Donald Trump has Covid-19 : అమెరికాను వణికించిన కరోనా మహమ్మారి మిలియన్ల మందికి సోకగా.. లక్షలాది మంది ప్రాణాలు బలితీసుకుంది. ఇప్పుడు ఆ మహమ్మారి కరోనాకు దేశాధక్ష్యుడు డొనాల్డ్ ట్రంప్, మెలానియా ట్రంప్ దంపతులు గురయ్యారు. ట్రంప్ దంపతులకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో అందరిలో ఆందోళన నెలకొంది. వారిపై covid-19 లక్షణాల తీవ్రత ఎలా ఉంటుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది.
సాధారణంగా 70ఏళ్లు పైబడినవారిలో కరోనా తీవ్రత హైరిస్క్ ఎక్కువగా ఉంటుందనేది అందరికి తెలిసిందే. అయితే ట్రంప్ వయస్సు 74 ఏళ్లు. ఆయన బరువు 110 కిలోలు (244 పౌండ్లు) ఉంటారు.. క్లినికల్‌గా (వైద్యపరంగా) ట్రంప్ (obese) స్థూలకాయుడే కావడంతో మరింత ఆందోళన నెలకొంది. వాస్తవానికి ఊబకాయంతో బాధపడేవారిలో కరోనా తీవ్రత అధికంగా ఉంటుంది. కొన్నిసార్లు మరణానికి కూడా దారితీసేంతగా హైరిస్క్ ఉంటుంది.
US Centers for Disease Control and Prevention ప్రకారం.. 65 ఏళ్ల నుంచి 74 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారిలో కరోనా ముప్పు ఐదు రెట్లు అధికంగా ఉంటుందని వెల్లడించింది. అంతేకాదు.. 18ఏళ్ల నుంచి 29 ఏళ్ల మధ్య వయస్సు వారితో పోలిస్తే.. ఈ వయస్సు వారిలో 90 రేట్లు ఆస్పత్రిలో చేరాల్సి రావచ్చు.. మరణానికి కూడా దారితీసే ముప్పు అధికంగా ఉంటుందని పేర్కొంది.
గత జూన్ నెలలో ట్రంప్ ఆరోగ్యంపై వచ్చిన రిపోర్టు పరిశీలిస్తే.. ట్రంప్ బరువు 244 పౌండ్లు అంటే.. 110 కిలోలు ఉంటారు. పైగా ట్రంప్ హైట్ కూడా ఎక్కువే.. 6 అడుగుల 3 అంగుళాల ఎత్తు ఉంటారు.. బాడీ మాస్ ఇండెక్స్ (BMI) 30.5 ఉంటుంది.. వైద్యపరంగా ట్రంప్.. ఎంతోకంత ఊబకాయం ఉందనే అర్థం.. ఊబకాయుల్లో కరోనా బారినపడితే ఆస్పత్రిపాలయ్యే అవకాశాలు మూడింతలు అధికంగా ఉంటుందని CDC నివేదిక వెల్లడించింది.
అలా అయితే.. ట్రంప్ హైరిస్క్ గ్రూపులో ఉన్నట్టే? :
మహిళలతో పోలిస్తే పురుషుల్లోనే కరోనా ముప్పు అధికంగా ఉంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఆడవాళ్ల కంటే మగవారిలోనే తీవ్ర అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి.. ట్రంప్ పురుషుడు కావడంతో ఆయన ఆరోగ్య సమస్యలపై ఆధారపడి ఉంటుందని నివేదిక పేర్కొంది. కానీ, ట్రంప్ లో ఇతర అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయో లేదో స్పష్టత లేదు.. ఒకవేళ ఉంటే.. ఆయన కరోనా హైరిస్క్ గ్రూపులో ఉన్నట్టే.. ఇటీవలే ట్రంప్ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆ రిపోర్టుల్లో ట్రంప్‌కు కొద్దిగా బ్లడ్ ప్రెజర్ మాత్రమే పెరుగుతున్నట్టుగా నిర్ధారణ అయింది.
కరోనా హైరిస్క్ ఉందనడానికి కూడా ఆయనలో ఎలాంటి కేన్సర్, కిడ్నీ వ్యాధి, డయాబెటిస్ లేదా ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయో లేదో ఆధారాలేమి లేవు. అధ్యక్షుడు వ్యక్తిగత వైద్యులు Dr. Sean Conley చెప్పిన ప్రకారం.. ఏప్రిల్ నెలలో ఆయనకు వైద్య పరీక్షలు చేశారు.. అందులో ట్రంప్ ఆరోగ్యంలో ఎలాంటి మార్పులు కనిపించలేదన్నారు. ట్రంప్ పూర్తి ఆరోగ్యానికి సంబంధించి సమాచారం పెద్దగా తెలియదనే చెప్పాలి.
