చైనా లాక్‌డౌన్ విజయంతో కరోనాతో పోరాడే ప్రపంచానికి చిగురిస్తున్న ఆశలు

  • Publish Date - March 25, 2020 / 01:06 PM IST

అమెరికా దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తితో లాక్ డౌన్ విధిస్తున్నాయి. యుకే సహా ఇతర దేశాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇటలీ, చైనా నుంచి నేర్చుకున్న కరోనా పాఠాలతో అప్రమత్తమైన మిగతా దేశాలు లాక్ డౌన్ విధించి కరోనాను నియంత్రించే ప్రయత్నాలు చేస్తున్నాయి. కరోనాకు కేంద్రమైన వుహాన్ సిటీలో క్వారంటైన్ ఎత్తేసింది చైనా ప్రభుత్వం. కరోనా కంట్రోల్లోకి రావడంతో చైనా వాసులంతా నెమ్మదిగా రోడ్లపైకి వస్తున్నారు.

మరోవైపు ప్రపంచ దేశాల్లో కరోనా వ్యాప్తి ప్రబలుతోంది. భారత్ సహా పలు దేశాలు లాక్ డౌన్ విధించాయి. ఒక్కో దేశంలో అక్కడి వైరస్ తీవ్రతనుబట్టి క్వారంటైన్ విధిస్తున్నాయి. వైద్యసదుపాయాలు, ఆరోగ్య భద్రత వ్యవస్థ వంటి అంశాలతో అవసరమైన చర్యలను కొనసాగిస్తున్నాయి. దక్షిణ కొరియా మాత్రం కరోనాను విజయవంతంగా నియంత్రించింది.

భారీ మొత్తంలో క్వారంటైన్లు, టెస్టింగ్, కాంటాక్ట్ ట్రేసింగ్ వంటి అంశాలపై పెద్దగా ఆధారపడకుండానే కరోనాను కంట్రోల్ చేసింది సౌత్ కొరియా. కరోనా వైరస్ నియంత్రణకు ఎంతకాలం పాటు చర్యలు కొనసాగించాల్సిన అవసరం ఉంది అనే ప్రశ్న తలెత్తుతోంది. Harvard T.H. Chan School of Public Health లోని ఎపిడమోలజీ ప్రొఫెసర్ మార్క్, లిప్‌స్టిక్.. సామాజిక దూరంతో పోలుస్తూ కొండపైనుంచి వేగంగా కిందికి దూసుకొస్తున్న కారుకు బ్రేకులు వేయాలన్నారు.

కారు బ్రేక్ పై కాలుతో పట్టి ఉంచినప్పటికీ గ్రావిటీ మాత్రం కారును ముందుకు దూసుకెళ్లేలా ప్రేరేపిస్తుందని అన్నారు. అలాగే కరోనాను ప్రారంభంలో కట్టడి చేస్తేనే దాని వేగం నియంత్రణంలోకి వస్తుందని చెప్పారు. లేదంటే మరిన్ని కేసులు నమోదై పరిస్థితి ప్రాణాంతకంగా మారుతుందని హెచ్చరించారు. ఇప్పటివరకూ కరోనా వైరస్ నియంత్రించడంలో నాలుగు దేశాలు ఎలాంటి చర్యలు చేపట్టాయో ఓసారి పరిశీలిద్దాం..
చైనా :
చైనాలో కరోనా నియంత్రణలోకి వచ్చినప్పటినుంచి ఇప్పటివరకూ కొత్త కేసులు నమోదు కాలేదు. కరోనా కేసుల సంఖ్య జీరోకు పడిపోయింది. హువే ప్రావిన్స్ లో 60మిలియన్లకు పైగా ప్రజలను భారీ స్థాయిలో క్వారంటైన్ చేసింది చైనా ప్రభుత్వం.

దాదాపు 8 వారాల పాటు క్వారంటైన్ చేయడంతో కరోనా దెబ్బకు కంట్రోల్లోకి వచ్చింది. ఇప్పుడు పరిస్థితి అదుపులోకి రావడంతో కరోనా కేంద్రమైన వుహాన్ సిటీలో ఏప్రిల్ 8న లాక్ డౌన్ ఎత్తివేసే యోచనలో ఉంది డ్రాగన్ దేశం. మరోవైపు ఇతర ప్రపంచ దేశాల్లో మాత్రం కరోనా ప్రబలడంతో లాక్ డౌన్ దిశగా కొనసాగుతున్నాయి.

