బొటనవేలిపై బుడిపెలు… పిల్లలో కనిపిస్తున్న కరోనా కొత్త లక్షణం

  • Publish Date - April 22, 2020 / 09:58 AM IST

COVID-19ను అర్ధంచేసుకోవడానికి ప్రయత్నిస్తున్న డాక్టర్లకు మరో కొత్త లక్షణం దొరికింది. దీనికి ‘COVID toes’అంటే కోవిడ్ బొటనవేలని పేరుపెట్టారు.  ఊదారంగు లేదంటే, నీలిరంగలో పాదంమీద, బొటనవేలుమీద పుండుపుడుతుంది. దీనికి కారణమేంటో వైద్యనిపుణులకు అంతుచిక్కడంలేదు. వైరస్ ఇన్ఫెక్షన్ సోకిందనడానికి ఓ గుర్తు. ఆ సమయంలో బొటనవేలిని పట్టుకుంటే విపరీతమైన నొప్పి.. మండినట్లుగా అనిపిస్తుంటుందని chief of infectious disease,University of Pennsylvania’s School of Medicine, Dr. Ebbing Lautenbach అంటున్నారు. 

కోవిడ్ వచ్చింది. అయినా లక్షణాలు కనిపించడంలేదు. జ్వరమూ లేదు… దగ్గూలేదు. ఇలాంటి వాళ్లనే asymptomatic patients అనిఅంటున్నారు. ఇలాంటి కేసుల్లో “COVID toes” కనిపించడం డాక్టర్లకు ఆసక్తిని కలిగిస్తోంది. ఇలాగే, వాసన, రుచి తెలియకపోవడమూ COVID-19లక్షణాలుగా కనిపెట్టారు. నిజానికి, ఏ రోగలక్షణమూ లేనప్పుడు కోవిడ్ బొటనవేలు కనిపిస్తుంది. అది ఒక్కటే బైటకు కనిపించే లక్షణం. ఆ తర్వాత వైరస్ బాడీలో ఎదుగుతుంది. ఇతరత్రా ఎలాంటి రోగ చిహ్నలు లేనిసమయంలో ఇదే తొలి symptomఅనుకోవాలని అంటున్నారు Lautenbach.అలాగని “COVID toes”ఎక్కువ కాలం ఉండదు. కొందరిలో పదిరోజుల్లో పోతుంది. ఈలోగా, మరికొందరిలో ఊపిరితీసుకోవడంలో సమస్యలొస్తాయి. అంటే వైరస్ శరీరాన్ని కమ్మేసినట్లు లెక్క. 

ఈ కొత్త కరోనా లక్షణం… పెద్దవాళ్లకన్నా చిన్నవాళ్లలోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే, వైరస్‌ను ఎదుర్కొనే వ్యాధినిరోధక శక్తి చిన్నారుల్లో, కురాళ్లల్లో ఎక్కువ.  ఈ లక్షణాన్ని మొదట ఇటలీ డాక్లర్లు కనిపెట్టారు. ఆ తర్వాత ఇలాంటి కేసులు అమెరికాలో ఎక్కువగా కనిపించాయి. అసలు కాళ్లమీద, బొటనవేలిమీద పుండుతో కరోనాబైటపడటం ఏంటి? దీనికో కారణం ఉంది. వైరస్‌తో, వ్యాధినిరోధక శక్తి పోరాడుతున్నప్పుడు బాధితుడి కాలు, వేళ్ళమీద వాపుగా కనిపిస్తుంది. లేదంటే… ఇక్కడ రక్తనాళాల్లో గడ్డకట్టడం కావచ్చు. అసలు కారణం ఏంటో తెలియాల్సి ఉంది. 

chief of critical care for the emergency department at Massachusetts General Hospital,Susan Wilcox ఉద్దేశంలో,  కరోనా బాధితుల్లో వైరస్ ప్రమాదకరంగా మారినప్పుడు… ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి. అది purpura fulminansఅంటే రక్తంగడ్డకట్టిన గుర్తులు కనిపిస్తాయి.  వైరస్ బాగా ప్రభావం చూపించినప్పుడు వాపువల్ల రక్తనాళ్లాల్లో చాలాచిన్నచిన్నరక్తం గడ్డకట్టిన ముద్దలు బొటననవేలు, వేళ్లమీద, కొన్నిసార్లు ముక్కుమీదకూడా ఎర్పడతాయని Susan Wilcox చెబుతున్నారు. viral pneumonia లేదంటే bad flu వచ్చినప్పుడు కాళ్లమీద బొబ్బలు కనిపించడం మామూలే. అందుకే COVID-19పేషెంట్లకు ఇలాంటి లక్షణాలు కనిపించడం వైద్యనిపుణులకు ఆశ్చర్యమేమీకాదు. కాకపోతే వైరస్ ఈ COVID toesకు ఎలా కారణం అవుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కొత్త రోగ లక్షణాన్ని అర్ధంచేసుకోవడమంటే, కరోనా కట్టడికి మరో మార్గం దొరికినట్లేకదా! 

చిత్రమేంటంటే? కోవిడ్ వేలు కనిపించినా…. వాళ్లకు  test negativeవస్తుంది. అప్పటికి వైరస్ ఇంకా పూర్తిగా ఎదగలేదు. అందుకే టెస్ట్‌కు దొరకదు. అందుకే  patientsలను ఇంటిదగ్గరే quarantineచేసి, రోగలక్షణాలను బట్టి ట్రీట్ చేస్తున్నారు. ఇప్పుడు కోవిడ్ బాధితులను కనిపెట్టడానికి డాక్టర్లు వేళ్లు, కాళ్లు వంక చూస్తున్నారు.