These things should never be done after taking medication.
ప్రస్తుత కాలంలో చాలా మంది అనేకరకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వాటి నివారణ కోసం మందులు వాడకం కూడా జరుగుతూనే ఉంటారు. అయితే, మందులు వాడటం వల్ల రోగాలకు నివారణ దొరుకుతుంది కానీ, మందులు వేసుకున్న తరువాత కొన్ని పనులను మాత్రం అస్సలు చేయకూడదు. అవి చేస్తే సైడ్ ఎఫెక్ట్స్, దుష్ప్రభావాలు తలెత్తే అవకాశం ఉంది. వాటి వల్ల ఉన్న రాగాల పరిస్థితి పక్కన పెడితే కొత్త రోగాలు పుట్టుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి, ఇక్కడ మందులకు వేసుకున్నాక చేయకూడని కొన్ని పనుల గురించి వివరంగా తెలుసుకుందాం.
1.ఆల్కహాల్ (మద్యం) సేవించకూడదు:
మనలో చాలా మంది మందులు, ముఖ్యంగా పెయిన్ కిల్లర్లు, యాంటీ బయోటిక్స్, మానసిక ఆరోగ్య మందులు వేసుకొని మద్యం తాగడం చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల శరీరంలో తీవ్రమైన రియాక్షన్లకు దారి తీస్తాయి. ముఖ్యంగా లివర్ మీద అధిక ఒత్తిడి కలుగుతుంది. బ్లడ్ ప్రెజర్ తక్కువ కావడం, ఉబ్బసం, బలహీనత, మూర్ఛ, లివర్ డ్యామేజ్ వంటివి జరిగే ప్రమాదం ఉంది.
2.కాఫీ, టీ లేదా కోలా తాగకూడదు:
కొంతమందికి మందులు వేసుకొని టీ, కాఫీలు తాగే అలవాటు ఉంటుంది. ఇలా చేయడం వల్ల రక్తంలో క్యాఫిన్ స్థాయి పెరుగుతుంది. ఇది హృదయ స్పందన వేగంగా మారడానికి, ఉద్వేగానికి గురవ్వడం, నిద్రలేమి, టెన్షన్ లాంటి కొత్త సమస్యలకు దారి తీస్తుంది.
3.ఎక్కువ కారం తినకూడదు:
మందులు తీసుకున్నాక ఎక్కువ మసాలా, కారంగా ఉండే ఆహారం అస్సలు తినకూడదు. అలా చేయడం వల్ల జీర్ణ సమస్యలు కలుగుతాయి. గ్యాస్ట్రిక్, యాసిడిటీ, అజీర్ణం, వాంతులు అయ్యే అవకాశం కూడా ఉంటుంది.
4.ఖాళీ కడుపుతో మందు తీసుకొని పని చేయకూడదు:
ఖాళీ కడుపుతో కొన్ని రకాల మందులు తీసుకుంటే మానవ శరీరంపై తీవ్ర ప్రభావం కలుగుతుంది. వాంతులు, నొప్పులు, అసహనం, ఉబ్బసం కూడా రావచ్చు.
5.డ్రైవింగ్ చేయకూడదు;
కొన్ని రకాల మందులు తీసుకొని వాహనాలు నడపడం అస్సలు చేయకూడదు. నిద్ర మందులు, ఒత్తిడి తగ్గించే మందులు, మూడ్ స్టాబిలైజర్లు వాడిన తర్వాత డ్రైవింగ్ చేయడం వల్ల అనుకోని ప్రమాదాలు, యాక్సిడెంట్లు, మూర్ఛ వచ్చే ప్రమాదం ఉంది.
6.వ్యాయామం చేయకూడదు:
మందులు తీసుకున్న వెంటనే వ్యాయామం చేస్తే, అది హార్ట్ రెటును ప్రభావితం చేయవచ్చు. డీహైడ్రేషన్, వాంతులు, తలనొప్పి, బలహీనత వచ్చే ప్రమాదం ఉంది.