Foot Fungus: వర్షాకాలంలో ఫంగల్ ఇన్ఫెక్షన్.. కాళ్లపై తీవ్ర ప్రభావం.. జస్ట్ ఇలా చేస్తే చాలు మొత్తం మాయం

Foot Fungus: వర్షాకాలంలో కాళ్లపై ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే ముఖ్య కారణం వర్షం వల్ల చెప్పులు తడిచిపోయి, పాదాలు గంటల తరబడి తేమలో ఉండటం వల్ల ఫంగస్ పుట్టే పరిస్థితులు ఏర్పడతాయి.

Prevention of fungal infections of the feet during the rainy season

వర్షాకాలం ఆరోగ్య పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. జలుబు, ఫీవర్ ఇన్ఫెక్షన్స్ లాంటి సమస్యలు అధికంగా వచ్చే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా కాళ్లపై ఏర్పడే ఫంగల్ ఇన్ఫెక్షన్స్. ఇది తీవ్రమైన ఇబ్బందికి గురి చేస్తుంది. వాతావరణంలో తేమ పెరగడం, తడిగా ఉండే పరిస్థితులు ఏర్పడటం వల్ల బాక్టీరియా, ఫంగస్‌ పెరిగే ప్రమాదం ఉంది. దీనినే అథ్లీట్ ఫుట్ (Athlete’s Foot), రింగ్‌వర్మ్ (Ringworm), టినియా (Tinea Pedis) అనే పేర్లతో కూడా అంటారు. మరి వర్షాకాలంలో కాళ్లపై ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎందుకు ఏర్పడుతుంది? నివరఞ్చ చర్యల గురించి వివరంగా తెలుసుకుందాం.

అసలు ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది?

వర్షాకాలంలో కాళ్లపై ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే ముఖ్య కారణం వర్షం వల్ల చెప్పులు తడిచిపోయి, పాదాలు గంటల తరబడి తేమలో ఉండటం వల్ల ఫంగస్ పుట్టే పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే కాళ్లను శుభ్రంగా ఉంచకపోవడం, సరైన రీతిలో పొడిగా చేయకపోవడం వల్ల కూడా ఫంగల్ ఏర్పడే ప్రమాదం ఉంది. ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్న ఇతరుల చెప్పులు, తువాళ, సాక్సులు ఉపయోగించడం వల్ల కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్ సంక్రమించే అవకాశముంది.

ఫంగల్ ఇన్ఫెక్షన్ లక్షణాలు:

  • తొలినాళ్లలో కాళ్ల బొటనవేళ్ళ మధ్య చర్మం చిలకరించడం
  • దురద, చిరాకు లేదా మంట
  • చర్మం ఎర్రబడటం
  • చర్మం పిండిపిండిగా కనిపించడం
  • దుర్వాసన రావడం

నివారణ చర్యలు:

ఫంగల్ ఇన్ఫెక్షన్ నివారణ కోసం ఈ క్రింది జాగ్రత్తలు పాటించండి:

1.పాదాలు శుభ్రపరచుకోవాలి:

రోజూ కాళ్లను బాగా కడుక్కోవాలి. తరువాత పూర్తిగా పొడిగా అయ్యేలా తుడుచుకోవాలి. తడిగా ఉండే చెప్పులను, స్లిప్పర్లను ధరించకూడదు.

2.శుభ్రమైన సాక్సుల వాడకం:
షూస్ వాడే వారు రోజూ శుభ్రమైన, పొడిగా ఉన్న కాటన్ సాక్సులు మాత్రమే వాడాలి. తడిగా ఉన్న సాక్సులను వాడకండి.

3.వివిధ వ్యక్తుల వస్తువులను వాడకండి:
ఇతరుల చెప్పులు, తువాళ్లు, స్లిప్పర్లు ఎప్పటికీ వాడకూడదు.

4.తదుపరి చర్యలు:
ఇన్ఫెక్షన్ లక్షణాలు మొదలైతే వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలీ. యాంటీ-ఫంగల్ క్రీమ్, మందులు వాడాలి.

చిట్కాలు:

  • ప్రతిరోజూ రాత్రి నిద్రకు ముందు కాళ్లను కడిగి తడి అయ్యేలా తుడిచి నెయ్యి, కొబ్బరి నూనె రాయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
  • ఇంట్లోకి వచ్చేటప్పుడు చెప్పులు బయటే ఉంచడం మంచిది.

వర్షాకాలంలో తేమ వల్ల ఏర్పడే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఒక సాధారణ సమస్య అయినా, సరైన జాగ్రత్తలతో దీన్ని పూర్తిగా నివారించవచ్చు. కాళ్ల పరిశుభ్రత, పొడిగా ఉంచడం, ఇతరుల వస్తువుల వాడకాన్ని నివారించడం అనేవి చాలా ముఖ్యమైనవి. ఒకవేళ ఇన్ఫెక్షన్ మొదలైతే వైద్య సహాయం తీసుకోవడం ఆలస్యం చేయకండి.