cleanliness of underwear during monsoons
Cleanliness During Monsoons : తేమతో కూడిన రుతుపవనాలు, వర్షాకాలం ప్రారంభం కావడం వల్ల ఇన్ఫెక్షన్ కలిగించే బ్యాక్టీరియా, వైరస్‌లు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. జిడ్డుగా ఉండే చర్మం, ఒళ్లు నొప్పులు మాత్రమే ఈ సీజన్‌లో వచ్చే సమస్యలు కాదు. ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులు, వాతావరణంలోని తేమ కారణంగా చాలా సులభంగా ఫంగస్, బ్యాక్టీరియా, ఈస్ట్ ఇన్ఫెక్షన్‌లు అభివృద్ధి చెందుతాయి, ఇవి చివరికి అనేక యోని ఇన్ఫెక్షన్‌లకు దారితీస్తాయి. అందువల్ల లోదుస్తులతోపాటు జననాంగాల పరిశుభ్రత విషయంలో జాగ్రత్తలు పాటించటం కీలకం.
వర్షకాలంలో లోదుస్తుల ఎంపిక విషయంలో ; వర్షాకాలం అంటువ్యాధులు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఈ సీజన్‌లో కాటన్, బ్రీతబుల్ అండర్‌గార్మెంట్స్ ధరించడం చాలా ముఖ్యం. ఊపిరాడని, గాలి తగలని, ఎక్కవ చెమటపట్టించే దుస్తులు ఏమాత్రం ధరించరాదు. ఈ తరహా దుస్తులు బ్యాక్టీరియా పెరుగుదలకు అనువైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. ముఖ్యంగా మహిళలు యోని ప్రాంతాన్ని పొడిగా , సౌకర్యవంతంగా ఉంచే ప్యాంటీలను ధరించడం అత్యవసరం. ఎక్కువగా చెమట పట్టే సమస్యను ఎదుర్కొంటే తరచుగా శుభ్రం చేసి, పొడిగా ఉండేలా చూసుకోవాలి. పొడిగా ఉంచడం వల్ల బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ మరియు దుర్వాసన లేకుండా ఉంటుంది.
పీరియడ్స్ సమయంలో జాగ్రత్త ; వర్షకాలంలో తేమ సాధారణంగా చికాకు కలిగిస్తుంది. వర్షాకాలంలో పీరియడ్స్ సమయంలో సరైన పరిశుభ్రతను నిర్వహించడం చాలా కీలకం. యోని సన్నిహిత ప్రాంతం ఎల్లప్పుడూ శుభ్రంగా, పొడిగా ఉండేలా చూసుకోవాలి. రుతుక్రమ ఉత్పత్తులను తరచుగా మార్చుకోవాలి. ప్రతి 4-6 గంటలకు ఒకసారి వీటిని మార్చుకోవటం మంచిది.
వర్షకాలంలో ఇన్ఫెక్షన్ల భారిన పడకుండా ఉండేందుకు ; రుతుపవన తేమ అధిక చెమటను కలిగిస్తుంది. శరీర ద్రవం వల్ల ఉప్పును కోల్పోతాము. హైడ్రేటెడ్‌గా ఉండడం వల్ల మూత్ర నాళాన్ని సురక్షితంగా ఉంచుకోవచ్చు. సమస్య రాకుండా ఉండేందుకు తగినంత నీరు త్రాగటం మంచిది. దీని వల్ల శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపి, పిహెచ్ బ్యాలెన్స్‌ని మెయింటెయిన్చే యడంలో సహాయపడుతుంది. తగినంత నీరు త్రాగడం వల్ల బ్యాక్టీరియా సమతుల్యతను కాపాడుతుంది. యోని ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
అలాగే తరచుగా వర్షాకాలంలో, సన్నిహిత ప్రాంతాన్ని రోజుకు రెండుసార్లు శుభ్రం చేసుకోవటం మంచిది. అలాగే వర్షకాలంలో దుస్తులు ఉతకంటం వల్ల అవి సరిగా ఆరకపోవటం వాటినే తిరిగి వేసుకోవటం వల్ల వాటిలో ఉండే తేమ కారణంగా బ్యాక్టీరియా తయారై జననాంగాల్లో ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఏర్పడుతుంది. అందువల్ల వర్షాల సమయంలో బాగా పొడిగా ఉండే లోదుస్తులను మాత్రమే ధరించటం మంచిది. లోదుస్తులను శుభ్రపరిచే డిటర్జెంట్ల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. గాఢమైన వాసనలతో ఉండే డిటర్జెంట్లు వాడకపోవడం మంచిది.
వ్యాయామం చేసిన తర్వాత ; వర్షాకాలంలో కూడా వ్యాయామం చేసిన తర్వాత చెమటలు అధికంగా పడతాయి. ఆ సమయంలో లో దుస్తులు తడిసిపోతాయి. వాటిని అలానే ఉంచుకుంటే దురద లాంటివి వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి వ్యాయామం తర్వాత వెంటనే లో దుస్తులు మార్చుకోవాలి.