Small bumps on TONGUE : నోటి ఆరోగ్యానికి కరోనాకు సంబంధముందని ఇంతకుముందే తెలుసు. కొత్తగా నోట్లో దద్దుర్లు (skin rashes) వస్తే కరోనాకి ముఖ్యమైన సంకేతంగా భావించాలని అంటున్న వైద్య నిపుణులు.
స్పెయిన్ డాక్టర్లు కొత్త కరోనా రోగ లక్షణాన్ని కనిపెట్టారు. దేశంలో వైరస్ విలయతాండవం చేస్తున్న సమయంలో ఎర్పాటుచేసిన హాస్పటల్‌లోని రోగులను అధ్యయనం చేశారు. ఏకంగా 666 మంది. ఈ coronavirus patientsల్లో కొందరికి వైరస్ ప్రభావం, మరికొందరికి రక్తహీతన కనిపించాయి.
వీళ్ల సగటు వయస్సు 56 ఏళ్లు. 58 శాతం మంది ఆడవారే. మొత్తం రోగుల్లో 46 శాతం మందికి immune deficiency syndrome ఉంది. అందువల్ల చేతులు, కాళల్లో ఎక్కువగా ప్రభావం కనిపిస్తుంది.
మరో 26 శాతం మందికి నోట్లో దద్దుర్లు వచ్చాయి. అంటే నాలిక మీద ఎర్రని, తెల్లని చిన్నబొడిపెలు వచ్చాయి.
నోటి దద్దుర్లను గుర్తించాలి
స్కిన్ రాషెస్ రావడం తక్కువే. మొత్తంమీద 11శాతం మంది రోగుల్లోనే ఈ లక్షణం కనిపించిందంట. స్సిన్ రాషెస్‌ను నాలుగో అధికారిక కరోనా లక్షణంగా చూడాలన్న King’s College వాదనకు ఇది పూర్తిగా భిన్నం.
ఈ రాషెస్ ఎప్పుడు వస్తాయి? కరోనా ముందు, వచ్చినప్పుడు, కొన్నిసార్లు వారాల తర్వాతకూడా కనిపించొచ్చన్నది డేటా సారాంశాం. ముక్కనుంచి కోవిడ్ టెస్ట్ చేసిన వాళ్లలో 21 శాతం మందికి ఈ రాషెస్ కనిపిస్తున్నాయి.
ఇక నోట్లో రాషెస్ అంటారా? ఏదో ఒక కరోనా లక్షణంతోపాటు నోట్లో దద్దుర్లు కనిపించాయంటే కరోనా వచ్చినట్లేనని అనుకోవాలని అంటున్నారు వైద్యనిపుణులు. జులైలోనే వైద్యనిపుణులు ఈ సంగతి చెప్పారు.