Celery Juice Bebefits
సెలెరీ.. ఈ పదార్ధం గురించి తెలియకపోవచ్చు కానీ, ఇది అందించే ఆరోగ్య ప్రయోజనాలు గిరించి తెలిస్తే మాత్రం అస్సలే విడిచిపెట్టరు. సెలరీ ఆకుల జ్యూస్ గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. మిగతా జ్యూస్ లలా కాకుండా సెలరీ జ్యూస్ ను ఆకుల నుండి తయారు చేస్తారు. దీని గురించి భారతదేశంలో ఎక్కువగా తెలియకపోవచ్చేమో గానీ విదేశాల్లో మాత్రం ఫుల్లు డిమాండ్. అక్కడివాళ్లు సెలెరీని జ్యూస్, సలాడ్లలో ఎక్కువగా ఉపయోగిస్తారు.
సెలెరీ ఆకుల్లో అనేక పోషక పదార్థాలు ఉన్నాయి. నిజానికి సెలెరీ జ్యూస్ అనేది బాడీ డిటాక్స్ జ్యూస్ గా చాలా ఫెమస్. మరీ ముఖ్యంగా ఎండాకాలంలో సెలెరీ జ్యూస్ తాగడం వల్ల అనేక ప్రయోజనాలను ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. ఇది శరీరంలోని అంతర్గత వేడిని తగ్గించి కాలేయం, మూత్రపిండాలు చల్లగా ఉండేలా చేస్తుంది. అంతేకాకుండా వాటిని శుభ్రపరుస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. సెలెరీ జ్యూస్ ను పోషకాల బ్యాంకు అని చెప్పొచ్చు. ఒక గ్లాసు సెలెరీ జ్యూస్‌లో 9 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 2 గ్రాముల ప్రోటీన్, 0.5 గ్రాముల కొవ్వు, 4 గ్రాముల చక్కెర ఉంటాయి. వీటితోపాటు ఫోలేట్, విటమిన్ కె, విటమిన్ సి, పొటాషియం లాంటి పోషకాలు కూడా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
సెలెరీ జ్యూస్ గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ప్రత్యేకమైన ఫైటోకెమికల్ ఉంటుంది. ఇది రక్తనాళాల గోడలను సడలించడంతోపాటు కండరాలకు స్థితిస్థాపకతను అందిస్తుంది. రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. వేసవిలో శరీరం డీహైడ్రేట్ అవుతుంది. సెలరీలో నీరు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎండాకాలంలో సెలరీ జ్యూస్ తాగడం వల్ల బడీ హైడ్రేట్ అవుతుంది. అంతేకాదు శరీరంలోని అంతర్గత వేడిని తగ్గించడంలో సహాయపడుతుంది. సెలెరీకి శీతలీకరణ ప్రభావం కూడా ఉంది.
ఉదయం పూట ఖాళీ కడుపుతో సెలెరీ జ్యూస్ తాగడం వల్ల కాలేయం, మూత్రపిండాలు చల్లబడుతాయి. జీర్ణవ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. కాబట్టి, శరీరం శక్తివంతంగా తయారవుతుంది. సెలెరీ రసంలో ఉండే ఫ్లేవనాయిడ్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీలుగా పనిచేసి కణాలలో వాపు, నొప్పిని తగ్గిస్తాయి. దీనిలో ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులను నయం చేసే గుణాలు కూడా అధికంగా ఉన్నాయి. సెలెరీ రసంలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది.