Problems caused by eating adulterated yogurt
సాధారణంగా మనం రోజు ఎన్ని రకాల కూరలతో భోజనం చేసినా చివర్లో పెరుగు లేకపోతే ఎదో వెలితిగానే ఉంటుంది. అంతలా మనం ఆహారంలో భాగమైపోయింది పెరుగు. నిజానికి పెరుగు అంటే ఆరోగ్యానికి అద్భుతమైన ఆహారం. దీనిలో ఉండే ప్రొబయోటిక్స్ (Probiotics), కాల్షియం, విటమిన్ B12 మన పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కానీ, ప్రస్తుతం కాలంలో చాలా రకాల మోసాలు జాగుతున్నాయి. అందులో పెరుగు కల్తీ ఒకటి. కల్తీ పెరుగును తినడం వల్ల అనేకరకాల ఆరోగ్య సమస్యలకు తెలెత్తుతున్నాయి. కాబట్టి, మనం తింటున్న పెరుగు సరైందేనా కదా అనేది చాలా అవసరం. కాబట్టి, మీ ఇంట్లోకి వస్తున్న పెరుగు నిజంగా నాణ్యమైనదేనా లేదా కల్తీయా? కల్తీ పెరుగును ఎలా గుర్తించాలి? అసలు ఎందుకు కల్తీ పెరుగు ఎందుకు ప్రమాదకరం దానికి సంబందించిన వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
1.రుచి చూసి చూడండి:
సహజ పెరుగు వాసన తీపి-తియ్యగా ఉంటుంది. పులుపుగా ఉంటే అది కల్తీ జరిగిందని లేదా పాడైందని అర్థం. కల్తీ పెరుగు రుచి లోపించింది లేదా పులుపు వాసన వస్తే అప్రమత్తంగా ఉండాలి.
2.నీటి వేర్పాటు:
సహజంగా నిలువబెట్టిన పెరుగు కొద్దిగా నీటిని వదులుతుంది. ఇది సాధారణంగా జాగిగేదే. కానీ నీరు ఎక్కువగా వదులుతోందా? నీరు తెల్లటి ద్రవం కాకుండా పచ్చటి/నీలం రంగులో ఉందా? అయితే అది ప్రమాదకరం కావచ్చు.
3.టెక్స్చర్ పరిశీలన:
మంచి పెరుగు మృదువుగా, కుదురుగా ఉంటుంది. కల్తీ పెరుగు లో గడ్డలుగా, జెల్లీ లాగా సాగుతూ ఉంటుంది. అలా ఉంటే అది ఖచ్చితంగా పాడయ్యింది అని అర్థం.
4.లైట్ టెస్ట్:
కొంతమంది పెరుగు తయారీలో చాకం, స్టార్చ్ వంటి పదార్థాలు వాడుతున్నారు. అది ఎలా తెలుసుకోవాలి అంటే.. ఒక చెంచా పెరుగు తీసుకుని దానికి రెండు చుక్కల యోడిన్ టించర్ వేసి చూడండి. దాని రంగు నీలంగా మారితే అందులో స్టార్చ్ కలిపారని అర్థం.