New Covid Variant in India : భారత ఎయిర్ పోర్టులో కరోనా కొత్త రకం వైరస్ కలకలం సృష్టిస్తోంది. బ్రిటన్ లో కొత్త స్ట్రెయిన్ పై ప్రపంచమంతా భయాభ్రాంతులకు గురవుతున్న సమయంలో యూకే నుంచి భారతదేశానికి వచ్చిన 8 మంది ప్రయాణికులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తోంది.
ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఐదుగురికి, కోల్ కతాలో ఇద్దరికి, చెన్నైకి ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే ఇది కరోనా కొత్త స్ట్రెయిన్ అవునో కాదో తేల్చే పనిలో ఉన్నారు అధికారులు. ఇక శాంపిళ్లను ల్యాబ్ లో పరిశోధనకు పంపించారు.
గత రాత్రి యూకే నుంచి ప్రయాణికులు భారత్ వచ్చినట్టు అధికారులు తెలిపారు. భారత్ లోకి కరోనా కొత్తరకం వైరస్ పాజిటివ్ కేసులు రావడంతో ప్రభుత్వం అప్రమత్తం అయింది. రాష్ట్ర ప్రభుత్వాలను కూడా అప్రమత్తం అయ్యాయి. యూకే సహా ఇతర దేశాల నుంచి వచ్చేవారిని టెస్టులు నిర్వహిస్తున్నారు.
మరోవైపు.. ఈ కరోనా కొత్త రకం వైరస్ చిన్నారుల్లో తొందరగా సోకే ప్రమాదం ఉందంటున్నారు సైంటిస్టులు.. ‘VUI-202012/01’ పేరుతో కరోనా వైరస్ వేరియంట్ యూకేలో విజృంభిస్తోంది. లండన్ సహా ఆగ్నేయ ఇంగ్లండ్‌లో కొత్త రకం వైరస్ ఇన్ఫెక్షన్లు భారీగా పెరిగిపోయాయని అక్కడి వైద్య అరోగ్య శాఖ అధికారి వెల్లడించారు.