చెక్ వన్స్: బరువు పెరుగుతున్నారా? జాగ్రత్త!

మనిషిలో వయస్సు పెరిగే కొద్ది మార్పులు ఎన్నో కనిపిస్తుంటాయి. బరువు కూడా అంతే. కొంతమంది ఒక్కసారిగా బరువు పెరిగిపోతుంటారు. కారణం తెలియదు. ఆహారపు అలవాట్లు కావచ్చు. ముఖ్యంగా మహిళల్లో ఈ మార్పులు తరచూ సంభవిస్తుంటాయి.

  • Published By: veegamteam ,Published On : January 17, 2019 / 10:23 AM IST
చెక్ వన్స్: బరువు పెరుగుతున్నారా? జాగ్రత్త!

మనిషిలో వయస్సు పెరిగే కొద్ది మార్పులు ఎన్నో కనిపిస్తుంటాయి. బరువు కూడా అంతే. కొంతమంది ఒక్కసారిగా బరువు పెరిగిపోతుంటారు. కారణం తెలియదు. ఆహారపు అలవాట్లు కావచ్చు. ముఖ్యంగా మహిళల్లో ఈ మార్పులు తరచూ సంభవిస్తుంటాయి.

మనిషిలో వయస్సు పెరిగే కొద్ది మార్పులు ఎన్నో కనిపిస్తుంటాయి. బరువు కూడా అంతే. కొంతమంది ఒక్కసారిగా బరువు పెరిగిపోతుంటారు. కారణం తెలియదు. ఆహారపు అలవాట్లు కావచ్చు. ముఖ్యంగా మహిళల్లో ఈ మార్పులు తరచూ సంభవిస్తుంటాయి. ఇలాంటి సమయాల్లో అశ్రద్ధ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వైద్య నిపుణులు. మన శరీరంలో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ఏమైనా తేడా అనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఉన్నట్టుండి బరువు పెరిగిపోయిన మెరిడియన్‌కు చెందిన ఓ మహిళకు కూడా ఇదే అనుభవం ఎదురైంది. తన శరీరంలో నుంచి 50 పౌండ్ల కణితి ఉందని తెలిసి షాక్ కు గురయింది. బ్రెండా కిడ్‌లాండ్‌ అనే మహిళ ఈ మధ్యకాలంలో విపరీతంగా బరువు పెరిగిపోయింది. మోనోపాజ్‌ స్టేజ్‌లో ఉన్నా కదా అని పెద్దగా పట్టించుకోలేదు. బరువు పెరగడం చాలా సాధరణమేనని భావించింది.

షాకైన డాక్టర్లు.. ఆపరేషన్ సక్సెస్
కానీ గత కొద్ది నెలలుగా బ్రెండా ఆరోగ్యం క్షీణించడం ఆరంభించింది. దాంతో డాక్టర్‌ను సంప్రదించింది. వైద్య పరీక్షల్లో భాగంగా బ్రెండాకు సీఏటీ స్కానింగ్‌ చేశారు. రిపోర్ట్స్‌ చూసి డాక్టర్లు ఆశ్యర్యపోయారు. బ్రెండా కడుపులో దాదాపు 50 పౌండ్ల కణితి ఉన్నట్లు స్కానింగ్‌లో తేలింది. ఇంత భారీగా పెరిగిన కణితి ఆమె శరీరంలోని మిగతా అవయవాలను అడ్డుకోవడమే కాక మెదడుకు రక్త ప్రసరణ కాకుండా ఆటంకం కలిగిస్తుందని వైద్యులు గుర్తించారు. వెంటనే డాక్టర్లు ఆమెకు అత్యవసర ఆపరేషన్ చేయాలని సూచించారు. దాదాపు రెండున్నర గంటలపాటు బ్రెండాకు ఆపరేషన్‌ చేసి ఆమె కడుపులోని విజయవంతంగా కణితిని తొలగించారు. ఆపరేషన్ అనంతరం బ్రెండా మాట్లాడుతూ.. తన కడుపులోని కణితిని తొలగించిన తరువాత తాను దాదాపు 65 పౌండ్ల మేర బరువు తగ్గానంటూ సంతోషం వ్యక్తం చేసింది. తనలా ఎవరూ నిర్లక్ష్యంగా ఉండరాదని బ్రాండా కోరింది.