vitamin d deficiency
విటమిన్ డి.. మానవ శరీరానికి ఈ విటమిన్ యొక్క ప్రదాయనతో ఏంటి అనేది చాలా మందికి తెలియదు. కాస్త నిశితంగా పరిశీలిస్తే ఈ మధ్య కాలంలో విటమిన్ డి సమస్యతో చాలా మంది బాదడపుతున్నారు. కారణం ఏంటో తెలియదు కానీ, రోజురోజుకి బాధితులు పెరుగుతున్నారు. సాధారణంగా మన శరీరంలోని అవయవాలు సరిగా పనిచేయడానికి రోజుకు 20-40 ఎంజీ/ఎంఎల్ విటమిన్ డి అవసరం. దానికన్నా తక్కువ మోతాదులో విటమిన్ డి ఉంటే అవయవాల పనితీరులో అంతరాయం ఏర్పడుతుంది. కాబట్టి.. విటమిన్ డి అనేది మనిషి ఆరోగ్యానికి చాలా ప్రధానం. కానీ, చాలా మందిలో ఈ సమస్య కనబడుతోంది. ఈ లోపం రావడానికి ముందు కొన్ని లక్షణాలు కనిలిస్తాయి. మరి ఆ లక్షణాలు ఏంటి? విటమిన్ డి లోపం వల్ల వచ్చే సమస్యలు ఏంటి? ఈ సమస్య రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
విటమిన్ డి లోపం ప్రధానంగా కండరాలపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ఈ లోపం వల్ల కండరాలలో తీవ్రమైన నొప్పి వస్తుంది. చాలా మంది దేనికి అలసటగా భావిస్తారు. సహజమే అనుకుని నిర్లక్ష్యం చేస్తారు. కానీ, ప్రమాదానికి సంకేతం అని గుర్తించండి. కాస్త విరామం తరువాత కూడా కండరాల నొప్పి తగ్గలేదు అంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించండి.
విటమిన్ డి లోపం వల్ల జుట్టు రాలిపోవడం జరుగుతుంది. ఈ సమస్య వల్ల తలపై ఫోలికల్స్ ఏర్పడే అవకాశం ఉంది. ఫలితంగా, జుట్టు సమస్యలు మొదలవుతాయి. అంతేకాకుండా.. విటమిన్ డి లోపం వల్ల కీళ్ల నొప్పులు, ఉబ్బరం, విరేచనాలు, మలబద్ధకం వంటి సమస్యలు కూడా వచ్చే అవాకాశం ఉంది.
విటమిన్ డి సెరోటోనిన్ హార్మోన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఆలాగే మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. కాబట్టి.. విటమిన్ డి లోపం వల్ల మానసిక స్థితిలో మార్పులు, ఆందోళన, ఒత్తిడి, నిరాశ ఎక్కువవుతుంది. ఒత్తడి వల్ల నిద్ర లేమి, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది.
కాబట్టి విటమిన్ డి సమస్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. విటమిన్ డి సూర్యకాంతి నుండి లభిస్తుంది. కాబట్టి.. రోజుకు కనీసం 15-30 నిమిషాలు ఎండలో ఉండేలా చూసుకోవాలి. అందులోను ఉదయం 7-10 గంటల మధ్య వచ్చే ఎండ మెరుగ్గా చాలా మంచిది. అలాగే, ఆహారంలో కూడా విటమిన్ డి ఎక్కువగా ఉండే పాల ఉత్పత్తులు, గుడ్డు, చేపలు, పుట్టగొడుగులు, తృణధాన్యాలు వంటివి ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. సమస్య తీవ్రమైతే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.