కరోనా కట్టడిలో భాగంగా దాదాపు ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. భారత్ లో కూడా లాక్ డౌన్ విధించబడింది. అయితే భారత్ లో లాక్ డౌన్ ఒక్కటే కరోనా కట్టడికి పరిష్కార మార్గం కాదని నిపుణులు అంటున్నారు. నిరంతర సామాజిక దూరంతో asymptomatic individuals(కరోనా లక్షణాలు కనిపించకుండానే వైరస్ సోకిన వ్యక్తులు)లను గుర్తించేందుకు టెస్టింగ్ ను తీవ్రతరం చేయడం మరియు కరోనా సోకినట్లు తేలినవారిని క్వారంటైన్ చేయాలని నిపుణులు చెబుతున్నారు.
లాక్ డౌన్ లు చాలా ప్రభావితమైనవి కాదని,ముఖ్యంగా భారత్ లో దేశవ్యాప్త లాక్ డౌన్ అత్యంత ప్రభావితమైనది కాదని,ఎందుకంటే లాక్ డౌన్ ముగిసిన తర్వాత ఒక్కసారిగా వ్యాధి విరుచుకుపడే అవకాశముందని ఢిల్లీలోని అశోక యూనివర్శిటీలోని బయాలజీ అండ్ ఫిజిక్స్ ప్రొఫెసర్ గౌతమ్ మీనన్ తెలిపారు. కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు సమగ్రమైన టెస్టింగ్ మరియు క్వారంటైన్ కాలం ఒక్కటే నిజమైన శాశ్వత పరిష్కారం అని నొక్కి చెప్పారు.
కోవిడ్ -19 కు భారతీయ శాస్త్రవేత్తల ప్రతిస్పందన(400 మందికి పైగా శాస్త్రవేత్తల స్వచ్ఛంద సమూహం)అనే బ్యానర్ కింద…INDISCI-SIM గా పిలువబడే, భారతదేశానికి మొట్టమొదటి వివరణాత్మక రాష్ట్ర-స్థాయి ఎపిడెమియోలాజికల్ మోడల్‌ను సావిత్రిబాయి ఫులే పూణే విశ్వవిద్యాలయం (SPPU) శాస్త్రవేత్తలు, చెన్నైకి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్ శాస్త్రవేత్తలు , బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ మరియు అశోక యూనివర్శిటీ సైంటిస్టులు అభివృద్ధి చేశారు.
INDISCI-SIM పై మంగళవారం(ఏప్రిల్-21,2020)భారత ప్రభుత్వానికి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కే విజయ్ రాఘవన్ తన స్పందనను ఓ ట్వీట్ ద్వారా తెలియజేశారు. ఇందులో ఇన్వాల్వ్ అయిన ప్రతిఒక్కరికి ఆయన ధన్యవాదాలు చెప్పారు. ఇవి ఉపయోగకరమైన విశ్లేషణలు అని,ఇతర ఇన్ పుట్ లతో కలిపి వీటిని చాలా జాగ్రత్తగా చూస్తున్నట్లు తెలిపారు.
9 వైవిధ్యమైన డీటెయిల్డ్ సెక్షన్లు-అనుమానిత( susceptible),బయటపడిన( exposed), లక్షణాలకు ముందు( pre-symptomatic),లక్షణాలు బయటపడకుండానే వైరస్ సోకినట్లు తేలడం(asymptomatic),తక్కువగా రోగ లక్షణాలు(mild symptomatic),తీవ్రంగా రోగ లక్షణాలు(mild symptomatic), హాస్పిటల్ పాలైనవాళ్లు(hospitalised), కోలుకున్నవాళ్లు(recovered),మరణించినవాళ్లు(dead) ఈ మోడల్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. ప్రతి దశను లాక్ డౌన్, క్వారంటైనింగ్ వంటి ఔషధేతర(non-pharmaceutical)జోక్యాలతో ప్రతిదశను పోల్చడం మరియు వ్యాధి యొక్క వ్యాప్తిపై ఓ ముగింపును గీయడానికి టెస్టింగ్ విస్తరిండం. ఇది రాష్ట్ర, నగరం లేదా జిల్లా స్థాయిలకు మరింత విభజించబడే అనేక సంక్లిష్టతలతో నిర్మించిన అత్యంత శక్తివంతమైన మోడల్ అని సెంటర్ ఫర్ మోడలింగ్ అండ్ సిమ్యులేషన్,SPPU రీసెర్చర్ బాలచంద్ర పుజారి తెలిపారు.
వైరస్ విషయంలో మరియు ఒక వ్యక్తిని బట్టి… రోగి ఈ తొమ్మిది మార్గాలలో ఒకదాన్ని తీసుకోవచ్చు. మామూలు జనాభా యొక్క ఒక దశ ఒక కంపార్ట్మెంట్ నుండి మరొక కంపార్ట్మెంట్కు ఎలా ప్రయాణిస్తుందో మా నమూనా చూపిస్తుంది అని ఆయన అన్నారు. ఉదాహరణకు,స్వల్ప లక్షణాలతో…పరీక్షించిన, లక్షణం లేని వ్యక్తులకు(tested asymptomatic individuals) రికవరీ విండో అత్యధికంగా ఉంటుంది. అయితే ఇది తీవ్రమైన రోగలక్షణ(severely symptomatic)మరియు క్లిష్టమైన(critical) వాటికి తక్కువ. మోడల్ అనుకరణలు లాక్ డౌన్ యొక్క ఆర్థిక వ్యయాలను లెక్కించవు అని పూజారి అన్నారు. మే-3తర్వాత లాక్ డౌన్ పొడగించవచ్చు లేదా చేయకపోవచ్చని, వైరస్ వ్యాప్తి కన్నా వేగంగా టెస్టింగ్ కెపాసిటీస్ ను భారత్ తప్పనిసరిగా పెంచాలని ఆయన తెలిపారు. తమ మోడల్ ప్రకారం దేశవ్యాప్తంగా ట్రాన్స్ పోర్ట్(రవాణా)ను తిరిగి ప్రారంభించడం మంచి నిర్ణయం కాదన్నారు.