యువతికి నెలసరి: రైల్వే తక్షణ సాయం  

మహిళల్లో నెలసరి రావడం కామన్. అయితే కొన్నిసార్లు ప్రయాణ సమయాల్లో మహిళలు ఎంతో ఇబ్బంది పడుతుంటారు.

  • Publish Date - January 18, 2019 / 05:26 AM IST

మహిళల్లో నెలసరి రావడం కామన్. అయితే కొన్నిసార్లు ప్రయాణ సమయాల్లో మహిళలు ఎంతో ఇబ్బంది పడుతుంటారు.

మహిళల్లో నెలసరి రావడం కామన్. అయితే కొన్నిసార్లు ప్రయాణ సమయాల్లో మహిళలు ఎంతో ఇబ్బంది పడుతుంటారు. శానిటరీ నాఫ్ కిన్ అవసరమైనప్పుడు స్నేహిుతులతో, బంధువులకు కోడ్ భాషలో చెప్పినా అర్థం చేసుకోలేని పరిస్థితి ఎదురవుతుంటుంది. అలాంటి అనుభవమే రైల్లో ప్రయాణిస్తున్న ఓ యువతికి ఎదురైంది. సమయానికి దగ్గర శానిటరీ నాఫ్ కిన్, ట్యాబ్లెట్లు, ప్యాడ్లు లేక నెలసరితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ఆ విషయాన్ని బయటకు చెప్పుకోలేక ఎంతో మదనపడింది. చివరికి నెలసరి విషయాన్ని తన స్నేహితుడికి చెప్పింది. స్నేహితుడి చొరవతో రైల్వే శాఖ స్పందించింది. ప్రయాణికుల సమస్యలను టెక్నాలజీ సాయంతో పరిష్కరిస్తున్న రైల్వే శాఖ తన ఔదర్యాన్ని చాటుకుంది. రైల్లో నెలసరితో బాధపడుతున్న యువతికి అవసరమైన ట్యాబ్లెట్లు, ప్యాడ్లు అందించింది. అసలేం జరిగిందంటే… బెంగళూరు నుంచి బళ్లారికి రైల్లో ప్రయాణిస్తున్న యువతికి నెలసరి వచ్చింది. అది ఎలా చెప్పాలో ఆమెకు తెలియలేదు. వెంటనే బాత్ రూంలోకి వెళ్లి తన స్నేహితుడికి ఫోన్ చేసి చెప్పింది.

అతడు మరో రైల్లో ప్రయాణిస్తున్నాడు. వెంటనే ‘ఇండియన్‌ రైల్వేస్‌ సేవ’ యాప్‌ను ఆశ్రయించాడు. రాత్రి 11 గంటల సమయంలో రైల్వే మంత్రికి ట్వీట్‌ చేశాడు. ఆరు నిమిషాల్లోనే అధికారులు యువతి ఉన్న బోగీ వద్దకు చేరుకున్నారు. ఆమె వివరాలను నోట్ చేసుకున్నారు. యువతికి కావాల్సిన వస్తువులను రెడీ చేశారు. అరిసెకెరీ స్టేషన్ దగ్గరకు ట్రైన్‌ రాగానే వాటిని యువతికి అందించారు.

రైల్లో ప్రయాణించే మహిళలు ఎవరైనా ఇలాంటి సమస్యలు ఎదురైతే వెంటనే 138 నెంబర్ ను సంప్రదించాలని సూచించారు. మరోవైపు కోల్ కతా యూత్ మహిళల కోసం శానిటరీ నాఫ్ కిన్ వెండింగ్ మిషన్లను ఏర్పాట్లు చేయనున్నారు. ఇందుకు కోసం ఓ మొబైల్ యాప్ ను రూపొందిస్తున్నారు. ఈ యాప్ సాయంతో మహిళలు వెండింగ్ బాక్స్ లు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించేందుకు వీలుంటుంది.