Lassi : వేసవిలో శరీరానికి మేలు చేసే లస్సీ!

వేసవిలో లస్సీ సూర్యరశ్మి నుండి కాపాడుతుంది. ఇందులోని ఆరోగ్యకరమైన ప్రోటీన్ ఎముక సాంద్రతను మెరుగుపరుస్తుంది. చల్లటి లస్సీ తాగితే వేసవి తాపం నుంచి విముక్తి పొందడమే కాదు మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవచ్చు.

Lassi : వేసవిలో శరీరానికి మేలు చేసే లస్సీ!

Lassi

Updated On : June 4, 2022 / 3:46 PM IST

Lassi : లస్సీ అద్భుతమైన రుచికరమైన పానీయం. దీనిని చాలా మంది ఇంట్లోనే సులభంగా తయారు చేసుకుని సేవిస్తారు. లస్సీ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. అందుకే చాలా మంది లస్సీని ఇష్టంగా తాగేస్తుంటారు. పాల తో సమృద్ధిగా లస్సీలోని ప్రోబయోటిక్ కంటెంట్ జీర్ణక్రియకు తోడ్పడుతుంది. ఇందులోని లాక్టోబాసిల్లస్ ప్రేగు కదలికలను కూడా సులభతరం చేస్తుంది. ఒక గ్లాసు లస్సీలో దాదాపు 50-80 కేలరీలు ఉంటాయి. ఎక్కువ సేపు ఆకలి కాకుండా కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. దీని వల్ల ఆకలి అనిపించదు. బరువు కూడా సులభంగా తగ్గవచ్చు.

వేసవి కాలంలో లస్సీ తీసుకోవటం వల్ల డీహైడ్రేషన్‌ను నివారించడానికి శరీరాన్ని చల్లగా ఉంచుకోవచ్చు. లస్సీ తాగడం వల్ల శరీరానికి పొటాషియం, ప్రొటీన్, కాల్షియం, ఫాస్పరస్ వంటి పోషకాలు అందుతాయి. B12తోపాటు అనేక విటమిన్లు ఉన్నాయి, లస్సీ జీర్ణాశయానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజూ ఒక గ్లాసు లస్సీని తీసుకుంటే, అది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా మధ్యాహ్నం పూట లస్సీ తాగడం చాలా మంచిది.

వేసవిలో లస్సీ సూర్యరశ్మి నుండి కాపాడుతుంది. ఇందులోని ఆరోగ్యకరమైన ప్రోటీన్ ఎముక సాంద్రతను మెరుగుపరుస్తుంది. చల్లటి లస్సీ తాగితే వేసవి తాపం నుంచి విముక్తి పొందడమే కాదు మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. వేసవిలో చెమట రూపంలో బయటకు వెళ్ళే నీటి స్దాయిలను తిరిగి నింపుకోవటానికి లస్సీ దోహదపడుతుంది. ఇందులో ఉండే కాల్షియం కారణంగా ఎముకలు ధృఢంగా మారతాయి.

శరీరాన్ని చల్లగా ఉంచి ఎండవేడి నుండి కాపాడుతుంది. ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా వల్ల మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. శరీరానికి కావాల్సిన మంచి బ్యాక్టీరియా లస్సీ ద్వారా మనకు అందుతుంది. పనిలో అలసిపోయిన సందర్భంలో ఒక గ్లాసు చల్లని లస్సీ తాగితే శరీరం తిరిగి శక్తి పుంజుకుని యాక్టివ్ గా మారుతుంది.