ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితులు కోలుకోవడంలో వివాదాస్పద యాంటీ మలేరియా డ్రగ్ (hydroxychloroquine) అద్భుతంగా పనిచేసిందని ఓ కొత్త అధ్యయనం వెల్లడించింది. ఆస్పత్రిలో కరోనాతో చేరిన బాధితులకు hydroxychloroquine మందు ఇవ్వడంతో వారంతా ప్రాణాలతో బయటపడ్డారని అధ్యయనంలో తేలింది. ఈ డ్రగ్ పనితీరుకు సంబంధించి Southeast Michiganలో Henry Ford Health System కు చెందిన ఒక పరిశోధక బృందం అధ్యయనం చేసింది.
ఈ అధ్యయనంలో 2,541 మంది ఆస్పత్రిలో చేరిన కరోనా బాధితులకు hydroxychloroquine తగిన మోతాదుతో ఇచ్చారని, వారంతా ఆరోగ్యంతో కోలుకున్నట్టు పరిశోధక బృందం తమ అధ్యయనంలో గుర్తించింది. ఈ పరిశోధక బృందానికి నేతృత్వం వహించిన Dr. Marcus Zervos చెప్పిన ప్రకారం.. కరోనా చికిత్సలో హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందు తీసుకున్న 13 శాతం మందితో పోలిస్తే.. ఈ డ్రగ్ తీసుకోని 26 శాతం మంది బాధితులు మృతిచెందినట్టు వెల్లడించారు. మార్చిలో పలు ఆస్పత్రుల్లో చేరిన తొలి కరోనా బాధితుడి నుంచి ప్రతిఒక్కరికి అందించిన చికిత్సపై ఎప్పటికప్పుడూ అధ్యయనం చేసినట్టు తెలిపారు.
మొత్తం మీద మరణాల రేటు సమిష్టిగా 18.1శాతంగా నమోదైంది. హైడ్రాక్సీక్లోరోక్విన్ తీసుకున్న గ్రూపు బాధితుల్లో 13.5 శాతం ఉంటే, హైడ్రాక్సీక్లోరోక్విన్ ప్లస్ (hydroxychloroquine plus)తో పాటు అజిథ్రోమైసిన్ (azithromycin) తీసుకున్నవారు 20.1శాతం, azithromycin మాత్రమే తీసుకున్న వారిలో 22.4శాతం, ఇతర ఔషధాలకు 26.4శాతంగా ఉందని బృందం అధ్యయనంలో పేర్కొంది. దీనికి సంబంధించి International Journal of Infectious Diseasesలో ప్రచురించిన ఓ నివేదిక బృందం రాసుకొచ్చింది. అనేక ఇతర అధ్యయనాల్లో మలేరియా చికిత్సకు, నివారించడానికి మొదట అభివృద్ధి చేసిన హైడ్రాక్సీక్లోరోక్విన్ అనే ఔషధంతో ఎలాంటి ప్రయోజనం పొందలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఔషధాన్ని ఎక్కువగా ప్రస్తావించారు. కానీ, తరువాతి అధ్యయనాల్లో రోగులకు ఔషధం ఇస్తే వారి గుండె దుష్ప్రభావాలకు గురయ్యే అవకాశం ఉందని హెచ్చరించాయి.
ఇదే అద్భుత నివారిణి.. నేరుగా వైరస్‌తో పోరాడుతుంది :
యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఈ నెల ప్రారంభంలో ఈ ఔషధానికి అత్యవసర వినియోగ అధికారాన్ని విత్ డ్రా చేసుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ స్పాన్సర్ చేసిన ట్రయల్స్ సహా ప్రపంచవ్యాప్తంగా ట్రయల్స్ నిలిపివేశారు. హైడ్రాక్సీక్లోరోక్విన్ ప్లస్ azithromycin కలయిక తీవ్రమైన COVID-19, తక్కువ కార్డియాక్ రిస్క్ కారకాలతో ఎంపిక చేసిన రోగులకు మాత్రమే కేటాయించినట్టు బృందం తెలిపింది. కరోనావైరస్ చికిత్సగా హైడ్రాక్సీక్లోరోక్విన్ అద్భుతంగా నివారణిగా పనిచేస్తుందని పరిశోధనలు చూపిస్తాయని హెన్రీ ఫోర్డ్ బృందం తెలిపింది. హైడ్రాక్సీక్లోరోక్విన్ వైరస్‌ను నేరుగా ఎదుర్కోవడంలో సాయపడుతుందని, మంటను కూడా తగ్గిస్తుందని జెర్వోస్ చెప్పారు.
డెక్సామెథాసోన్ (dexamethasone) డ్రగ్ ద్వారా కూడా కరోనా మరణాల రేటును తగ్గిందని ఇటీవలి రికవరీ ట్రయల్‌ను పరిశీలించింది ఈ బృందం. తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నవారిలో స్టెరాయిడ్ డెక్సామెథాసోన్ మంటను తగ్గిస్తుందని గుర్తించారు. కరోనా రోగులలో 82శాతం ప్రవేశించిన మొదటి 24 గంటల్లోనే హైడ్రాక్సీక్లోరోక్విన్, తర్వాతి మొదటి 48 గంటల్లో 91శాతం మందికి ఈ డ్రగ్ ఇచ్చినట్టు హెన్రీ ఫోర్డ్ బృందం తెలిపింది.
ముందుగానే ఇస్తే.. ప్రాణాలు కాపాడొచ్చు :
కోవిడ్ -19 కోసం హైడ్రాక్సీక్లోరోక్విన్‌పై రెండు క్లినికల్ ట్రయల్స్, యుఎస్‌లో ఒకటి, యుకెలో ఒకటి జరిగాయి. అయితే ప్రారంభంలోనే నిలిపివేశారు. ఎందుకంటే హైడ్రాక్సీక్లోరోక్విన్ మందుతో ఎలాంటి ప్రయోజనం ఉండదని వారి డేటా సూచించింది. కానీ వైట్ హౌస్ అధికారి హెన్రీ ఫోర్డ్ బృందం అధ్యయనాన్ని ప్రశంసించారు. వైట్ హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో ప్రకారం.. కరోనా సోకిన బాధితుడికి తగినంత ముందుగానే హైడ్రాక్సీక్లోరోక్విన్ ఇవ్వడం ద్వారా వారి ప్రాణాలను కాపాడవచ్చునని ఈ అధ్యయనం సూచిస్తుంది. ఈ ఔషధంతో పదుల సంఖ్యలో, వందల వేల అమెరికన్లు, ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిని కరోనా బారినుంచి కాపాడగలదని అధ్యయనం చెబుతోంది.