వైద్యపరీక్షల కోసం రహాస్యంగా Walter Reed సందర్శన :
2019 నవంబర్ 16న ట్రంప్ మెడికల్ చెకప్ కోసం Walter Reed National Military Medical Center వెళ్లారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. మెడికల్ సెంటర్లో ఆయన రెండు గంటలకు పైగా వైద్య పరీక్షలు చేయించుకున్నారంట.. ట్రంప్ ట్రిప్ కూడా రహాస్యంగా జరిగిందని వైట్ హౌస్ వర్గాల సమాచారం.. ఆ తర్వాత జూన్ నెలలోనే ట్రంప్ ఆరోగ్యానికి సంబంధించి ఓ మెమో రిలీజ్ చేసినట్టు వైట్ హౌస్ ఫిజిషియన్ వెల్లడించారు.. వాల్టర్ రీడ్ సందర్శన తర్వాత ఆయన కొన్ని వైద్య పరీక్షలు చేయించుకోనేందుకు వెళ్లారని పేర్కొన్నారు.
First Lady మెలానియా ఆరోగ్య పరిస్థితి ఏంటి? :
ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ (first lady Melania Trump) వయస్సు 50 ఏళ్లు.. కోవిడ్-19 హైరిస్క్ కేటిగిరీలో ఆమె లేరనే చెప్పాలి.. వయస్సు పెరిగేకొద్ది వారిలో అనారోగ్య సమస్యల తీవ్రత కూడా పెరుగుతూ పోతుందని CDC నివేదిక పేర్కొంది. 50 ఏళ్ల నుంచి 64 ఏళ్ల మధ్య వయస్సు వారు ఆస్పత్రిలో చేరే అవకాశం మూడింతలు అధికంగా ఉంటుంది.. అదే 18ఏళ్ల నుంచి 29 ఏళ్ల మధ్య వారితో పోలిస్తే మరణించే అవకాశం 30 రేట్లు అధికంగా ఉంటుంది.
ఫస్ట్ లేడీ మెలానియా, మాజీ మోడల్ కావడంతో ఆమె సహజంగానే ఫిట్ నెస్ కలిగి ఉంటారు.. హెల్తీ డైట్ తో పాటు బాడీని కూడా గుడ్ షేప్ లో మెయింటైన్ చేస్తుంటారు. కానీ, మే 2018లో ఆమెకు కిడ్నీ సంబంధిత సమస్య గురించి ఒక సందర్భంలో వైట్ హౌస్ పేర్కొంది. అయితే ఆమెకు ఆపరేషన్ జరిగిందా లేదా అనేది క్లారిటీ లేదు. దీనిని ఎంబోలైజేషన్ ప్రక్రియగా వర్ణించారు. కణితులకు రక్త ప్రవాహాన్ని చొచ్చుకుపోకుండా ధమనిలోకి ఒక గొట్టాన్ని ఏర్పాటు చేయడం అనేది ఇలాంటి విధానాలలో ఉంటుంది.
కిడ్నీ సమస్యలు ఉంటే.. కరోనా ముప్పు ఎక్కువే :
నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ (National Kidney Foundation), CDC ప్రకారం.. ఏ దశలోనైనా కిడ్నీ వ్యాధి ఉన్నవారు కోవిడ్ -19 నుంచి తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కానీ ఫస్ట్ లేడీకి కిడ్నీ వ్యాధి ఉందా లేదా అనేది క్లారిటీ లేదు.. ఒకవేళ ఉంటే మాత్రం కరోనా ముప్పు ఉండే ఛాన్స్ ఎక్కువే.. మెలానియా ట్రంప్ ఆరోగ్య పరిస్థితి గురించి కొద్దిగా మాత్రమే తెలుసు.. ఈ విషయంలో మెలానియా ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై కరోనా ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో కచ్చితంగా చెప్పలేం..
తీవ్రత తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే :
కరోనా వైరస్ సోకిన వారిలో చాలామందిలో లక్షణాలు ముదిరి వైరస్ తీవ్రత కనిపించడానికి కొన్నిరోజుల సమయం పడుతుంది. అధ్యక్షుడు ట్రంప్, ఫస్ట్ లేడీ మెలానియాలో కరోనా లక్షణాలు ఏ స్థాయిలో ఉన్నాయి.. దాని తీవ్రత ఎంత ఎక్కువగా ఉండొచ్చు అనేది తెలియాల్సి ఉంది.
ట్రంప్, ఫస్ట్ లేడీ ఆరోగ్యంపై కరోనా ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో తెలియాలంటే కొంత సమయం పట్టొచ్చునని మాజీ Baltimore హెల్త్ కమిషనర్ Leana Wen పేర్కొన్నారు. ఒక వారం లేదా అంతకంటే ముందే వారిలో లక్షణాల తీవ్రతను బట్టి నిర్ధారణకు రావొచ్చునని George Washington Medical Center ఎమర్జెన్సీ రూమ్ వైద్యులు అభిప్రాయపడ్డారు. అధ్యక్షుడు ట్రంప్ దంపతుల ఆరోగ్యంపైనే ఇప్పుడంతా అందరి దృష్టి, అదే ఆందోళన కలిగిస్తోంది. దేవుడి దయవల్ల ట్రంప్ దంపతులు త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.