symptoms of fatty liver problem.
ఈ మధ్య కాలంలో చాలా మందిలో వినిపిస్తున్న సమస్య ఫ్యాటీ లివర్. కారణం ఏంటంటే.. రోగం ముదిరాక మాత్రమే ఈ సమస్య లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అందుకే ఈ సమస్యను ప్రమాదకరమైనదిగా చెప్తున్నారు నిపుణులు. ముందు జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాపాయంగా మారె అవకాశం ఉంది. అందుకే. ఫ్యాటీ లివర్ సమస్యలో కనిపించే లక్షణాలు ఏంటి? వాటిని ఎలా గుర్తించాలి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఫ్యాటీ లివర్ అంటే ఏంటంటే.. లివర్ (కాలేయం)లో కొవ్వు పేరుకుపోవడం. మనం తిన్న ఆహారంలోని కొవ్వు కాలేయంలో పేరుకుపోయి దాని పనితీరును తగ్గిస్తుంది. దానివల్ల లివర్ చెడిపోయి జీవక్రియలు ఆటకం కలుగుతుంది. అందుకే లివర్ ఆరోగ్యం అనేది చాలా అవసరం. ముఖ్యంగా ఫ్యాటీ లివర్ సమస్యను రెండు రకాలుగా విభజిస్తారు. అందులో ఒకటి నాన్ ఆల్కాహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. ఇది ఆల్కాహాల్ తీసుకోనివారిలో కనిపిస్తుంది. రెండవది ఆల్కాహాలిక్ ఫ్యాటీ లోవర్ డిసీజ్. ఇది ఆల్కాహాల్ ఎక్కువగా తీసుకునే వారిలో కనిపిస్తుంది. వీరిలో ఊబకాయం, మధుమేహం, కొలెస్ట్రాల్ లాంటివి ఫ్యాటీ లివర్ సమస్యకు కారణం కావచ్చు.
ఫ్యాటీ లివర్ సమస్యలో ఎక్కువగా కనిపించే లక్షణాలు ఏంటంటే.. ఈ సమస్యతో బాధపడుతున్నవారిలో ఎక్కువగా కడుపునొప్పి ఎక్కువగా ఉంటుంది. అది కూడా కుడి వైపు ఎక్కువగా వస్తుంది. కాలేయంలో కొవ్వు అధికంగా పేరుకుపోవడం వల్ల వాపు కూడా వస్తుంది. అలా అనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకండి. చిన్న నొప్పి అయినా పెద్ద ప్రమాదానికి కారణం అవ్వొచ్చు. కాబట్టి ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
త్వరగా అలసిపోవడం కూడా కొన్నిసార్లు ఫ్యాటీ లివర్ సమస్య లక్షణం కావొచ్చు. ఆకలి కూడా తగ్గుతుంది. దాంతో అకస్మాత్తుగా బరువు కూడా తగ్గుతుంది. ఇది కూడా ఫ్యాటీ లివర్ సమస్య ప్రధాన లక్షణమే. కొంతమందిలో ఫ్యాటీ లివర్ సమస్య కారణంగా శరీరంలో బిలిరుబిన్ పెరిగిపోయి చర్మం, కళ్ళు పసుపు రంగులోకి మారుతాయి. ఇది లివర్ హెపటైటిస్ లక్షణం కావచ్చు. అంతేకాకుండా.. ఫ్యాటీ లివర్ సమస్య శరీరంలో ద్రవ సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఆ కారణంగా కాళ్ళలో వాపులు ఏర్పడతాయి. కాబట్టి పైన తెలిపిన లక్షణాలు గనక మీలో ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించండి. ఫ్యాటీ లివర్ సమస్య నుండి బయటపడండి.