Laying after eating
మనలో చాలా మందికి భోజనం చేసిన వెంటనే కూర్చోవడం లేదా పడుకోవడం అలవాటుగా ఉంటుంది. కొంతమంది అటు ఇటు రెండు అడుగులు వేసినా వెంటనే కూర్చుండిపోతారు. ఈ అలవాటు కొన్నిసార్లు ప్రాణాంతకం అయ్యే ప్రమాదం ఉందట. నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి తిన్న వెంటనే కూర్చోవడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకుందాం.
జీర్ణక్రియ సవ్యంగా జరగదు: తిన్న వెంటనే కూర్చోవడం వల్ల శరీరం దిశ మార్చుకుంటుంది. దీనివల్ల కడుపులో ఆహారం అరగడం ఇబ్బంది అవుతుంది. ఫలితంగా కడుపునొప్పి, కడుపులో వాపు, అసిడిటీ సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది.
అసిడిటీ సమస్య: భోజనం తర్వాత వెంటనే కూర్చోవడం లేదా పడుకోవడం వలన జీర్ణరసాలు పైకి వస్తాయి. దీనిని గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లక్స్ అంటారు. దీనివల్ల గొంతులో మంట, ఛాతీలో మంట, నోటికి చేదు రుచి రావడం వంటి లక్షణాలు ఏర్పడతాయి.
అలసట, నిద్రలేమి: తిన్న వెంటనే కూర్చోవడం వలన శరీర భంగిమలో ఎలాంటి మార్పు ఉండదు కానీ, జీర్ణక్రియలో ఎటువంటి సహకారం లభించదు. ఫలితంగా మానసిక అలసట ఏర్పడుతుంది. కొంతమందిలో ఇది నిద్రలేమికి దారి తీస్తుంది.
బరువు పెరగడం: తిన్న వెంటనే కూర్చోవడం వలన క్యాలరీస్ వాడకం జరగదు. దాంతో అవి ఫ్యాట్ గా మారతాయి. దీనివల్ల స్థూలకాలం సమస్య వచ్చే ప్రమాదం ఉంది. క్రమంగా అది గుండె పనితీరుపై ప్రభావం చూపించే ప్రమాదం ఉంది.
మలబద్ధక సమస్యలు: తిన్న తరువాత పడుకోవడం చేయడం వల్ల జీర్ణక్రియ సరిగా జరగదు. ఫలితంగా పేగు సమస్యలు, మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలు రావచ్చు.