మహిళలకు నిజమైన లైంగిక భావప్రాప్తి కలిగేది వారితోనే: రీసెర్చ్

  • Publish Date - February 23, 2020 / 10:55 AM IST

దాంపత్య జీవితం చిగురించాలంటే.. ఆలుమగల మధ్య లైంగిక సంబంధం ధృడంగా ఉంటేనే సాధ్యపడుతుంది. ఒకరిపై మరొకరికి నమ్మకం.. విశ్వాసం ఉన్నప్పుడే వారి లైంగిక జీవితం కూడా సజావుగా సాగుతుంది. ఆడ, మగల మధ్య లైంగిక వాంఛ పెరగడానికి ఎన్నో కారణాలు కావొచ్చు. పరిస్థితులను బట్టి కొన్నిసార్లు యాధృశ్చికంగా లైంగిక చర్యలో పాల్గొంటుంటారు.

అది ఇష్టపూర్వకంగా కాకపోవచ్చు. పరిస్థితుల ప్రభావం కావొచ్చు. ఏది ఏమైనా అలాంటి సాధారణ లైంగిక సంబంధాలు ఎంతమాత్రం సురక్షితమైనవి కాదు. అలాంటి వాటి జోలికి పోకపోవడమే ఎంతో ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. అయితే.. అసలు మహిళలు లైంగిక సంతృప్తిని ఏయే సందర్భాల్లో పొందుతారు అనేదానిపై ఓ కొత్త అధ్యయనం రివీల్ చేసింది. 

వన్ నైట్ స్టాండ్ రిలేషన్స్ వద్దు :
అనుకోకుండా జరిగిపోయే లైంగిక సంబంధాల్లో కంటే తమ భాగస్వాములతోనే చేసిన రొమాన్స్ తోనే మహిళల్లో ఎక్కువగా సంతృప్తినిస్తుందని అధ్యయనం చెబుతోంది. ప్రస్తుత రోజుల్లో డేటింగ్ వంటి రిలేషిన్ షిప్ తరహాలో ఎన్నో లైంగిక సంబంధాలకు దారితీస్తుంటాయి. ఉద్దేశపూర్వకంగా కాకపోయినా.. యాదృశ్చకంగా కొన్ని సందర్భాల్లో కొందరి భాగస్వాములతో లైంగిక సంబంధానికి పురిగొల్పుతుంది.

అది బలవంతంగా కావొచ్చు లేదా అయిష్టంగానే రొమాన్స్‌ చేసేలా ప్రేరేపించేలా ఉండొచ్చు. వన్ నైట్ స్టాండ్ వంటి (ఒక రాత్రితో ముగిసే) లైంగిక సంబంధాలు ఎక్కువ కాలం నిలబడవని, మహిళలు ఎక్కువగా సుదీర్ఘ కాలంపాటు తమతో ఉండే భాగస్వాములతోనే లైంగిక చర్యలో గొప్ప అనుభూతిని పొందుతారని యూఎస్ సైంటిస్టులు చెబుతున్నారు. అందుకే వన్ నైట్ స్టాండ్ రిలేషన్ షిప్స్ వద్దని.. లాంగ్ టర్మ్ రిలేషన్ షిప్స్ ముద్దు అంటున్నారు. 

18ఏళ్ల నుంచి 71ఏళ్ల మహిళలపై అధ్యయనం :
నిజమైన రొమాన్స్ ఎప్పుడూ మహిళల్లో లైంగిక అనుభూతిని రెట్టింపు చేస్తుందని తమ అధ్యయనంలో తేలినట్టు చెబుతున్నారు. ఫ్లోరిడా విశ్వ విద్యాలయం తమ అధ్యయనం కోసం గత ఏడాదిలో 18 ఏళ్ల వయస్సు నుంచి 71 ఏళ్ల వయస్సు గల 1000కి పైగా మహిళలను తమ లైంగిక జీవితాల గురించి అడిగి తెలుసుకున్నారు.

ది సన్ కథనం ప్రకారం.. దీర్ఘకాలిక సంబంధాలలో ఉన్న మహిళలు సగటున 15 శాతం ఎక్కువగా భావప్రాప్తి పొందుతారని నిర్ధారించినట్టు పేర్కొంది. వారు తమ లైంగిక సంతృప్తిని ఒంటరి మహిళల కంటే 10 శాతం ఎక్కువగా ఉంటుందని కూడా తెలిపింది. నిబద్ధత కలిగిన భాగస్వాములతోనే లైంగిక సంబంధం కలిగి ఉన్న మహిళలు ఈ అనుభవాన్ని చాలా ఎక్కువగా ఆస్వాదించారని అధ్యయనంలో తేలింది.   

మహిళల్లో భావప్రాప్తికి ఆ ఒక్కటే ఉత్తమం :
సాధారణంగా మహిళల్లో భావప్రాప్తి కలిగించేందుకు ఎన్నో విధానాలు ఉన్నాయని అంటున్నారు సెక్సాలిజిస్టులు.. మహిళలు భావప్రాప్తిని పొందడానికి ఎక్కువ సమయం పట్టదని, కాకపోతే అది ప్రేరేపించే విధానంపై ఆధారపడి ఉంటుందని అంటున్నారు. మహిళలు భావప్రాప్తికి చేరుకోవడానికి పోర్ ప్లే ఒక్కటే ఉత్తమమైన విధానమని చెబుతున్నారు. అది కూడా నిజమైన లైంగిక సంబంధం కలిగిన భాగస్వాములతో జరిగిన సందర్భాల్లో భావ ప్రాప్తిని పొందుతారని స్పష్టం చేశారు.

సాధారణ (వన్ నైట్ స్టాండ్) లైంగిక చర్యలో మహిళలు అసలైన భావప్రాప్తిని పొందరని, దీర్ఘకాలిక లైంగిక సంబంధాల్లో మాత్రమే అది కూడా తమ నిజమైన భాగస్వాములతోనే భావప్రాప్తిని అనుభవించినట్టు తేలిందని ప్రధాన శాస్త్రవేత్త వాల్ వాంగ్ సంబూన్ జర్నల్ ఆఫ్ సెక్స్ రీసెర్చ్‌లో పేర్కొన్నారు. మహిళలు ఎక్కువగా ప్రామాణిక సంభోగాన్ని పెద్దగా ఇష్టపడరని,  ఎక్కువగా స్పర్శతో కూడిన లైంగిక చర్యనే వారిలో భావప్రాప్తిని రగిలిస్తుందని సైకోథెరపిస్ట్ ఫిలిప్ హాడ్సన్ చెప్పుకొచ్చారు. 

ట్రెండింగ్ వార్తలు