చైనా తిరిగి పనుల్లోకి :
కొత్త కరోనా కేసులు తగ్గిపోవడంతో ప్రపంచ పారిశ్రామిక దిగ్గజమైన చైనా నెమ్మదిగా తిరిగి పనుల్లోకి వెళ్తోంది. ఇప్పుడుప్పుడే అన్ని తెరుచుకుంటున్నాయి. ఫ్యాక్టరీలు కూడా పున:ప్రారంభమవుతున్నాయి. కరోనా నుంచి ఉపశమనం పొందిన హుబే ప్రావిన్స్ జనమంతా ఊపిరిపీల్చుకుంటున్నారు. అక్కడి వర్కర్లంతా గతంలో మాదిరిగానే తమ పనుల్లోకి వెళ్లిపోతున్నారు.

సౌత్ కొరియా :
దక్షిణ కొరియాలో కొవిడ్-19 పేషెంట్లను గుర్తించడంలో అక్కడి ప్రభుత్వం సక్సెస్ సాధించింది. దేశవ్యాప్తంగా కరోనా బాధితులను గుర్తించేందుకు వేగంగా చర్యలు చేపట్టింది. అంతటా లాక్ డౌన్ చేసి కాంటాక్ట్ వైరస్ సోకకుండా ఉండేలా కఠినమైన చర్యలు చేపట్టి కరోనాను కట్టడి చేయడంలో విజయం సాధించింది. ఫిబ్రవరిలో ఓ గ్రూపు సభ్యుల్లో ఒకరికి కరోనా పాజిటీవ్ అని తేలగానే అక్కడి నుంచి దాదాపు 212,000 మంది సభ్యులకు టెస్టులు ఆరోగ్యాధికారులు నిర్వహించారు.

ఇటలీలో మహమ్మారి విజృంభణ:
మరోవైపు ఇటలీ అధికారులు.. తమదేశంలో రికార్డు స్థాయిలో కరోనా మరణాలు సంభవించినట్టు వెల్లడించారు. రెండు వారాల పాటు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కరోనా వైరస్ తీవ్రత మహమ్మారిగా మారిపోయింది. రోజుకు వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వేలాది కేసులు నమోదు అవుతున్నాయి.

వైరస్ వ్యాప్తి ప్రారంభంలో నిర్లక్ష్యంతో ఆలస్యంగా స్పందించడం కారణంగానే ఈ దుస్థితి వచ్చిందని నిపుణులు అంటున్నారు. వైద్యపరంగా ఎన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా పిట్టల్లా రాలిపోతున్న కరోనా మృతులను ఆపలేకపోకపోతోంది. మంగళవారం నాటికి ఇటలీలో కరోనా కేసుల సంఖ్య తీవ్ర స్థాయికి పెరిగినట్టు అధికారులు వెల్లడించారు.

రెండో కరోనా కేంద్రంగా అమెరికా? :
అమెరికాలో కూడా కరోనా వైరస్ నియంత్రణపై పోరాటం చేస్తోంది ఆదేశం.. ఒహియో, న్యూయార్క్, కాలిఫోర్నియా నుంచి వ్యాగర్ అడ్వైస్ వంటి రాష్ట్రాల్లో మొత్తంగా లాక్ డౌన్ విధించింది. పెద్ద స్థాయిలో జనం గుమిగూడకుండా ఇంట్లోనే ఉండి పనిచేసుకునేలా ప్రోత్సహిస్తోంది. కానీ, వైరస్ ఇన్ఫెక్షన్లు భారీగా పెరిగిపోతున్నాయి. చైనా వుహాన్ సిటీ తర్వాత మరో కొత్త కరోనా కేంద్రంగా అమెరికా మారబోతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి మార్గారెట్ హరీస్ ఒక ప్రకటనలో వెల్లడించారు.