి మేలు చేసే లస్సీ!

ఆమ్రాసా గురించి అందిరికి తెలిసిందే.. మామిడిపండు గుజ్జు, నిమ్మరసం, కాస్త మసాలా పొడి కలిపి తాగితే ఆహా అనాల్సిందే. దీనినే పూరీలలో నంజుకుని కూడా తింటారు. చెరకురసం కూడా ఈ సీజన్‌లో తాగడం మరింత మంచిది. చెరకురసం ఒత్తిడిని తగ్గిస్తుంది. అయితే ఇందులో కొంచెం నిమ్మరసం, చిటికెడు ఉప్పు కలిపితే మరింత టేస్టీగా ఉంటుంది. ఇలాంటి వేసవి పానీయాలు తరచుగా తీసుకోవడం వల్ల ఎండ వేడి నుంచి ఉపశమనం పొందవచ్చును.