McDonald, Dominos పిజ్జాల్లో ఇన్నీ కేలరీలు, ఫ్యాట్ తింటున్నామా? 

ఫాస్ట్ ఫుడ్ కల్చర్.. ఇప్పుడిదే ట్రెండ్. ఇంట్లో వండిన ఫుడ్ తినే రోజులు పోయాయి. అంతా ఫాస్ట్ ఫుడ్‌లకు బాగా అలవాటుడిపోతున్నారు. ఇలా ఆర్డర్ చేస్తే అలా క్షణాల్లో ముందుండే ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ (పిజ్జా, బర్గర్, కబాబ్, బిర్యానీ) కనిపిస్తే చాలు.. లొట్టలేసుకుని తినేస్తుంటారు. ఇప్పుడు ఎక్కడా చూసిన ‘టేక్ అవే’ ఫుడ్ కౌంటర్ల కల్చర్ పెరిగిపోతోంది. ఈ జంక్ ఫుడ్ కల్చర్ ఇప్పుడు బ్రిటన్ దేశాన్ని పట్టిపీడిస్తోంది. మితిమీరి తింటున్న వారంతా అధికబరువుతో బాధపడుతున్నారు.

‘టేక్‌అవే’ కౌంటర్లను దూరం పెట్టిన బ్రిటన్ :
ఒబెసిటీ సమస్య అత్యంత తీవ్రంగా మారిపోయింది. బ్రిటన్ వీధుల్లో ఎక్కడ చూసిన ఈ టేక్ అవే ఫుడ్ కౌంటర్లు వెలిశాయి. దాంతో ప్రతిఒక్కరూ ఈ టేక్ అవే ఫుడ్ కొని తెచ్చేసుకుంటారు. ఫలితంగా అనారోగ్యం పాలవుతున్నారు. బ్రిటన్ వీధుల్లో గత మూడున్నరేళ్లలో ఏకంగా 5,809 ‘టేక్ అవే’ కౌంటర్లు ఏర్పాటయ్యాయి. ప్రతిరోజు మూడు మిలియన్ల కంటే ఎక్కువ మొత్తంలో ఈ టేక్ అవే కల్చర్ పెరిగిపోయినట్టు ఓ రీసెర్చ్ తెలిపింది. ఇప్పడు ఈ టేక్ అవే కల్చర్ ను బ్రిటన్ దూరంగా పెట్టేసిట్టు రీసెర్చర్లు వెల్లడించారు.

Domino’s పిజ్జాలో 1900 కేలరీలు ఉన్నాయని, అలాగే KFC స్నాక్ బాక్సులో 500 వరకు కేలరీల కంటే ఎక్కువ మోతాదులో ఉన్నట్టు రీసెర్చర్లు గుర్తించారు. డొనర్ కేబాబ్ వంటి హై స్ట్రీట్ టేక్ అవే ఫుడ్ నుంచి 60గ్రాముల కొవ్వు, 1,100 కేలరీలతో పోలిస్తే చేపలు, చిప్స్‌తో కలిపి మొత్తంగా 927 కేలరీలు ఉండగా, అందులో కొవ్వు 45గ్రాములు మాత్రమే ఉన్నట్టు బీబీసీ డాక్యుమెంటరీలో గుర్తించారు.

ఇక బిగ్ మ్యాక్, మెక్ డొనాల్డ్ fries ఫుడ్‌లో 39గ్రాముల కొవ్వు ఉంటే.. మొత్తంగా 780 కేలరీలు ఉన్నాయి. చికెన్ కూర్మా, రైస్, చపాతీల్లో కలిపి 1,810 కేలరీలు ఉన్నాయి. ఈ ప్రయోగానికి నేతృత్వం వహించిన న్యూట్రిషినల్ సైన్స్ ఎక్స్‌పర్ట్ డాక్టర్ లాన్ డేవీస్ మాట్లాడుతూ.. పిజ్జాలు తీవ్ర అనారోగ్యానికి ఎంతో హానికరమైనవిగా వెల్లడించారు.

* KFC స్నాక్ బాక్స్ : Fat 20 గ్రాములు, 475 కేలరీలు
* McDonald’s Big Mac, మీడియం fries : ఫ్యాట్ 39 గ్రామలు, 780 కేలరీలు
* Fish and chips: Fat 45గ్రాములు, 927 కేలరీలు
* Doner kebab : Fat 60 గ్రాములు, 1,100 కేలరీలు
* చికెన్ కూర్మా, రైస్, చపాతి : Fat 83 గ్రాములు, 1,810 కేలరీలు
* Large Dominoలో క్రస్ట్ పిజ్జా  : Fat 80 గ్రాములు, 1,984 కేలరీలు

కొన్ని చైనీస్ మీల్స్ లో కూడా అధిక స్థాయిలో ఉప్పు, షుగర్ ఎక్కువగా ఉంటాయి. అలాగే కబాబ్స్ లో కూడా అధిక మోతాదులో కొవ్వును ఉత్పత్తి చేస్తాయి. దీంతో ఏ టేక్ అవే మీల్ అనారోగ్యమో గుర్తించడం చాలా కష్టమైన పరిస్థితి.

See Also | KFC మీల్‌లో 500, కబాబ్‌లో 1,100, మరి డొమినోస్ పిజ్జాలో 2,000 కేలరీలు.. మీరు తినే ఫాస్ట్‌ఫుడ్‌లో ఎన్ని కేలరీలో తెలుసా?