మీ ఆరోగ్యం డేంజ‌ర్‌లో : నైట్ షిప్ట్ చేస్తున్నారా?

మీలో ఎవరైనా నైట్ షిప్టులు ఎక్కువగా చేస్తున్నారా? జాగ్రత్త. మీ డీఎన్ఏకు ముప్పు పొంచి ఉంది. నైట్ షిప్టులు ఎక్కువగా చేస్తున్నవారిలో హ్యుమన్ డీఎన్ఏ నిర్మాణం దెబ్బతినేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఓ అధ్యయనం చెబుతోంది.

మీలో ఎవరైనా నైట్ షిప్టులు ఎక్కువగా చేస్తున్నారా? జాగ్రత్త. మీ డీఎన్ఏకు ముప్పు పొంచి ఉంది. నైట్ షిప్టులు ఎక్కువగా చేస్తున్నవారిలో హ్యుమన్ డీఎన్ఏ నిర్మాణం దెబ్బతినేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఓ అధ్యయనం చెబుతోంది.

మీలో ఎవరైనా నైట్ షిప్టులు ఎక్కువగా చేస్తున్నారా? జాగ్రత్త. మీ డీఎన్ఏకు ముప్పు పొంచి ఉంది. నైట్ షిప్టులు ఎక్కువగా చేస్తున్నవారిలో హ్యుమన్ డీఎన్ఏ నిర్మాణం దెబ్బతినేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఓ అధ్యయనం చెబుతోంది. మానవుని డీఎన్ఏ ఓసారి దెబ్బతింటే అనేక రోగాలు కేన్సర్, డయాబెటిస్, గుండె జబ్బులు, న్యూరోలాజికల్ వంటి ఎన్నో జబ్బులకు దారితీస్తుందని పరిశోధకుల అధ్యయనం హెచ్చరిస్తోంది. అనేస్థేషియా అకాడమిక్ జనరల్ లో ఈ అధ్యయాన్ని ప్రచురించారు.

 

ఈ అధ్యయనం ప్రకారం.. డీఎన్ఏ రిఫైర్ జనే ఎక్స్ ప్రెషన్ రిఫైర్ చేసే ప్రక్రియ నైట్ షిఫ్ట్ ఎక్కువగా చేస్తున్నవారిలో మందగించినట్టు గుర్తించారు. హాంగ్ కాంగ్ యూనివర్శిటీకి చెందిన వైద్యుల బృందం 28 ఏళ్ల నుంచి 33 ఏళ్ల వయస్సు (మూడు రోజులు సరైన నిద్రలేని) ఉన్నవారిలో ఉదయాన్నే బ్లడ్ శాంపుల్స్ ను పరీక్షించారు. నైట్ షిఫ్ట్ ఎక్కువ చేసేవారిలో సరైన నిద్రలేని వారి బ్లడ్ శాంపిల్స్ ను కూడా ఉదయాన్నే తీసి పరీక్షించారు. నైట్ షిప్ట్ చేసే ఉద్యోగులకు సరైన నిద్ర పట్టదు. పగలు నిద్ర కంటే.. రాత్రి నిద్రే ఆరోగ్యానికి ఎంతో మేలుని ఎన్నో పరిశోధనలు వెల్లడించాయి. రాత్రంతా నిద్ర పోకుండా ఉద్యోగం చేస్తున్న వారిలో డీఎన్ఏ పనితీరు క్రమంగా మందగించినట్టు పరిశోధనలో తేలింది.

నైట్ షిప్ట్ చేసే ఉద్యోగుల్లో కంటే డే టైమ్ లో డ్యూటీ చేసేవారిలో 30 శాతం వరకు డీఎన్ఏ బ్రేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. దీనికితోడు సరైన నిద్ర లేకపోవడంతో డీఎన్ డ్యామేజ్ 25 శాతం వరకు పెరిగినట్టు గుర్తించారు. ‘‘డీఎన్ఏ బేసిక్ స్ట్రక్చర్ లో మార్పులు సంభవించడాన్ని డీఎన్ఏ డ్యామేజీ గా పిలుస్తారు. డీఎన్ఏ ఆకారంలో మార్పులు వస్తే దాన్ని తిరిగి రిఫైర్ చేయడం కష్టంతో కూడుకున్న పని’’ అని హాంగ్ కాంగ్ యూనివర్శిటీ రీసెర్చ్ అసోసియేట్ ఎస్. డబ్ల్యూ చోయ్ తెలిపారు. డీఎన్ఏలో రెట్టింపు స్థాయిలో బ్రేక్స్ వచ్చినప్పుడు జన్యురాశీలో అస్థిరత్వం ఏర్పడి ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది.

ఫలితంగా అందులోని కణాలు చనిపోయి తిరిగి పునరుద్ధరించలేని స్థితికి చేరుకుంటుందని ఆయన చెప్పారు. సరైన నిద్రలేనివారిలో డీఎన్ఏ డ్యామేజ్ తీవ్రస్థాయిలో ఉన్నట్టు పరిశోధనలో తేలినట్టు చోయ్ తెలిపారు. డీఎన్ఏ దెబ్బతినడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే ఎన్నో పరిశోధనల్లో రుజువైందని చోయ్ చెప్పారు. డీఎన్ఏ డ్యామేజ్ తో నిద్రలేమికి మధ్య ఉన్న సంబంధంపై లోతుగా పరిశోధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చోయ్ సూచించారు.