కరోనాకు పుట్టినిల్లు అయిన చైనాలో వుహాన్ సిటీలో మళ్లీ కరోనా మహమ్మారి తిరగబెడుతోంది. వైరస్ ప్రభావం నుంచి కోలుకున్నవారిలో కొందరికి మళ్లీ పాజిటీవ్ అని పరీక్షల్లో తేలింది. సుదీర్ఘంగా రెండు నెలల పాటు లాక్ డౌన్ విధించిన తర్వాత చైనా ఇప్పుడుప్పుడే కరోనా దెబ్బనుంచి ఊపిరిపీల్చుకుంటోంది. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత చైనా మళ్లీ పనులను ప్రారంభించింది. రెండోరోజు వరకు ఒక్క కొత్త కరోనా కేసు కూడా నమోదు కాలేదు.
కానీ, ఇంతలోనే కోలుకున్న కరోనా బాధితుల్లో కొందరికి మళ్లీ పాజిటీవ్ లక్షణాలు ఉన్నట్టు నిర్ధారించారు. అయితే, వైరస్ తిరగబెట్టిన వారి నుంచి ఇతరులకు కరోనా వైరస్ సోకుతుందా? లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయంలో చైనా ప్రావిన్స్ లోని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం.. COVID-19 అని కూడా పిలిచే కరోనావైరస్ నుండి కోలుకున్న 10 శాతం మంది రోగులు చైనాలోని వుహాన్‌లో మళ్లీ పాజిటివ్ పరీక్షలు తేలాయి.
90 శాతం మంది రోగులు కోలుకొని, 4,300 మంది మాత్రమే నగర ఆసుపత్రులలో చికిత్స పొందుతుండగా, 3 నుండి 10 శాతం మంది మళ్లీ వైరస్ బారిన పడ్డారు. హెల్త్‌కేర్ ప్రొవైడర్లు న్యూక్లియిక్ యాసిడ్ పరీక్షలు నిర్వహించిన తర్వాత ఈ విషయాన్ని ధృవీకరించారు. ఇది కోలుకున్న రోగులపై పాజిటీవ్ అని తేలింది.
ఇదొక చిన్న శాంపిల్ సైజు మాత్రమే :
కోలుకున్న 147 మంది రోగులలో, 5 పాజిటీవ్‌గా నిర్ధారించినట్టు టోంగ్జీ ఆసుపత్రి అధ్యక్షుడు వెల్లడించారు. ఇతర దేశాల్లో చిక్కుకుపోయిన చైనీయులంతా తిరిగి స్వదేశానికి చేరుకుంటున్న సమయంలో ఈ కొత్త కేసులు నమోదు కావడంపై భయాందోళనలకు గురిచేస్తోంది. అయినప్పటికీ, కోలుకున్న రోగులపై వైరస్‌ను గుర్తించడంలో న్యూక్లియిక్ యాసిడ్ పరీక్షల విశ్వసనీయతను చాలా మంది ప్రశ్నించడం ప్రారంభించారు. టెస్టు కిట్స్ సున్నితత్వం, స్థిరత్వాన్ని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
ఇవి అంటువ్యాధులా?
వ్యాధికి వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని పెంచడానికి శరీరం ప్రతిరోధకాలను అభివృద్ధి చేసే అవకాశం ఉంది. అయితే, వుహాన్ టోంగ్జీ ఆసుపత్రికి చెందిన ఆరోగ్య నిపుణులు.. కోలుకున్న వారిలో పాజిటీవ్ లక్షణాలతో ఉన్నారనే దానిపై ఇంకా ఖచ్చితమైన రుజువు లేదని చెప్పారు. వైద్యులు ల్యాబరేటరీ టెస్టులు నిర్వహించి రోగుల కుటుంబాల సభ్యులను పర్యవేక్షిస్తున్నారు. ఆస్పత్రి నుండి 5 రోగులు, పాజిటివ్ పరీక్షించినప్పటికీ, కరోనావైరస్ లక్షణాలు కనిపించలేదు.
వారి కుటుంబ సభ్యుల్లో ఎవరికి కూడా వ్యాధి సోకలేదు. ఈ వైరస్ అంటువ్యాధులుగా సూచించడానికి ఆధారాలు లేవు. ఇవి కేవలం చిన్న నమూనాలు మాత్రమేనని వైద్యులు తెలిపారు. ప్రారంభ పరీక్షల ఫలితాల ప్రామాణికతను భరోసా ఇవ్వడానికి సరిపోవన్నారు. వ్యాధి పర్యవేక్షణ నివారణ పనులకు మార్గనిర్దేశం చేయడానికి పెద్ద ఎత్తున ఎపిడెమియోలాజికల్ అధ్యయనం అవసరమని వాంగ్ చెప్పారు.
ఇలాంటి రోగులపై చేసిన పరిశీలనలో, వారిలో 80 నుండి 90 శాతం మందికి కోలుకున్న ఒక నెల తర్వాత వారి రక్తంలో వైరస్ లేదని తేలింది. అయినప్పటికీ, కోలుకున్న రోగులు డిశ్చార్జ్ అయిన తర్వాత రెండు వారాల పాటు ఒంటరిగా ఉండాలని ఆయన సూచించారు. ఆ తర్వాత మళ్లీ టెస్టులు నిర్వహించనున్నారు.
Also Read | మనవాళ్లే అన్నారు అయినా రాష్ట్రంలో అడుగుపెట్టకుండా జగన్ ఎందుకు కఠినంగా ఉన్నారు!