దక్షిణ కొరియాలో కరోనా వైరస్‌ విజృంభణ.. ప్రాణాలు తీసేస్తోంది!

  • Publish Date - February 20, 2020 / 05:04 PM IST

దక్షిణకొరియాలో ప్రాణాంతక వైరస్ సోకి ఒకరు మృతిచెందారు. కొరియాలో కరోనా సోకి మృతిచెందడం ఇదే మొదటిదిగా అక్కడి అధికారులు వెల్లడించారు. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్లు రెట్టింపు స్థాయిలో వ్యాపిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని షిన్చోంజి చర్చిలో ఒకరు కరోనా వైరస్ సోకి మృతిచెందినట్టు రిపోర్టు తెలిపింది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDCP) డాగుకు 235 కిలోమీటర్ల దూరంలోని దక్షిణ తూర్పు సోయెల్ ప్రాంతంలో 61ఏళ్ల షిన్చోంజి చర్చిలోని సభ్యురాలు ఒకరు కరోనా సోకి మృతిచెందారు.

ఆమెకు వైరస్  సోకినట్టు పరీక్షల్లో నిర్ధారణ కాకముందే ఆమె చర్జి సర్వీసులో పలుమార్లు హాజరయ్యారు. డాగు మేయర్ మాట్లాడుతూ.. చర్చిలోని సభ్యుల్లో మరో 90 మంది ఆరాదన చేసేవారిలోనూ కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్టుగా వెల్లడించారు. షిన్చోంజిలో ఇప్పటివరకూ 28 వైరస్ కేసులతో పాటు కొత్తగా 53 వరకు కరోనా ఇన్ఫెక్షన్లు సోకినట్టు సియోల్ రిపోర్టులో తెలిపింది. 

దాంతో దక్షిణ కొరియాలో వైరస్ సోకిన మొత్తం సభ్యులు 104కు చేరినట్టు నివేదించింది. వుహాన్ సిటీ నుంచి సియోల్ ప్రాంతానికి వచ్చిన చైనా మహిళలో తొలుత ఈ వైరస్ సోకినట్టు నిర్ధారించారు. చర్చి పాస్టర్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. డాగులోని చర్చిలో మొత్తం 1000 మంది సభ్యలు హాజరయినట్టు తెలిపారు. షిన్చోంజి చర్చిలో వైరస్ తీవ్రత నివారించేందుకు వీలుగా ముందుస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. సర్వీసులను పునరుద్దరించడమే కాకుండా ఆన్ లైన్ , ఇంట్లోవారితో మాట్లాడుకునేలా వీలు కల్పిస్తున్నారు. మంగళవారం చర్చి మూసివేశారు. 2లక్షల మంది సభ్యులతో ఉన్న షిన్చోంజి చర్చిని జాతీయంగా నకిలీ క్రైస్తవ శాఖగా పిలుస్తారు. 

1984లో లీ మ్యాన్ హీ దీన్ని నిర్మించారు. అప్పటినుంచి ఆయన తన అనుచరులచే మెస్సీయాగా ముద్దుగా పిలుచుకునేవారు. దేశాధక్షుడు మూన్ జే ఇన్ ఈ వారం ప్రారంభంలోనే ఆర్థిక అత్యవసర పరిస్థితిపై హెచ్చరికలు జారీ చేశారు.  దేశంలో 2015లో Mers అంటువ్యాధితో 38 మంది మృతిచెందారు.

కరోనా వైరస్ మరింత వేగంగా వ్యాపించే అవకాశం ఉందని కొరియా యూనివర్శిటీ గురో ఆస్పత్రి ప్రొపెసర్ కిమ్ హూ జూ తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో తప్పా జనం రద్దీగా ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండటమే మంచిందని చెప్పారు. కరోనా వ్యాప్తితో సింగపూర్ లోని గ్రేస్ అసెంబ్లీ ఆఫ్ గాడ్ లో రెండు చర్చిలను ఫిబ్రవరి 26 వరకు నిలిపివేయనుంది. 

చర్చీలో పాల్గొన్న సభ్యుల్లో మొత్తం 22 మందిలో కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్టుగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ గుర్తించింది. కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారించినట్టు చర్చి అధినేత ఒకరు తెలిపారు. నగరంలో మరో 6 కరోనా కేసులు నమోదు కగా, ఇవి కూడా మిస్సన్స్ సింగపూర్, ది లైఫ్ చర్చ్ కు సంబంధమై ఉన్నాయి. సింగపూర్ దేశంలో క్యాథలిక్స్ ప్రకారం.. యూట్యూబ్ లేదా రేడియో సర్వీసులను యక్సస్ చేసుకోవచ్చు.

ఫిబ్రవరి 15 నుంచి ఈ సర్వీసులన్ని నిలిపోయాయి. హాంగ్ కాంగ్ లో క్యాథలిక్ చర్చిలో ఎక్కువ సంఖ్యలో వారి అకౌంట్లను సస్పెండ్ చేసింది. మరోవైపు అంగ్లికన్ చర్జీలో సర్వీసులను హోల్డ్ లో ఉంచారు. ఆయా వ్యక్తుల్లో ఎలాంటి లక్షణాలు లేనప్పటికీ చర్చిలోని సభ్యులపై నిషేధం విధించారు. షిన్చోంజి చర్చిలో కరోనా వ్యాప్తి సేవలను నిలిపివేయమని అడుగుతుంది