అసలే కరోనా కాలం… బయటకు వెళ్తే మాస్క్ తప్పనిసరి.. ధరించిన ప్రతి మాస్క్ కరోనా నుంచి రక్షణ ఇస్తుందా? అంటే కచ్చితంగా గ్యారెంటీ లేదు. కానీ, ప్రత్యక్షంగా ప్రభావాన్ని మాత్రమే తగ్గిస్తుంది. మాస్క్ పెట్టుకుంటే ఎంతవరకు సురక్షితమనే సందేహాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సైంటిస్టులు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. ఎక్కడో తయారు చేసిన మాస్క్ ల కంటే ఇంట్లోనే తయారుచేసుకునే మాస్క్ లతో కరోనా నుంచి రక్షణ ఎక్కువగా ఉంటాయని తేల్చేశారు. అంతేకాదు.. హోం మేడ్ మాస్క్ ల కోసం ప్రత్యేకమైన మెటేరియల్ కూడా కనిపెట్టేశారు సైంటిస్టులు. ఈ మాస్క్ లు పెట్టుకునే కరోనా నుంచి ప్రభావంతంగా పనిచేస్తాయని అంటున్నారు.
నాన్-మెడికల్ గ్రేడ్ మాస్క్‌లతో ప్రయోగాలు చేశామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దగ్గు, తుమ్ముల ద్వారా నీటి బిందువుల వ్యాప్తిని ఆపడానికి రెండు లేయర్ల క్విల్టింగ్ కాటన్ ఫాబ్రిక్ సమర్థవంతగా ఎదుర్కొంటుందని కనుగొన్నారు. దీన్ని మాస్క్ కు కుట్టడం ద్వారా అత్యంత ప్రభావవంతమైనవని అంటున్నారు. అయితే లేయర్ కవరింగ్ తక్కువగా ఉన్నవాటిలో ప్రభావం తక్కువగా ఉంటాయని అన్నారు. Physics of Fluids జర్నల్‌లో ప్రచురించిన ఈ అధ్యయనం ప్రకారం… నీటి తుంపర్ల మార్గాలను గుర్తించడానికి ఒక లేజర్‌ను ఉపయోగించినట్టు తెలిపారు. బొమ్మల తలపై నుంచి తుమ్ము బిందువులు, వేర్వేరు మాస్క్ నమూనాలు, పదార్థాలపై ఎలా ప్రభావితం చేశాయో పరిశీలించారు.
COVID-19 మహమ్మారి సమయంలో ఫేస్ మాస్క్‌ల వాడకాన్ని ప్రజారోగ్య అధికారులు విస్తృతంగా సిఫార్సు చేస్తున్నారు. మాస్క్ లోడే మెటేరియల్స్, డిజైన్లకు సంబంధించిన కొన్ని నిర్దిష్ట మార్గదర్శకాలు అందుబాటులో ఉన్నాయని అమెరికాలోని ఫ్లోరిడా అట్లాంటిక్ విశ్వవిద్యాలయం పరిశోధకులు చెప్పారు. మెడికల్-గ్రేడ్ పరికరాల ప్రభావంపై కొన్ని ముందస్తు అధ్యయనాలు ఉన్నాయి. సామాజిక దూరం, ఫేస్ మాస్క్‌లను వినియోగం వెనుక ఉన్న కారణాన్ని తెలియజేస్తాయని చెబుతున్నారు. శాస్త్రవేత్తలు వదులుగా ముడుచుకున్న ఫేస్ మాస్క్‌లు, bandana-style కవరింగ్‌లు నీటి బిందు జెట్‌లను ఆపడంపై పెద్దగా ప్రభావం చూపలేదని కనుగొన్నారు.
క్విల్టింగ్ ఫాబ్రిక్ మల్టీ లేయర్లతో కుట్టిన ఇంట్లో తయారైన మాస్క్‌లు, సాధారణంగా లభించే కోన్ స్టైల్ మాస్క్‌లు అత్యంత ప్రభావవంతమైనవని చెప్పారు. కొన్ని లీకేజీలు ఉన్నప్పటికీ.. ఈ మాస్క్‌లు బిందువుల సంఖ్యను గణనీయంగా తగ్గించాయని పరిశోధకులు ప్రకటనలో పేర్కొన్నారు. మాస్క్ లేకుండా.. సామాజిక దూర మార్గదర్శకాల 6బ అడుగుల సిఫారసు కంటే మనిషి బొమ్మలపై నోటి తుంపర్లను చాలా దూరం అంచనా వేస్తున్నాయి. శ్వాసకోశ వ్యాధికారక క్రిములను నిరోధించడంలో ఫేస్ కవరింగ్ 100 శాతం ప్రభావవంతంగా లేదని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమన్నారు. సమర్థవంతమైన వ్యాక్సిన్ వచ్చేంతవరకు సామాజిక దూరం, ఫేస్ షీల్డ్‌లు, చేతులు కడుక్కోవడం, ఆరోగ్య సంరక్షణ అత్యవసరమని సైంటిస్టులు సూచిస్తున్నారు.
Read:ఊసరవెల్లి వైరస్.. మ్యుటేషన్‌తో జీనోమ్‌లో మార్పులు.. షాక్ అవుతున్న సైంటిస్టులు!