healthy hair
Prevents Hair Loss : జుట్టు సమస్యలతో చాలా మంది నిత్యం బాధపడుతున్నారు. జుట్టు రాలిపోవటం, చివర్లు చిట్లటం, పొడిబారిపోవటం, కుదుళ్లలో దురద వంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. వీటన్నింటిని దూరం చేయటంలో మెంతులు కీలకపాత్ర పోషిస్తాయి. మెంతులు లేని వంటగదులు ఉండవు. భారతీయుల ఆహారంలో చాలా వంటల్లో మెంతుల్ని వాడుతుంటారు. మెంతులు ఇండియన్ పాపులర్ మసాలా దినుసు. ఈ మసాలా దినుసు హెయిర్ బ్యూటీకి గ్రేట్ గా సహాయపడుతుంది. అందాన్ని మెరుగుపరుచుకోవడానికి మార్కెట్లో అందుబాటులో ఉండే బ్యూటీ ప్రొడక్ట్స్ ఎక్కువ ఖర్చుచేసి కొనుగోలు చేసినా ఎలాంటి ఫలితం పొందక నిరుత్సాహ పడ్డవారు మెంతులను వాడటం ద్వారా సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు.
వివిధ రకాల జుట్టు సమస్యలను నివారించడంలో మెంతులు గ్రేట్ గా సహాయపడుతాయి. చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలు ఉన్నవారు మెంతులను రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల జుట్టు రాలడం తగ్గి, ఒత్తుగా పెరుగుతుంది. జుట్టుకు కావాల్సిన పోషకాలను మెంతులతో వేసుకునే ప్యాక్ లద్వారా లభిస్తాయి. మెంతులను నానబెట్టుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని కుదుళ్లకు పట్టించటం ద్వారా ఈ ఫలితాలను పొందవచ్చు.
చుండ్రును వదిలించుకోవడానికి రాత్రిపూట నిద్రకు ముందు కాసిన్ని మెంతులను నీళ్లలో నానబెట్టి.. ఉదయాన్నే మిక్సీలో వేసుకుని మెత్తగా పేస్టు లాగ తయారు చేసుకోవాలి. అందులోకి కొంచెం పెరుగు కలుపుకుని మాడుకు రాసుకుని 30 నిమిషాలు ఆగి తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చుండ్రు తగ్గుతుంది. చలికాలంలో జుట్టు పొడిబారిపోవడం, నిర్జీవంగా తయారవడం సహజమే. మరి ఈ సమస్య నుంచి బయటపడాలంటే మెంతులతో తయారుచేసిన ప్యాక్ ఉపయోగించాల్సిందే.
అయితే జుట్టుకు తేమనందించడానికి కొబ్బరి నూనె చాలా బాగా ఉపయోగపడుతుందన్న విషయం తెలిసిందే. అందుకే మెంతులతో తయారుచేసే హెయిర్ ప్యాక్‌లో కొబ్బరి నూనెను కూడా చేర్చితే సరిపోతుంది. రెండు టేబుల్ స్పూన్ల మెంతుల పొడిలో ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు పట్టించి పూర్తిగా ఆరనివ్వాలి. ఆ తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
కుదుళ్లలో పేరుకు పోయిన జిడ్డును తొలగించాలంటే అలాగే గుప్పెడు మెంతుల్ని రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయాన్నే మెత్తగా గ్రైండ్ చేసుకొని అందులో రెండు చెంచాల యాపిల్ సిడార్వె నిగర్, తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి జుట్టు చివర్ల వరకు పోసి కాసేపు ఉంచాలి. ఇలా చేయటం వల్ల ఫలితంగా కుదుళ్లలో అధికంగా విడుదలయ్యే నూనెల శాతం తగ్గుతుంది. జిడ్డు తొలగిపోతుంది.
చుండ్రు తదితర సమస్యల వల్ల కుదుళ్లలో విపరీతమైన దురద వస్తుంటుంది. తద్వారా చిరాగ్గా అనిపిస్తుంది. అలాంటి సమయంలో మెంతులతో తయారుచేసిన ఈ ప్యాక్ ప్రయత్నించండి. ఒక కప్పు మెంతుల్ని రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయాన్నే వాటిని మెత్తటి పేస్ట్‌లా చేసి అందులో గుడ్డులోని పచ్చసొన వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు, జుట్టుకు ప్యాక్‌లా వేసి అరగంట పాటు అలాగే ఉంచుకోవాలి. ఇలా చేస్తు దురద తగ్గి జుట్టు మెరుపు సంతరించుకుంటుంది.
మెంతులు జుట్టుకే కాకుండా ఇతర ప్రయోజనాలను అందిస్తాయి. శరీరంలో ఫ్రీ రాడికల్స్ వల్ల చర్మం ముడుతలు పడుతుంది, నలుపు వలయాలు ఏర్పడతాయి. వీటిని మెంతులు అడ్డుకుంటాయి. స్కిన్‌టోన్‌ను తేలికపరిచే గుణం ఉంది. మొటిమలు కూడా దరిచేరవు. శరీరంలోని గ్లూకోజ్ లెవెల్స్‌ను సమతుల్య పరుస్తాయి మెంతులు.ఈ గింజలకు జీర్ణశక్తిని పెంపొందించే లక్షణాలు ఎక్కువ. హార్ట్‌బర్న్ సమస్యకు అడ్డుకట్ట వేసే గుణం కూడా ఉంది. మెంతులలోని పీచుపదార్థం, యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి. దాంతో జీర్ణశక్తి చురుగ్గా మారుతుంది. మెంతులు నానబెట్టిన నీళ్లను తాగితే ఇవన్నీ సమకూరుతాయి.