Stress: చాలా సులువుగా ఇలా టెన్షన్ తగ్గించుకోండి…

కొద్దిగా ఒత్తిడి ఉంటే మంచిదే. అదే ఎక్కువైతే ఏ పనీ సరిగ్గా చేయలేకపోవడమే కాకుండా ఎన్నో మానసిక, దాని ద్వారా శారీరక సమస్యలూ ఎదురవుతుంటాయి.

Stress and Anxiety

Stress-Anxiety: ఉదయం లేచింది మొదలు ఎన్నో పనులు చేస్తుంటాం.. ఆ పనుల్లో ఒత్తికి, ఆందోళన(Tension)లకు తోడు ఊహించని ప్రతికూల పరిణామాలు మనల్ని మరింత కుంగదీస్తుంటాయి. నిజానికి ప్రధాని మంత్రి నుంచి కూలీ పని చేసుకునే వారి వరకు అందరూ తమదైన స్థాయిలో ఒత్తిడి అనుభవిస్తూనే ఉంటారు.

కొద్దిగా ఒత్తిడి ఉంటే మంచిదే. అదే ఎక్కువైతే ఏ పనీ సరిగ్గా చేయలేకపోవడమే కాకుండా ఎన్నో మానసిక, దాని ద్వారా శారీరక సమస్యలూ ఎదురవుతుంటాయి. ఒత్తికి, ఆందోళన పెరగకుండా కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఆ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. ప్రతిరోజు సమతుల్య పౌష్టిక ఆహారం తినాలి.

దీని వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అంది, రోగ నిరోధకత పెరగడంతో పాటు మనం చురుకుగా ఉంటూ ఒత్తిడిని జయించవచ్చు. ప్రతిరోజు ధ్యానం, యోగా, నడక లేదా ఇతర వ్యాయామాలు చేయాలి. రాత్రి సమయంలో 8 గంటల పాటు నిద్రించాలి. అనవసరమైన ఆలోచనలకు దూరంగా ఉండాలి.

గతంలో జరిగిన ప్రతికూల విషయాలను గుర్తుచేసుకోవద్దు. మనకు నచ్చిన స్నేహితులు, బంధువులతో సంభాషణలో మునిగిపోతే ఒత్తిడి దూరం అవుతుంది. ఔషధాలతో నయం చెయలేని కొన్ని మానసిక వ్యాధులను సైతం ఈ అలవాట్లతో నయం చేసుకోవచ్చు.

ప్రతికూల ఆలోచన ప్రవాహం ఎక్కువైతే సైకియాట్రిస్ట్ లేదా సైకాలజిస్ట్ ను సంప్రదించాలి. సైకియాట్రిస్ట్ లు ఆందోళన, కుంగుబాటు తగ్గడానికి ఔషధాలు రాసిస్తారు. సైకాలజిస్ట్ లు కేవలం మాటలతోనే ఆందోళన, కుంగుబాటు తగ్గించే ప్రయత్నం చేస్తారు. అవి తగ్గడానికి జీవనశైలిలో ఎటువంటి మార్పులు చేసుకోవాలో సూచిస్తారు.

Digestive Disorders : జీవక్రియలు బాగుంటే అన్ని వ్యాధులను దూరంగా ఉంచవచ్చా ? తీవ్రమైన వ్యాధులకు దారితీసే 5 సాధారణ జీర్ణ రుగ్మతలు