కరోనా భయంతో కిరాణా సరుకులు కొని స్టాక్ పెట్టేందుకు మార్కెట్లకు పరుగులు!

  • Publish Date - March 19, 2020 / 04:06 PM IST

భారతదేశంలో ప్రాణాంతక కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 176 కేసులు నమోదయ్యాయి. కేంద్ర ప్రభుత్వం మరిన్ని జాగ్రత్తలు చేపడుతోంది. ఇప్పుడు ఈ ప్రభావం కాస్తా నిత్యావసర వస్తువుల మీద పడింది. కరోనా వైరస్ తీవ్రంగా ప్రబలడంతో అన్ని నగరాల్లో లాక్ డౌన్ చేసేస్తున్నారు. కరోనా భయంతో భారత్‌లోని ప్రధాన నగరాలన్ని నిర్బంధంలోకి వెళ్లిపోతున్నాయి. వ్యాపారాలన్నీ మూతపడ్డాయి. సాధ్యమైనంతవరకు ఉద్యోగులందరని ఇంటి నుంచే పనిచేయాలని ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలన్నీ సూచిస్తున్నాయి. ఈ భయంలో అందరూ కూరగాయల వినియోగం భారీగా పెరిగింది. ఇదే అదునుగా భావించి కూరగాయల షాపు యజమానులు ధరలను అమాంతం పెంచేశారు.

కరోనా భయంతో భారతీయులంతా తమ నిత్యావసర వస్తువులను ముందే కొని తెచ్చిపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అన్నిచోట్ల నిషేధం విధిస్తున్నారు. కొన్ని నగరాల్లో ఎవరిని బయటకు వెళ్లనివ్వడం లేదు. గుంపులుగా కలిసి బయట కనిపించరాదంటూ నిషేదాజ్ఞలు అమల్లోకి వచ్చేశాయి. ఈ పరిస్థితుల్లో గ్రాసరీ షాపులన్నీ మూసివేస్తే నిత్యావసర వస్తువులకు దొరకవనే భయంతో వాటిని ముందుగానే కొనిదాచిపెట్టుకోనేందుకు దేశవాసులంతా గ్రాసరీ మార్కెట్లకు పరుగులుపెడుతున్నారు. 

కిరాణా సామాగ్రి, సరకుల నిల్వ : 
కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి ప్రభుత్వం రాజధానిలోని అన్ని టోకు మార్కెట్లు, రిటైల్ దుకాణాలను మూసివేయబోతోందనే పుకార్లు వ్యాపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భయంతో జాతీయ రాజధాని నివాసితులంతా తమ కిరాణా సామాగ్రిని నిల్వ చేసుకోవడానికి మార్కెట్లకు తరలివచ్చారు. 

కిరాణా సామాగ్రి, కూరగాయలు, ఇతర నిత్యావసరాల గురించి సోషల్ మీడియాలో ప్రజలకు సలహాలు సూచనలు ఇస్తున్నారు. వివిధ రెసిడెన్షియల్ కాలనీలలో వెజిటేజీలను విక్రయించే వ్యాపారులు కూడా టోకు మార్కెట్లు త్వరలో మూసివేసే అవకాశం ఉందని పెద్ద మొత్తంలో కొనుగోలు చేయాలని ప్రజలను కోరుతున్న పరిస్థితి నెలకొంది. 

కొరత భయంతో కొనుగోలు :
కరోనావైరస్ భయాల నేపథ్యంలో భయాందోళనలకు గురికావద్దని ప్రభుత్వ అధికారులు విజ్ఞప్తి చేసినప్పటికీ, చండీగఢ్, పొరుగున ఉన్న పంజాబ్ నివాసితులు ఆహారం, ఇతర నిత్యావసర వస్తువుల కొరత భయంతో పెద్దమొత్తంలో కిరాణా కొనుగోలులో బిజీగా ఉన్నారు. లాక్డౌన్ భయం ప్రజలను సూపర్ మార్కెట్లు, దుకాణాలకు అవసరమైన వస్తువులను పెద్దమొత్తంలో కొనేందుకు పరుగులు పెడుతున్నారు.

 

అమెజాన్, కొత్త సేవియర్ :
దేశపౌరులంతా పరిమితుల లోబడి జీవితానికి అలవాటు పడుతుండగా, అమెజాన్ వంటి ఆన్‌లైన్ పోర్టల్స్ తమను తాము కొత్త రక్షకులుగా గుర్తించాయి. కరోనావైరస్ సంక్షోభంలో అమెజాన్ కొత్త పాత్రను పోషిస్తోంది. ఎందుకంటే హంకర్-డౌన్ వినియోగదారులు టాయిలెట్ టిష్యూ నుండి స్ట్రీమింగ్ టెలివిజన్ వరకు దేనికైనా టెక్ దిగ్గజం వైపు మొగ్గు చూపుతున్నారు. భారీ మౌలిక సదుపాయాలు అమెజాన్ గిడ్డంగులు, పంపిణీ, డెలివరీ, క్లౌడ్ కంప్యూటింగ్‌లను నిర్మించటానికి ప్రయత్నిస్తోంది. ఈ సంక్షోభంలో అమెజాన్ కంపెనీ కీలక పాత్ర పోషించింది.

 

మూసివేసే ఆలోచన లేదు :
ఆసియాలో అతిపెద్ద వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ అయిన ఆజాద్‌పూర్‌లో, హోల్‌సేల్ మార్కెట్‌ను మూసివేసే ఆలోచన లేదని వ్యాపారులు తెలిపారు. పుకార్ల దృష్ట్యా తాను వీడియో స్టేట్మెంట్ ఇచ్చి ట్విట్టర్‌లో పోస్ట్ చేశానని, అలాగే అన్ని వాట్సాప్ గ్రూపుల వ్యాపారులు, ఇతర వ్యక్తులు ఇలాంటి తప్పుడు సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సలహా ఇస్తున్నారని ఆజాద్పూర్ అగ్రికల్చరల్ మార్కెట్ ప్రొడ్యూస్ కమిటీ (APMC) చైర్మన్ ఆదిల్ అహ్మద్ ఖాన్ తెలిపారు.

వెజిటబుల్ ట్రేడర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అనిల్ మల్హోత్రా మాట్లాడుతూ.. ఏ కూరగాయల లేదా పండ్ల కొరత ఖచ్చితంగా లేదు. అయితే, హోల్‌సేల్  మార్కెట్లలో కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని ఆయన అన్నారు.