Woman Brain Tumour : అమెరికా మహిళకు ఊహించని అనుభవం.. సెల్ఫీతో బయటపడ్డ ప్రాణాంతక బ్రెయిన్ ట్యూమర్.. అది ఎలాగంటే?

Woman Brain Tumour : అమెరికాకు చెందిన మేగాన్ ట్రౌట్‌వైన్ అనే మహిళ న్యూయార్క్ సందర్శన సమయంలో సెల్ఫీ తీసుకుంటుండగా విచిత్రమైన మార్పును గమనించింది. వెంటనే వైద్యున్ని సంప్రదించగా అది బ్రెయిన్ ట్యూమర్ అని నిర్ధారణ అయింది. 

Woman Brain Tumour : ప్రస్తుత ఆధునిక జీవితంలో ప్రతిఒక్కరూ టెక్నాలజీతో పాటు పరుగులు పెడుతున్నారు. ఈ ఉరుకులపరుగుల జీవితంలో వారి జీవనశైలిలో అనేక మార్పులకు దారితీస్తోంది. ఫలితంగా అనేక అనారోగ్య సమస్యలు చాపకింద నీరులా వ్యాపిస్తున్నాయి. అయితే, చాలామంది ఈ అనారోగ్య సమస్యలను ఆలస్యంగా గుర్తించడం ద్వారా ప్రాణాపాయస్థితిలోకి వెళ్లిపోతున్నారు. కానీ, అమెరికాకు చెందిన ఓ మహిళ తన మెదడులో పెరిగే ట్యూమర్ గురించి ముందుగానే గ్రహించింది. అది కూడా కేవలం సెల్ఫీ తీసుకోవడం ద్వారా అంటే మీరు నమ్ముతారా? అవును.. ఇది నమ్మాల్సిందే.. అదేంటి.. సెల్ఫీతో బ్రెయిన్ ట్యూమర్ ఎలా తెలుస్తుందంటారా? సెల్ఫీ తీసుకున్న సమయంలో ఆమె బ్రెయిన్‌లో ఏదో సమస్య ఉందని గ్రహించింది.

Read Also : Hyderabad Hospital : హైదరాబాద్ వైద్యుల అరుదైన ఘనత.. 60ఏళ్ల వ్యక్తి కిడ్నీలో 418 రాళ్లను తొలగించారు..!

సెల్ఫీతో బయటపడ్డ ప్రాణాంతక ట్యూమర్ :
అమెరికాకు చెందిన 33ఏళ్ల మేగాన్ ట్రౌట్‌వైన్ న్యూయార్క్ పర్యటనకు వెళ్లింది. అక్కడి తన బంధువుల ఇంట్లో దిగింది. అయితే, న్యూయార్క్ అందాలను ఆశ్వాదించేందుకు తన బంధువులతో కలిసి మిడ్‌టౌన్ చేరుకుంది. అక్కడే రాక్ ఫెల్టర్ సెంటర్‌లో కొద్దిసేపు ఆగిపోయారు. సిక్స్త్ అవెన్యూలోని పూల్, ఫౌంటైన్‌ల వద్ద ట్రౌట్‌వైన్ సెల్ఫీ తీసుకుంది. ఆ ఫొటోలో ఆమె కనురెప్ప వాలిపోయినట్టు ఉండటం గమనించింది. అది ట్రౌట్‌వైన్‌కి చాలా విచిత్రంగా అనిపించింది. ఆమె ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత న్యూరాలజిస్ట్‌ను సంప్రదించింది. అప్పుడే ఆమెకు తనలో దాగిన ప్రాణాంతక వ్యాధిని గుర్తించింది.

ఆమె మెదడులో మెనింగియోమా ట్యూమర్ :
దీనిపై ట్రౌట్‌వైన్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ‘కేవలం సెల్ఫీ మాత్రమే తీసుకున్నా.. కానీ, ఏదో నా దృష్టిని ఆకర్షించింది. హడ్సన్‌కు ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే వైద్యున్ని కలిశాను. అప్పుడు న్యూరాలిజీ వైద్యులు ఎమ్ఆర్ఐ (మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్) చేయించారు. కొద్ది నిమిషాల్లోనే రిపోర్టు రాగా.. మెదడులో బ్రెయిన్ ట్యూమర్ ఉంది’ అని తేలింది. అది మెనింగియోమా అనే ఒక రకమైన మెదడు కణితిగా వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతానికి ఎలాంటి ఆపాయం లేకపోయినా.. ట్రౌట్‌వైన్ మెదడులోని కణితి వేగంగా పెరుగుతున్నట్లు వైద్యులు గుర్తించారు. తక్షణ చికిత్స అవసరమని సూచించారు.

జన్యుపరమైన సమస్యలే కారణం :
ఆమెను మోఫిట్ క్యాన్సర్ సెంటర్‌కు తీసుకెళ్లారు. అక్కడే ఆమె మెదడులోని కణితిని తొలగించడానికి శస్త్రచికిత్స చేయించుకుంది. ఆ తర్వాత అవసరమైన రేడియేషన్ థెరపీలు జరిగాయి. ట్యూమర్ కారణంగా జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి సమస్యలను ఎదుర్కొన్నానని ట్రౌట్‌వైన్ చెప్పుకొచ్చింది. అయినప్పటికీ తాను ధైర్యంగా ఉండటం నేర్చుకున్నానని తెలిపింది.

మెనింగియోమాస్ అనే మెదడు కణితులు అనేవి పెద్దగా అపాయం కానప్పటికీ.. చికిత్స చేయకుండా అలానే వదిలేస్తే.. తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఈసారి గ్లియోమా అనే మరో బ్రెయిన్ ట్యూమర్‌ని వైద్యులు కనుగొన్నప్పుడు ట్రౌట్‌వైన్ మరింత షాక్‌కు గురైంది. మోఫిట్‌లో రెగ్యులర్ చెక్-అప్‌లను ట్రౌట్‌వైన్ చేయించుకుంటుంది. ఆమెలో జన్యుపరంగా పీటీఈఎన్ అనే జన్యువు కారణంగా ఆమెలో క్యాన్సర్‌ల ప్రమాదాన్ని పెంచుతుందని వైద్యులు చెబుతున్నారు.

Read Also : Nurse Weight Loss Tricks : బరువు తగ్గడం ఇంత ఈజీనా.. ఈ సింపుల్ డైట్ ట్రిక్స్‌తో 45కిలోలు తగ్గిన నర్సు..!

ట్రెండింగ్ వార్తలు