COVID-19 నిజమైన మరణాల రేటు ఇక ఎప్పటికీ తేలదు.. ఎందుకో తెలుసా?

  • Publish Date - October 2, 2020 / 10:16 PM IST

COVID-19 Real Death Rate : ప్రపంచవ్యాప్తంగా కరోనా బారినపడి ఎంతమంది మరణించారు. నిజమైన కరోనా మరణాల రేటు ఎంత సంఖ్య ఉంటుందో ఇక ఎప్పటికీ తేలకపోవచ్చు.. ఇప్పుడు కరోనా మరణాలు, కేసుల సంఖ్య అధికారిక గణాంకాల కంటే అధిక మొత్తంలోనే కరోనా మరణాలు ఉంటాయని అంటున్నారు నిపుణులు.. అందుకే అసలు కరోనా మరణాల రేటును తేల్చడం సాధ్యపడేది కాదనే విషయం తేల్చి పారేస్తున్నారు.



COVID-19 మరణాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక మిలియన్ దాటేశాయి. కచ్చితమైన కరోనా వైరస్ మరణాల రేటును తేల్చేందుకు సైంటిస్టులు నిరంతరం కుస్తీలు పడుతూనే ఉన్నారు. మరణాల రేటు, వైరస్ సోకినవారి శాతం, ఎంత మంది వ్యాధితో మరణిస్తారు అనేదానిపై స్పష్టత లేదు. కరోనా సోకిన వారిలో 0.5శాతం నుంచి 1శాతం మందిని బలితీసుకుంటోందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

అయితే ఈ సంఖ్య వయస్సుతో చాలా తేడా ఉందని అంటున్నారు. కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి పెరిగిన టెస్టులు, మెరుగైన చికిత్సలు, మరణాల తగ్గుదల కనిపించింది. కానీ, కచ్చితమైన సంఖ్యను గుర్తించడం కష్టంగా మారుతోంది. COVID-19 వ్యాప్తితో ప్రపంచ మరణాలు 1 మిలియన్లకు చేరుకున్నాయి.



అయితే మహమ్మారిలో కీలకమైన మెట్రిక్‌ను గుర్తించడానికి సైంటిస్టులు ఇంకా కష్టపడుతూనే ఉన్నారు. మరణాల రేటు, వ్యాధి సోకిన వారిలో ఎంతమంది ఇంకా మృతిచెందే పరిస్థితులు ఉన్నాయో కచ్చితంగా అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. COVID-19 మరణ రేటును కచ్చితంగా నిర్ణయించలేక పోవడానికి ఎదురయ్యే సమస్యలేంటో ఓసారి చూద్దాం…

మరణ రేటు ఎలా లెక్కిస్తారంటే? :
సాధారణంగా వాస్తవ మరణాల రేటును మొత్తం అంటువ్యాధుల సంఖ్యతో మరణాలను పోల్చి లెక్కిస్తారు. ఎందుకంటే కరోనా లక్షణాల పూర్తి పరిధిని కొలవడం కష్టమనే చెప్పాలి. వ్యాధి సోకిన చాలామందిలో అసలు లక్షణాలు ఉన్నట్టే తేలడం లేదు. అసలు సమస్య ఇక్కడే ఎదురవుతోంది. లక్షణాలు ఉంటే వారికి వైరస్ సోకినట్టు నిర్ధారించొచ్చు.. కానీ, లక్షణ రహిత (asymptomatic cases) కరోనా కేసులే ఎక్కువగా ఉండటంతో గుర్తించడం కష్టమవుతోంది.



శాస్త్రవేత్తలు మొత్తం అంటువ్యాధుల సంఖ్య ప్రస్తుత ధృవీకరించిన కేసుల కంటే ఎక్కువగా ఉందని అంటున్నారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 33 మిలియన్ల మందికి కరోనా సోకింది. కరోనా వ్యాధి సోకిన వారిలో 0.5శాతం నుంచి 1శాతం మందిని బలితీసుకుందని నిపుణులు భావిస్తున్నారు. వ్యాక్సిన్ సరైన సమయంలో కనిపెట్టని పక్షంలో ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రమాదకరమైన వైరస్ గా అవతరిస్తుందని హెచ్చరిస్తున్నారు.

యువకులు, పిల్లలు తీవ్రమైన వ్యాధిని ఎదుర్కొనే అవకాశం చాలా తక్కువగా ఉందని అంటున్నారు. అది వాస్తవమే అయినప్పటికీ పరిశోధకులు వయస్సు ప్రకారం కూడా ప్రమాద స్థాయిని లెక్కించడం మొదలుపెట్టారు. 20 ఏళ్లలోపువారి మరణాల రేటు 10,000 మందిలో ఒకటి 85 ఏళ్లు పైబడిన వారు ఆరుగురిలో ఒకరు ఉన్నారని Seattleలోని వాషింగ్టన్ యూనివర్శిటీ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ డైరెక్టర్ డాక్టర్ Christopher Murray అన్నారు.

‘కేసు మరణాల రేటు’ అంటే ఏంటి? :
కరోనావైరస్ టెస్టు ద్వారా నిర్ధారించే కొత్త అంటువ్యాధుల సంఖ్యతో పోల్చినప్పుడు మరణాల రేటు స్పష్టంగా తగ్గిందని తేలింది. రాయిటర్స్ గణాంకాల ప్రకారం.. యునైటెడ్ స్టేట్స్ వంటి దేశాల్లో ‘case fatality rate’ ఏప్రిల్‌లో 6.6శాతం నుంచి ఆగస్టులో కేవలం 2శాతానికి పడిపోయింది. కానీ మహమ్మారి ప్రారంభ రోజులతో పోల్చితే మరింత విస్తృతమైన టెస్టుల ద్వారా క్షీణత ఎక్కువగా ఉందని తేలింది. కరోనా సోకిన వారిలో తేలికపాటి అనారోగ్యం లేదా లక్షణాలు లేని ఎక్కువ మందిని గుర్తించవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నవారికి చికిత్స చేయడంలో అత్యధిక ప్రమాదకర గ్రూపులను రక్షించడంపై ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.



‘యువకుల్లోనే వ్యాప్తి.. 46శాతం తగ్గిన మరణాల రేటు?:
కొన్ని దేశాల్లో వైరస్ ఇన్ఫెక్షన్‌లు సెకండ్ వేవ్ ప్రారంభమయ్యాయి. దీంతో తప్పని పరిస్థితుల్లో ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. మే నెలతో పోల్చితే జూలై చివరి నాటికి దేశంలో మరణాల రేటు 46శాతం తగ్గిందని ఫ్రాన్స్ పరిశోధకులు అంచనా వేస్తున్నారు. టెస్టుల పెరుగుదల, మెరుగైన వైద్య సంరక్షణ కావొచ్చు.. యువతలోనే ఎక్కువగా వ్యాధి వ్యాప్తి చెందింది.



అందుకే కరోనా తీవ్రత అవకాశం చాలా తక్కువగా ఉందని అంటున్నారు. హాస్పిటలైజేషన్, ICU (ఇంటెన్సివ్ కేర్ యూనిట్) రిజిస్ట్రేషన్లలో కొత్త కేసులు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. అంటే ఈ అసమానత ముగియబోతోందని అర్థమని ఫ్రాన్స్‌లోని Montpellier University పరిశోధకురాలు Mircea Sofonea అభిప్రాయపడ్డారు.

ట్రెండింగ్ వార్తలు