కరోనావైరస్ వ్యాక్సిన్లు ‘మహమ్మారి’ ధర కింద తక్కువకే ఇవ్వాలి?

  • Publish Date - August 6, 2020 / 07:42 PM IST

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారిని నిరోధించాలంటే వ్యాక్సిన్ తప్పనిసరి.. కరోనా వ్యాక్సిన్ వస్తేనే మహమ్మారిని కట్టడి చేసేందుకు వీలుంటుంది.. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ కోసం భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. కరోనా వ్యాక్సిన్ వచ్చేంతవరకు సామాజిక దూరం, మాస్క్ తప్పనిసరిగా వాడాలని పలు ఆరోగ్య సంఘాలు సూచిస్తున్నాయి. కరోనా వ్యాక్సిన్ మార్కెట్లోకి వస్తే.. ఎలా ఎవరికి అందుబాటులోకి తీసుకురావాలనే ప్రశ్న తలెత్తుతోంది.

కరోనా వ్యాక్సిన్ కూడా ఇతర అంటువ్యాధుల వ్యాక్సిన్ మాదిరిగానే విక్రయించేలా ఉండాలని అంటున్నారు. కరోనా వ్యాక్సిన్లు కూడా పాండమిక్ ధరలకు లోబడే ఉండాలని సూచిస్తున్నారు. ప్రజలకు కరోనా వ్యాక్సిన్ అందించాలంటే వాస్తవంగా ఎంతవరకు ఖర్చు అవుతుందో తెలియాల్సి ఉంది.. కరోనా నుంచి వ్యాక్సిన్ రక్షించగలదా? కేవలం వ్యాధిని నయం చేయగలదా? లేదా వ్యాప్తిని కూడా కంట్రోల్ చేయగలదా? ఇలాంటి మరెన్నో సందేహాలకు సమాధానం దొరకాల్సి ఉంది.



1. కోవిడ్‌పై వ్యాక్సిన్లు  పనిచేస్తాయా? :
చైనాలోని వుహాన్ ప్రావిన్స్‌లో 2019 డిసెంబర్‌లో కరోనావైరస్ మొదటి కేసును కనుగొన్నారు. అప్పటినుంచి ప్రపంచం కరోనాను కట్టడి చేసేందుకు అనేక మార్గాలను అన్వేషిస్తోంది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాక్సిన్ గ్రూపులు తమ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి. అన్నింటికంటే, ముందు రేసులో ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ, మోడరనా ఇంక్. ఉన్నాయి. కాన్సినో బయోలాజిక్స్, ఫైజర్ బయోటెక్ తర్వాతి స్థానంలో ఉన్నాయి. ఈ టీకాలన్నీ ప్రారంభ క్లినికల్ ట్రయల్స్‌లో మంచి ఫలితాలు వచ్చాయి. ధర తో పాటు అందరికి సమానంగా పంపిణీ చేయడంపైనే ఇప్పుడు అందరిలో ఆందోళన నెలకొంది.

2. వ్యాక్సిన్‌ను అందరికి అందుబాటులోకి తేవడం :
కరోనా వ్యాక్సిన్ ఆమోదానికి ముందు, పంపిణీకి సంబంధించి చాలా సందేహాలు ఉన్నాయి. అన్ని విభాగాలకు వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందా? ఇది ఆర్థికంగా ఉంటుందా? మిలియన్ల మందికి మిలియన్ల మోతాదులను ఉత్పత్తి చేస్తామని పలు కంపెనీలు హామీ ఇస్తున్నాయి.. వ్యాక్సిన్ పంపిణీ నుంచి ఏ మేరకు లాభం పొందుతాయా? అన్నదే ప్రశ్న..



3. ఏ వ్యాక్సిన్ ఎంత ధర అంటే..  :
ఫార్మా దిగ్గజాలు వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచే ప్రణాళికలను ప్రకటించేశాయి.. కొందరు పంపిణీని రిజర్వ్ చేయడానికి దేశాలతో ఒప్పందాలు సైతం కుదుర్చుకున్నారు. రాబోయే నెలల్లో తమ ప్రోటోటైప్, MRNA-1273ను ప్రారంభించనున్న మోడరనా ఇంక్, తమ టీకాను ప్రజలకు అందిస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. దీని ధర $ 32- $ 37 మధ్య ఉంటుంది (సుమారు రూ .2,400, రూ. 2,800 సమానం). సంక్షోభ సమయాల్లో టీకా తక్కువ రేటుకు లభిస్తుందని సూచిస్తోంది.. అది కూడా ‘పాండమిక్ ప్రైసింగ్’ తరహాలో ఉంటుందని కంపెనీ తెలిపింది.

4. Oxford, ఫైజర్-బయోఎంటెక్ వ్యాక్సిన్ ధర :
ప్రముఖ పోటీదారు ఆక్స్ఫర్డ్ తమ వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచడానికి అధికారుల నుంచి తగిన నిధులను పొందింది. పరిశోధకులు ధరలపై చర్చించడం లేదు.. భారతదేశంలో ఉత్పత్తిని మార్కెటింగ్ చేయబోయే సీరం ఇన్స్టిట్యూట్, టీకా ధర రూ .1000 లోపు ఉంటుందని ప్రకటించింది. ఇప్పటికే అమెరికా ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్న ఫైజర్, తమ ఉత్పత్తి ధరను 20 డాలర్ల లోపు పరిమితం చేస్తామని, ప్రజలకు అందుబాటులో ఉంచుతామని ప్రకటించింది.



