Turmeric and chickpea flour face pack
face pack : ముఖంపై మొటిమలు, మచ్చలు ఉంటే ముఖ్యంగా మహిళలు ఇబ్బంది కరంగా ఫీలవుతారు. తమ అందానికి ఇవి ఆటకంగా మారాయని తమలో తామే కుమిలిపోతుంటారు. నలుగురిలో తిరగాలన్న కాస్త ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికి ముఖంపై జిడ్డును తొలగించి ముఖంలో మెరుపు తీసుకురావాలంటే మార్కెట్‌లోని సౌందర్యసాధనల కంటే వంటింట్లో లభించే పసుపు, శనగపిండి ఎంతగానో తోడ్పడతాయి. వీటితో మన ముఖవర్చస్సును పెంచుకోవచ్చు. సులువుగా, తక్కువ ఖర్చులో కొన్ని ఫేస్‌ప్యాక్స్‌ను తయారు చేసుకోవచ్చు.
పసుపు, శనగ పిండితో ఫేస్ ప్యాక్ వల్ల ప్రయోజనాలు ;
పసుపు ఇది మచ్చలు, మొటిమలు, ఎండ వల్ల నల్లగా మారిన చర్మాన్ని మరియు అనేక చర్మ సమస్యలతో పోరాడుతుంది. చర్మ సమస్యలను తగ్గించే అద్భుతమైన ఔషధం అని చెప్పవచ్చు శనగపిండిలో సహజంగా మొటిమలను తొలగించే కొన్ని లక్షణాలు ఉన్నాయి. శనగపిండిలో ఉండే జింక్ ముఖంపై వచ్చే మొటిమలు కారణమయ్యే ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. అదనపు జిడ్డు ఉత్పత్తిని నియంత్రించడంలో సహాయపడుతుంది ఎర్రబడిన చర్మాన్ని తగ్గించి మీ చర్మం నీ అందంగా కాంతివంతంగా చేస్తుంది. చర్మంపై తేమను సక్రమంగా ఉంచుతుంది. చర్మాన్ని మృదువుగా చేస్తుంది. నలుపు ని తగ్గిస్తుంది.
శెనగపిండి మరియు పసుపు ఫేస్ ప్యాక్స్ ;
ముందుగా 2 టీ స్పూన్లు శెనగపిండి, ఒక చిటికెడు పసుపు, రోజ్ వాటర్ తీసుకుని పెట్టుకోవాలి. శనగపిండిలో కొద్దిగా పసుపు వేసి దీనికి కొద్దిగా రోజ్ వాటర్ కలిపి పేస్ట్ తయారు చేయాలి. ఆ మిశ్రమాన్ని మీ మొహానికి ఫేస్ ప్యాక్ లాగా రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం కాంతివంగా మారుతుంది.
అలాగే కప్పులో టేబుల్ స్పూన్ అలొవెరా జెల్, కొన్ని చుక్కల నిమ్మరసాన్ని కలిపి మిక్స్ చేయాలి. వెళ్లతో మర్దన చేసుకుంటూ ముఖానికి పట్టించి ఆరిన తర్వాత శుభ్రపరచాలి. దీనివల్ల చర్మంపై ఉండే మచ్చలు తగ్గిపోతాయి.