What are the health benefits of eating jaggery at night?
బెల్లం మానవ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. నిజానికి మన భారతీయ సంస్కృతిలో దీనికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా శీతాకాలంలో ఎక్కువగా వాడతారు. రాత్రి భోజనం తరువాత కొద్దిగా బెల్లం తినడం అనేది మన పూర్వీకుల జీవన శైలిలో భాగంగా ఉండేది. ఈ అలవాటు వెనుక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి ఆధునిక శాస్త్రపరమైన పరిశోధనల ద్వారా కూడా నిరూపితమయ్యాయి. కానీ, ఈ మధ్య కాలంలో ఈ అలవాటు చాలా తగ్గిపోయింది. మరొక్కసారి రాత్రి భోజనం తరువాత బెల్లం తిన్నతరువాత కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
1.జీర్ణక్రియకు సహాయపడుతుంది:
బెల్లంలో ఉండే సహజమైన ఎంజైములు, ఖనిజాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఇది పేగుల పనితీరును ప్రోత్సహించి, అసిడిటీ, గ్యాస్ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
2.లివర్ డిటాక్సిఫికేషన్‌కు సహాయం:
బెల్లం అనేది సహజమైన డిటాక్సిఫయర్. ఇది లివర్ నుంచి విషపదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. రాత్రి భోజనం తరువాత తీసుకోవడం వల్ల రాత్రంతా శరీర శుద్ధి ప్రక్రియను ప్రోత్సహిస్తుంది.
3.రక్త శుద్ధి:
బెల్లంలో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటు రక్తహీనతను తగ్గిస్తుంది. దీనిని రాత్రి తినడం వలన మంచి ఫలితాన్ని ఇస్తుంది.
4.ఓరల్ హెల్త్‌కు మేలు:
బెల్లంలో ఉండే యాంటీబాక్టీరియల్ గుణాలు నోటి లోపల బాక్టీరియా పెరగకుండా నివారిస్తాయి. ఇది దంతాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయకారిగా ఉంటుంది.
5.చక్కెరకు మంచి ప్రత్యామ్నాయం:
బెల్లం సహజమైన తీపి పదార్థం. ఇది చక్కెర కంటే చాలా ఆరోగ్యకరమైనది. భోజనం తరువాత ఏదైనా తీపిగా తినాలనిపించినప్పుడు బెల్లం అత్యుత్తమ ఎంపికగా చెప్పుకోవచ్చు.
6.శరీర ఉష్ణోగ్రత నియంత్రణ:
బెల్లం శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. దీనిలో శరీరాన్ని చల్లబరిచే గుణం ఉంటుంది. ముఖ్యంగా వేసవి రాత్రుల్లో బెల్లం తినడం వల్ల శరీరంలో తాపాన్ని తగ్గించుకోవచ్చు.
భోజనం తరువాత బెల్లం తింటే ఆరోగ్యం వందశాతం నిజం. మన శరీరానికి సహజంగా మేలు చేసే బెల్లాన్ని మన రోజువారీ జీవనశైలిలో చేర్చుకోవడం ద్వారా అనేక సమస్యల నుండి తప్పించుకోవచ్చు.