5. టీకాలకు వాస్తవానికి ఎంత ఖర్చవుతుంది? :
టీకాలు, మందులు చాలా వైరస్ ను తట్టుకునే విధానాలతో రూపొందిస్తుంటారు. మోడరనా ప్రకారం.. సాధారణ ప్రజలు దానిని భరించలేకపోతే టీకా అర్థరహితమని అంటోంది.. టీకా తయారీదారులు టీకాను ఎంత ధరకు అమ్మాలనే విషయంలో తర్జనభర్జన పడిపోతున్నారు.

ఏదైనా లాభం పొందాలా, రివార్డ్ చేయాలా లేదా మానవాళికి సేవ చేయాలా అనే డైలామాలో పడిపోయారు. క్సిన్ విస్తరణపై ధర, రేషన్ కూడా ఉన్నాయి. మహమ్మారి కాలంలో సమాజంలోని ప్రతి వర్గంపై కరోనా ప్రభావితం చేసింది. ధనిక లేదా పేద అయినా, కంపెనీలు తమ టీకాకు వాస్తవంగా ఎంత ధరకు ఇస్తాయి? ప్రజలకు ఉచితంగా పొందడానికి మార్గం ఉందా? అనేది కాలమే నిర్ణయిస్తుంది.



6. ప్రజలకు అందుబాటులో వ్యాక్సిన్లు :
టీకాల తయారీదారులకు ప్రభుత్వాలు ముందస్తు ధరను చెల్లించాల్సి ఉంటుంది. టీకాల వాటాను లైసెన్స్ చేస్తుంది. ఫార్మా కంపెనీలు అభిప్రాయం ప్రకారం.. వ్యాక్సిన్‌ను మాస్ ఇనాక్యులేషన్, ఇమ్యునైజేషన్ డ్రైవ్‌ల ద్వారా ప్రజలకు అందించవచ్చు. ఏదేమైనా, దీనికి బేస్ స్థాయిలో చాలా పరిశోధనలు చేయాల్సి ఉంది.. మ్యాపింగ్ అవసరమని అంటోంది.. అయినా దీనికి చాలా సమయం పడుతుందని చెబుతోంది.

7. టీకా తక్కువ ధరకే ఇవ్వవచ్చా? :
ఒక టీకా ప్రభుత్వం పంపిణీ చేసేటప్పుడు వాస్తవానికి ప్రజలకు ఎంత ఖర్చవుతుందో దాని కంటే తక్కువ ధరకే ఉంటుంది. సంపన్న వర్గాలకు సులువుగా యాక్సస్ చేసుకునే అవకాశం ఉంటుంది. సమాన పంపిణీ చేయాల్సి ఉంది.. లేదంటే అసలు సమస్య తలెత్తుతుంది. అభివృద్ధి చెందని లేదా పేద దేశాలు మంచి పంపిణీ నెట్‌వర్క్‌ను నిర్ధారించడానికి ఏజెన్సీలు లేదా సంపన్న ప్రభుత్వాల నుండి డిస్కౌంట్ ప్యాకేజీని పొందవచ్చు.



8. సంస్థకు.. కంపెనీకి భిన్నంగా ధర :
టీకా నుండి వ్యాక్సిన్ వరకు ధర కూడా చాలా భిన్నంగా ఉంటుంది. దాని సామర్థ్యం కూడా ఎక్కువగానే ఉంటుంది.. దీనికి ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కేవలం ఒక టీకాను ఇతరులకు అందించే ముందు ఈ అంశాలను తప్పక పరిశీలించాలని సూచిస్తున్నారు.

9. ధరను పరిమితం చేయొచ్చు :
అమెరికా, యూరోపియన్ యూనియన్ సంపన్న దేశాలు వ్యాక్సిన్ సమాన పంపిణీ కోసం అభివృద్ధి చెందే దేశాలతో భాగస్వామ్యం కావాలని భావిస్తున్నారు. సాధారణంగా, టీకా ధర అనేది బీమా సంస్థలు, టీకా తయారీదారులు, కొన్నిసార్లు ప్రభుత్వాలకు సంబంధించిన విషయం.. కలిసి చర్చించాల్సిన అంశం కూడా.. హెల్త్‌కేర్ వర్కర్స్, ఫ్రంట్‌లైన్ వారియర్స్, వృద్ధులు, ఇతర అధిక ప్రమాదం ఉన్న రోగుల్లో వ్యాక్సిన్‌ మొదట ఎవరు ఇవ్వాలి అనేదానిపై ఆధారపడి ధర పరిమితులను మార్చవచ్చు. వ్యాక్సిన్ పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి రావాలంటే ముందు ఈ అంశాలన్నీంటిని పరిశీలించాలి.. అప్పుడే ఎవరికి వ్యాక్సిన్ ముందుగా అందుబాటులోకి తీసుకురావాలో నిర్ణయించవచ్చు.. అలాగే ధర పరిమితిని కూడా నిర్ణయించే అవకాశం ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు