టమాటా రుచి మాత్రమే కాదు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కాయగూర అని అందరికీ తెలిసిందే. ప్రతి ఇంటిలోనూ రోజూ టమాటాతో విభిన్న రకాల వంటకాలను తయారు చేస్తారు. అయితే, టమాటా జ్యూస్ తాగడం లేదా టమాటా కర్రీ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఒక్కటే కాదు, అనేకం! టమాటాలో ఫోలేట్, విటమిన్ C, విటమిన్ A, ఫైబర్, పొటాషియం వంటి కీలక పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరాన్ని అనేక ఆరోగ్య సమస్యల నుండి రక్షిస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మరి, టమాటా ద్వారా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చో తెలుసుకుందాం.
- టమాటాలలో 95% వాటర్ ఉండి, కొవ్వు చాలా తక్కువగా ఉండటంతో డైట్ ఫ్రెండ్లీ ఫుడ్ గా పిలుస్తారు అదేవిధంగా వీటిలో ఎక్కువ శాతం పోషకాలు, విటమిన్ C, విటమిన్ A, ఫైబర్ ఉండడం వల్ల హెల్త్ కి ఎంతో హెల్ప్ చేస్తుంది.
- టమాటాలలో కాలరీల పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది, ఇది బరువు తగ్గించడంలో కరెక్టుగా పనిచేస్తుంది కావున బరువు ఎక్కువగా ఉండి తగ్గించుకోవాలనుకునేవారు.. ప్రతిరోజు ఉదయాన్నే ఏమి తినకముందు పరగడుపున ఒక గ్లాస్ టమాటా జ్యూస్ తాగితే మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే లైట్ గా ఫుడ్ తీసుకునే వారు తమ డైట్ లో టమోటాలు పెట్టుకుంటే బెస్ట్.
- టమాటాల్లో విటమిన్ K, కాల్షియం ఉండటం వలన నడుము నొప్పి లేదా బోన్స్ వీక్ గా ఉన్నవారు టమాటా జ్యూస్ తాగడం గాని డైలీ డైట్ లో తినడం మంచిది. దీనివలన ఎముకలు స్ట్రాంగ్ గా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆర్థోపెడిషియన్లు అంటున్నారు.
- గ్యాస్, కడుపు ఉబ్బరం, కడుపులో గడబిడ వంటి సమస్యలు ఉన్నవారు టమాటో కర్రీ తినడం వలన కొంచెం రిలీఫ్ అవుతుందట.
- గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి టమాటా ఒక మంచి ఫుడ్ గా ఉండి, గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడుతుందట.
- టమాటాలలో లైకోపిన్, విటమిన్ C, విటమిన్ E వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వలన శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తొలగించి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయనట.
- టమాటాలలో ఫైటోన్యూట్రియంట్స్, కెరోటినాయిడ్‌లు వంటి పోషకాలు క్యాన్సర్, గుండె సంబంధ, వయస్సు-సంబంధిత సమస్యలు వంటి దీర్ఘకాలిక వ్యాధుల ముప్పును తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Disclaimer: ఇందులో ఉన్న విషయాలను మేము ధ్రువీకరించలేదు.. కేవలం మిమ్మల్ని ఎడ్యుకేట్ చెయ్యడానికి, అవగాహన కోసమే ఈ ఆర్టికల్ ని పోస్ట్ చేశాము.