బ్రిటీష్ ఆస్పత్రిలో ఒక పేషెంట్ వయోలిన్ వాయిస్తుండగా.. ఆమె మెదడు నుండి కణితిని తొలగించారు వైద్యులు. ఆమెకు 40ఏళ్ల లో వాయిద్యం పట్ల అభిరుచే ఇందుకు కారణమని శస్త్రచికిత్స చేసిన నిపుణులు తెలిపారు. ఐల్ ఆఫ్ వైట్ నుండి మాజీ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ డాగ్మార్ టర్నర్, (53) ఆమె మెదడు కుడి ఫ్రంటల్ లోబ్ నుండి కణితిని తొలగించే ఆపరేషన్ జరిగింది. ఈ సమయంలో ఆమె వయోలిన్ వాయించింది. ఆమె ఎడమ చేతి చక్కటి కదలికను నియంత్రించే ప్రాంతానికి దగ్గరగా ఉంచి ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు వైద్యులు.
ఆమె వయోలిన్ నైపుణ్యాలకు ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు వీలుగా కింగ్స్ కాలేజ్ హాస్పిటల్‌లోని కన్సల్టెంట్ న్యూరో సర్జన్ ప్రొఫెసర్ కీయుమర్స్ అష్కాన్ ఒక ప్రణాళికతో ముందుకు వచ్చారు. వారు ఆమె మెదడును మ్యాప్ చేశారు. ఆ తర్వాత పుర్రె తెరిచి లోపలి కణితిని తొలగించారు. అదే సమయంలో ఆమె వయోలిన్ వాయిస్తూనే ఉంది. ‘నేను రోగికి ఒక వాయిద్యం వాయించడం ఇదే మొదటిసారి’ అని అష్కాన్ అన్నారు. మేము 90 శాతం కణితిని తొలగించగలిగాం. కణితి ఉన్న అనుమానాస్పదంగా ఉన్న అన్ని ప్రాంతాలతో సహా, ఆమె ఎడమ చేతిలో పూర్తి పనితీరును కలిగి ఉంది’ అని అన్నారు. మహిళ డాగ్మర్ సర్జన్లకు కృతజ్ఞతలు తెలిపారు.
“వయోలిన్ అంటే నాకు పిచ్చి. నేను 10 సంవత్సరాల వయస్సు నుంచి ప్లే చేస్తున్నాను’ అని చెప్పారు. నేను ప్లే చేయగల సామర్థ్యాన్ని కోల్పోయే ఆలోచన హృదయ విదారకంగా ఉంది’ అని వాపోయింది. డాగ్మార్ ఏ రకమైన సంగీతాన్ని వాయించారో ఆసుపత్రి వైద్యులు వెల్లడించలేదు. వయోలిస్ వాయిస్తుండగా వైద్యులు మహిళకు కణితిని శస్త్రచికిత్స ద్వారా తొలగిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.