world’s first COVID-19 vaccine : ఈ బుధవారమే రష్యా కరోనా వ్యాక్సిన్ వస్తోందా..? టీకా ఎలా పనిచేస్తుందంటే?

  • Publish Date - August 10, 2020 / 08:27 PM IST

కరోనా వైరస్ మహమ్మారి అంతానికి సమయం ఆసన్నమైంది.. ప్రపంచాన్ని పట్టిపీడుస్తున్న కరోనా మహమ్మారిని అంతం చేసే వ్యాక్సిన్ వచ్చేస్తోంది.. ప్రపంచమంతా కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న రష్యా కరోనా వ్యాక్సిన్ వస్తోంది.. ఈ బుధవారమే (ఆగస్టు 12న) రష్యా వ్యాక్సిన్ లాంచ్ కాబోతోంది..

అన్ని ట్రయల్స్ విజయవంతమైన అనంతరం రష్యా వ్యాక్సిన్ దేశంలో అందుబాటులోకి తీసుకొస్తోంది.. రష్యా నుంచి ప్రపంచంలోని మొట్టమొదటి కోవిడ్ వ్యాక్సిన్ ప్రారంభించడానికి రెడీగా ఉంది.. వాస్తవానికి ఈ వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుందో తెలుసా? ఫాస్ట్ ట్రాక్ వ్యాక్సిన్లతో ఎంతవరకు ప్రయోజనం ఉంటుంది లాంటి అనేక సందేహాలకు సమాధానమే రష్యా వ్యాక్సిన్.. రెండు మూడు రోజుల్లో దీని పనితనం ఎలా ఉండబోతుందో తేలిపోనుంది.



ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. మరోవైపు శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు ప్రజలకు టీకా అందించే దిశగా ప్రయత్నాలను వేగవంతం చేశారు. ప్రస్తుతం.. కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తిపరంగా వివిధ దశలలో 160 మందికి పైగా వ్యాక్సిన్ అభ్యర్థులు ఉన్నారు. వీరిలో 27 మంది హ్యుమన్ ట్రయల్స్‌కు చేరుకున్నారు. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ ఔషధ తయారీదారు అస్ట్రాజెనెకా క్రియేట్ చేసిన వ్యాక్సిన్ కరోనావైరస్ వ్యాక్సిన్ రేసులో ముందున్నాయి. రష్యా తన కరోనావైరస్ వ్యాక్సిన్‌ను ప్రారంభించిన ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా అవతరించింది.

కరోనా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్‌కు రష్యా రెడీ :
రష్యాకు చెందిన గమలేయ నేషనల్ రీసెర్చ్ సెంటర్, రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ప్రపంచంలోని మొట్టమొదటి COVID-19 వ్యాక్సిన్’ అని ప్రకటించారు. కరోనావైరస్ వ్యాక్సిన్ 2020 ఆగస్టు 12న రిజిస్ట్రేషన్ చేయడానికి సిద్ధంగా ఉంది. కరోనావైరస్‌పై పోరాడటానికి వ్యాక్సిన్‌ను తీసుకొచ్చిన ప్రపంచంలో మొట్టమొదటి దేశంగా రష్యా నిలిచింది.



రష్యన్ వ్యాక్సిన్ ఎలా తయారు చేశారంటే?
రష్యా కరోనా టీకాను ఒక అడెనోవైరస్ ఆధారిత వైరల్ వెక్టర్ టీకా ఆధారంగా తయారు చేసింది. SARS-CoV-2 వైరస్ స్పైక్ ప్రోటీన్‌తో కలిపి శరీరంలో రోగనిరోధక ప్రతిస్పందనను ప్రేరేపిస్తుంది. టీకా భద్రత, సమర్థత గురించి ఎన్నో ఊహాగానాలు ఉన్నాయి. గమలేయ నేషనల్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ అలెగ్జాండర్ గింట్స్‌బర్గ్, వ్యాక్సిన్‌లోని కరోనావైరస్ కణాలు గుణించలేనందున శరీరానికి హాని కలిగించవని అభిప్రాయపడ్డారు.

ఫాస్ట్ ట్రాక్ విధానం పనిచేస్తుందా? నిపుణులు ప్రశ్న :
ఫాస్ట్ ట్రాక్ విధానం ద్వారా టీకా పనిచేస్తుందా? ఎంతవరకు సమర్థవంతంగా కరోనాపై పోరాడగలదు? ఇలాంటి ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఫాస్ట్ ట్రాక్ విధానంపై నిపుణులు సైతం సూటిగా ప్రశ్నిస్తున్నారు. రష్యాకు చెందిన సానిటరీ వాచ్‌డాగ్ ‘Anna Popova’ ద్వారా రష్యన్ వ్యాక్సిన్‌కు గో-ఫార్వర్డ్ ఇచ్చేసింది.. ఈ టీకా అభివృద్ధిలో ఫాస్ట్ ట్రాక్ విధానాన్ని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.



వెక్టర్ మాజీ అధికారి Alexander Chepurnov రష్యా ప్రభుత్వం అందించిన డేటాపై అనుమానం వ్యక్తం చేశారు. తప్పు వ్యాక్సిన్‌తో కరోనా వ్యాధి తీవ్రతను మరింత పెంచే అవకాశం ఉందని హెచ్చరించారు. కరోనావైరస్ లాంటి ఇతర వ్యాధులతో కొన్ని యాంటీబాడీస్ కారణంగా వ్యాప్తి తీవ్రతరం అవుతుందని అంటున్నారు. ఈ టీకాలో ఎలాంటి యాంటీబాడీస్ తయారవుతాయో తప్పక తెలియాల్సిన అవసరం ఉందన్నారు.

రష్యా ప్రోటోకాల్స్ పాటించాలి.. WHO సూచన :
కరోనా వ్యాక్పిన్ విజయవంతంగా అభివృద్ధి చేసిన రష్యా ప్రపంచ తొలి కరోనా వ్యాక్సిన్ ప్రజల అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) రష్యాకు అనేక ముందస్తు సలహాలు సూచనలు చేస్తోంది.. సురక్షితమైన, సమర్థవంతమైన కరోనావైరస్ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయడానికి ఇప్పటికే ఏర్పాటు చేసిన మార్గదర్శకాల ప్రకారం కొనసాగాలని WHO సూచించింది..

ట్రెండింగ్ వార్తలు