ఎవరూ తప్పించుకోలేరు: భారత్‌ మొదటి కరోనా బాధితుడికి చికిత్స చేసిన డాక్టర్‌కు పాజిటీవ్  

  • Publish Date - March 18, 2020 / 07:25 AM IST

కరోనా వైరస్ బారి నుంచి ఎవరూ తప్పించుకోలేరు. కరోనా వైరస్‌కు మందులేదు.. కేవలం కరోనా సోకకుండా నివారణ చర్యలు మాత్రమే తీసుకోవడమే మిగిలింది.. అంతకంటే చేసేది ఏమి ఉండదు.. చైనాలో ఉద్భవించిన కరోనా వైరస్.. భారత్ సహా ఇతర ప్రపంచ దేశాలకు పాకుతోంది. విదేశాల నుంచి భారత్‌కు వచ్చిన 76ఏళ్ల మొదటి కరోనా బాధితుడు మార్చి 11న మృతిచెందిన సంగతి తెలిసిందే.

భారత్ మొదటి కరోనా బాధితుడికి చికిత్స అందించిన 63ఏళ్ల వైద్యుడికి కూడా కరోనా వైరస్ సోకినట్టు తేలింది. అతడికి నిర్వహించిన టెస్టుల్లో కరోనా పాజిటీవ్ అని నిర్ధారించారు. హైదరాబాద్ లోని ప్రైవేట్ మెడికల్ ఫెసిలిటీలో కరోనా లక్షణాలతో వైద్యుడు చేరకమందు కర్ణాటకలోని కలబురాగిలో బాధితుడికి ఈ డాక్టరే చికిత్స అందించారు. డాక్టర్ బ్లడ్ శాంపిల్స్ బెంగళూరులోని వైరాలాజీకి పంపారు. జిల్లా డిప్యూటీ కమిషనర్ (DC) బి. శరత్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. కానీ, దీనిపై మరిన్ని ప్రశ్నలను లెవనెత్తుతోంది.

తన ఫ్యామిలీ సభ్యులతో పాటు ఇంట్లోనే నిర్బందంలో ఉన్నట్టు రిపోర్టు తెలిపింది. మరోవైపు అధికార యంత్రాంగం ఈఎస్ఐ ఆస్పత్రుల్లో 200 పడకల ఐసోలేషన్ వార్డును కూడా ప్రారంభించింది. అయినప్పటికీ బాధితుడు ఐసోలేషన్ వార్డుకు వెళ్లలేదు. మార్చి 15న తన 45ఏళ్ల కుమార్తె టెస్టు పాజిటీవ్ తేలిన తొలి బాధితురాలిగా గుర్తించినప్పటి నుంచి ఆయన తన ఇంట్లోనే నిర్బందాన్ని కొనసాగిస్తున్నారు.

ఆరోగ్య అధికారుల ప్రకారం.. డాక్టర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఆయన్ను తిరిగి ఐసోలేషన్ వార్డుకు తరలిస్తున్నారా? లేదా అనేది మీడియాకు వెల్లడించేలేదు. ఇప్పటివరకూ కలబురాగిలో మొత్తం 3 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో ఒకరు మృతిచెందారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 10కి చేరింది. కలబరాగిలో 350 మందిని పర్యవేక్షణలో ఉంచగా, డాక్టర్ సహా 9 మందిని ఐసోలేషన్ వార్డులో ఉంచారు.

Also Read | రిటైర్ జడ్జీలు ‘రిటైర్’ ఎందుకు కావడం లేదు..నామినేటెడ్ పోస్టులు ఎందుకు తీసుకుంటున్నారు