Kidney stones: ఉందయాన్నే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే కిడ్నీ సమస్య కావచ్చు

కిడ్నీ సమస్య ఏర్పడే ముందు శరీరంలో అత్యంత సాధారణమైన కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవేంటంటే.. నడుము లేదా వీపులో తీవ్రమైన నొప్పి రావడం.

Symptoms of kidney stones

మానవ శరీరంలో ప్రధానమైన అవయవాల్లో కిడ్నీలు(మూత్రపిండాలు) ఒకటి. కానీ.. ఈ మధ్య కాలంలో చాలా మంది కిడ్నీల సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్యకు ప్రధాన కారణం సి విటమిన్ లోపం, సరిపడా నీళ్లు తాగకపోవడం. సాధారణంగా మూత్రపిండాలు రక్తాన్ని వడపోసి మలినాలను యూరిన్ ద్వారా బయటకు పంపించేస్తాయి. అలా బయటకు పంపంచె క్రమంలో అందులోని కాల్షియం, ఆగ్జరేస్ కలసిపోయి ఒక దృఢమైన పదార్థంలా ఏర్పడుతుంది. అది.. యూరిన్ వెళ్లే మార్గంలో అడ్డుపడటం వల్ల విపరీతమైన నొప్పి పుడుతుంది. రాను రాను ఇన్ఫెక్షన్ గా మారి నొప్పి విపరీతంగా మారుతుంది.

అయితే ఈ సమస్య ఏర్పడే ముందు శరీరంలో అత్యంత సాధారణమైన కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవేంటంటే.. నడుము లేదా వీపులో తీవ్రమైన నొప్పి రావడం. సాధారణంగా ఈ నొప్పి ఒకవైపు మాత్రమే వస్తుంది. ఉదయం నిద్రలేవగానే ఈ నొప్పి ఎక్కువగా అనిపిస్తుంది. ఎందుకంటే రాత్రంతా శరీరం విరామ స్థితిలో ఉంటుంది. కాబట్టి మూత్రాశయం నిండిపోయి ఈ నొప్పి ఏర్పడుతుంది. చాలా మంది రాత్రి సమయాల్లో మూత్రం వచ్చినప్పటికీ లేవడానికి బద్దకించి అలాగే పడుకుంటారు. ఆ అలవాటు అత్యంత ప్రమాదకరం. మూత్రాన్ని ఎక్కువసేపు విసర్జించకుండా ఉండటం వల్ల కూడా కిడ్నీ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

ఇంకా మూత్రపిండాల్లో రాళ్ల సమస్య ఉంటే ఉదయం పూట మూత్ర విసర్జనలో మంటగా ఉంటుంది. మూత్రపిండాల్లోని రాళ్లు మూత్ర నాళంలో ఇరుక్కుపోయినప్పుడు నొప్పిగా మంటగా ఉంటుంది. కొన్నిసార్లు మూత్రం ఎర్రగా కూడా రావచ్చు. మీరు కూడా ఇలాంటి సమస్యను ఎదుర్కొంటుంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి. కిడ్నీలో రాళ్ల సమస్య కారణంగా వాంతులు వచ్చినట్లు వికారంగా అనిపించవచ్చు. చాలా మందిలో తల తిరగడం, అలసట, తల భారంగా అనిపించే లక్షణాలు కూడా కనిపిస్తాయి.

పైన చెప్పిన లక్షణాల్లో ఏ ఒక్కటి అనిపించినా వెంటనే డాక్టర్ ను సంప్రదించడం మంచిది. ఎందుంకంటే కిడ్నీ సమస్యని నిర్లక్ష్యం చేయకూడదు. ప్రస్తుతం కాలంలో వయసుతో సంబంధంలేకుండా చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. దానివల్ల కిడ్నీలు పాడైపోయి డయాలసిస్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అందుకే ఎలాంటి సమస్యకైనా ముందు జాగ్రత్త వహించడం మంచిది.