Paneer Quality Checking Tips At Home
పనీర్.. ఈ పదార్థం ఇష్టం లేని వాళ్లంటూ ఎవరు ఉండదు. కాస్త మసాలా వేసి వండితే లొట్టలేసుకుంటూ తింటారు. ఎంతో మృదువుగా, రుచికరంగా ఉండే పనీర్ ని చాలా రకాల వంటకాల్లో వాడుతున్నారు. ముఖ్యంగా శాఖాహారులకు పనీర్ బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. పనీర్ లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే మార్కెట్ లో దీని డిమాండ్ చాలా పెరిగింగి. ఈ విషయాన్నీ గ్రహించిన తయారీదారులు పనీర్ ను కల్తీ చేస్తున్నారు. ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా పనీర్ కల్తీకి సంబందించిన వీడియోలు వైరల్ అయ్యాయి. అలాంటి పనీర్ తినడం వల్ల అనేకరకాల కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. ఇక అప్పటినుండి పనీర్ నాణ్యతను తెలుసుకోవడానికి, తాము తింటున్న పనీర్ సహజమైనదా.. కాదా.. అని తెలుసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళు ఇంట్లోనే సులభంగా పనీర్ నాణ్యతను చెక్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
డిటర్జెంట్: బట్టలు శుభ్రం చేసుకోవడం కోసం ఉపయోగించే డిటర్జెంట్, పంట పొలాల్లో వాడే యూరియా లాంటి పదార్థాలను పాలతో కలిపి పనీర్ తయారు చేస్తున్నారు. అలాంటి కల్తీ పనీర్ తినడం వల్ల వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, అవయవాలు దెబ్బతినడం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
పాల పొడి: ఇటీవల జరిగిన తనీకలల్లో బయటపడ్డ విషయం ఏంటంటే? పనీర్ తయారీలో పాలకు బదులుగా పాల పొడిని, కండెన్స్‌డ్ మిల్క్ ను వాడుతున్నారు. ఇలాంటి పనీర్ లో సహజ లక్షణాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి, మనం తినే పనీర్ రుచుకరంగా మాత్రమే ఉంటే సరిపోదు సురక్షితమైనది కేసుల ఉండాలి.
మైదా: ఈ మధ్య కాలంలో చాలా మంది పనీర్ లో మైదాను కలిపి తయారుచేస్తున్నారు. అలా చేయడం వల్ల పనీర్ బరువు పెరుగుతుంది. అంతేకాదు సహజంగా పనీర్ లో ఉండే పోషక విలువలు కూడా తగ్గుతాయి. దీని వల్ల జీర్ణ సమస్యలు రావచ్చు.
ఫార్మాలిన్: పనీర్ ఎక్కువ కాలం నిలువ ఉండటానికి అందులో ఫార్మాలిన్ వంటి రసాయనాలు కలుపుతున్నారు. ఈ పనీర్ తినడం వల్ల క్యాన్సర్, కాలేయం, అలెర్జీలు సమస్యలు వస్తాయి.