How To Overcome Negative thoughts and depression
ప్రస్తుతం అత్యధిక మంది ఎదుర్కొంటున్న మానసిక సమస్యలలో నెగిటివ్ థాట్స్ (Negative Thoughts), డిప్రెషన్ (Depression) ప్రధానమైనవి. వాటిని చిన్నగా తేలికగా భావించడం వల్ల, అవి కొన్నిసార్లు తీవ్రమైన సమస్యలుగా మారవచ్చు. ఈ మధ్య కాలంలో చాలా మంది డిప్రెషన్ని తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటున్న సందర్భాలు కూడా చాలానే జరుగుతున్నాయి. నెగిటివ్ థాట్స్, డిప్రెషన్ అనేవి మనిషి జీవితం అంతలా ప్రభావం చూపిస్తున్నాయి. కాబట్టి, వీటి విషయంలో చాలా జాగ్రత్తలు పాటించడం అవసరం. మరి నెగిటివ్ థాట్స్, డిప్రెషన్ నుంచి బయటకు తెప్పించి, మనసుకు ప్రశాంతతను కలిగించే కొన్ని విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ప్రతి ఒక్కరికి జీవితంలో ఏదో ఒక సమయంలో నెగిటివ్ ఆలోచనలు వస్తూనే ఉంటాయి. నేను ఈ పని చేయలేను,నన్ను ఎవరూ అర్థం చేసుకోరు,నా వల్ల ఏమీ జరగదు,నేను ఇలాగే ఉండిపోతానా.. ఇవన్నీ మనసులో కనిపించే సాధారణ భావాలే. కానీ అవి మన మనసుపై అధిక ప్రభావం చూపించడం మొదలైతే మాత్రం తప్పకుండా అప్రమత్తం అవ్వాల్సిందే.
1.మీ ఆలోచనలను రాసుకోండి:
మీ నెగిటివ్ ఆలోచనలు, భావోద్వేగాలను ఒక పేపర్ మీద రాసే ప్రయత్నం చేయండి. రాయడం వల్ల మనసు కాస్త తేలికపడుతుంది. అదేవిధంగా, మనం ఎప్పటికప్పుడు ఎలా భావిస్తున్నామో స్పష్టంగా తెలుసుకోవచ్చు. దీనివల్ల మన భావాలన్నీ లోపలే ఉండకుండా బయటకు వచేశాయనే భావన కలుగుతుంది.
2.మైండ్‌ఫుల్‌నెస్ మెడిటేషన్:
ప్రతీరోజూ కనీసం 10 నుంచి 30నిమిషాల పాటు శ్వాసపై దృష్టిపెట్టి ధ్యానం చేయడం అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. నెగిటివ్ ఆలోచనలు తొలగించలేకపోయినా కానీసం వాటిని చూసే కోణం మారుతుంది.
3.ఫిజికల్ యాక్టివిటీని పెంచండి:
మనిషి శరీరానికి శారీరక శ్రమ చాలా అవసరం. కాబట్టి, ఎక్కువసేపు కూర్చోవడం, పడుకోవడం వంటివి చేయడం డిప్రెషన్‌కు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. కాబట్టి, రోజు వాకింగ్, జిమ్, యోగా చేయడం ద్వారా మానసిక స్థితి మెరుగవుతుంది.
4.సరైన నిద్ర, మంచి ఆహారం:
మానసిక రుగ్మతలకు నిద్ర ప్రధాన కారణం. చాలా సందర్భాల్లో నిద్ర తక్కువవడం వల్లే మనస్సులో ఆందోళనలు పెరుగుతాయి. కాబట్టి, రోజులో నిద్రకు సరైన సమయాన్ని కేటాయించండి. 7 నుంచి 8 గంటల నిద్ర మంచి మానసిక ఆరోగ్యాన్ని పెంచుతుంది. సమతుల్యమైన ఆహారం తీసుకోవడం కూడా తప్పనిసరి.
5.నమ్మకమైన వారితో మాట్లాడండి:
మనసు తేలిక అవ్వాల్సి అంటే ముందు మనలోని భావాలను బయటకు చెప్పాలి. కాబట్టి, మీకు నమ్మకం ఉన్న మిత్రులు, కుటుంబ సభ్యులతో మీ భావాలను పంచుకోండి. ఓపికగా వినే మనిషి ఒక్కరు ఉన్నా, మనసు ఎంతో తేలికపడుతుంది.
6.అవసరమైతే థెరపిస్టుని కలవండి:
కొన్ని సందర్భాల్లో మానసిక ఆరోగ్యం నిపుణుల సహాయం తీసుకోవడం అత్యవసరం. సైకాలజిస్టులు, కౌన్సిలర్ల సూచనలను మానసిక ఆరోగ్యపై ప్రభావం చూపించవచ్చు.
డిప్రెషన్ అనేది జీవితాంతం ఉండిపోయేది కాదు. నిజం చెప్పాలంటే అది మన జీవనశైలిలో మార్పు తీసుకొచ్చే అవకాశంగా చెప్పుకోవచ్చు. కాబట్టి డిప్రషన్ వచ్చింది అని మైండ్ పాడుచేసుకోకుండా. ఆలోచింది అడుగులు వేయడం మంచిది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, సైకాలజిస్టుతో మాట్లాడటం వల్ల డిప్రెషన్ నుంచి బయట పడవచ్చు.