Ginger For Hair Health: జుట్టు సమస్యకు అల్లంతో కళ్లెం.. జస్ట్ ఇలా చేయండి చాలు.. జుట్టు ఒత్తుగా, మృదువుగా తయారవుతుంది
Ginger For Hair Health: అల్లంలో ఉండే జింజెరాల్ (Gingerol) అనే యాక్టివ్ పదార్థం తల చర్మానికి రక్తప్రసరణను అందిస్తుంది.

How is ginger useful for hair problems?
అల్లం (Ginger) మన వంటగదిలో సాధారణంగా వాడే ఒక ఆహార పదార్థం. కూరల్లో ఉన్నయోగించే ఈ పదార్థం కేవలం వంటకాలకు రుచిని అందించడమే కాదు ఆరోగ్యానికి, అందానికి సంబంధించిన అనేక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. వాతావరణ మార్పు వల్ల వచ్చే జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్స్ వంటికి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది. అయితే, ఆయుర్వేదం, నాటిమెడిసిన్ ప్రకారం అల్లం పలు జుట్టు సమస్యలను కూడా పరిష్కరిస్తుందట. మరి ఆ సమస్యలు ఏంటి అనేది ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
అల్లం జుట్టుకు అందించే ప్రయోజనాలు:
1.జుట్టు పెరుగుదల కోసం రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది:
అల్లంలో ఉండే జింజెరాల్ (Gingerol) అనే యాక్టివ్ పదార్థం తల చర్మానికి రక్తప్రసరణను అందిస్తుంది. ఇది జుట్టు వృద్ధికి తగిన ఆహారం అందజేస్తూ, కొత్త వెంట్రుకల పెరుగుదలకి సహాయపడుతుంది.
2.జుట్టు ఊడిపోవడం తగ్గిస్తుంది:
అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి తల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి, వాపులు తగ్గించి, జుట్టు రాలే సమస్యను నియంత్రిస్తాయి.
3.డాండ్రఫ్‌కు చెక్:
అల్లంలో యాంటీ ఫంగల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి తల చర్మంలో ఉండే డాండ్రఫ్, పొడి తెగులు వంటి సమస్యలను తొలగించడంలో సహాయపడతాయి.
4.జుట్టుకు మెరుపును, బలాన్ని అందిస్తుంది:
అల్లం తల చర్మానికి పోషణనిచ్చి జుట్టుకు సహజమైన మెరుపును కలిగిస్తుంది. కొత్త వెంట్రుకలు రావడానికి సహాయపడుతుంది.
అల్లం వాడే విధానాలు:
- అల్లం జ్యూస్ హెయిర్ టోనిక్ వారానికి రెండు సార్లు
- అల్లం, కొబ్బరినూనె మిశ్రమం
- అల్లం, ఆముదం నూనె మిశ్రమం
జాగ్రత్తలు:
- అల్లం నేరుగా తల చర్మంపై వాడకూడదు
- నూనెలో కలిపి వాడటం మంచిది.
- కొందరికి అల్లం వల్ల చర్మంపై రషెష్ రావచ్చు
- వాడే ముందు చేతిపై వేసి అలర్జీ టెస్ట్ చేసుకోవాలి
- వారానికి 2 నుంచి 3 సార్లకు మించకుండా వాడాలి
- ఎక్కువగా వాడితే తల చర్మం పొడిగా మారవచ్చు.