మీ బరువు ఎంత..? మీ బరువే కరోనాతో చనిపోయే అవకాశాలను నిర్ణయిస్తుంది, కొత్త అధ్యయనం హెచ్చరిక!

  • Publish Date - July 25, 2020 / 09:51 PM IST

మీ బరువు ఎంత? మీ బరువు ఎంత ఉన్నారో కరోనా మరణ ముప్పు ఉందో లేదో చెప్పేయచ్చు.. అధిక బరువు ఉన్నవారిలో కరోనా మరణ ముప్పు అధికంగా ఉంటుందని ఓ కొత్త అధ్యయనం హెచ్చరిస్తోంది. అధిక బరువు లేదా ఊబకాయం కలిగి ఉంటే చనిపోయే కరోనాతో చనిపోయే అవకాశాలను పెంచుతుందని పేర్కొంది. ఊబకాయం ఉన్నవారిలో ఎక్కువగా ఆరోగ్య సమస్యలు ఉంటాయని ఎన్నో అధ్యయనాల్లో తేలింది. అధిక బరువు ఉన్నవారిలో డయాబెటిస్, రక్తపోటు, హృదయ సంబంధ వ్యాధులు ఎక్కువగా ఉంటాయి.

ఊబకాయంతో బాధపడేవారంతా తొందరగా వ్యాధుల బారినపడుతుంటారు. కోవిడ్ -19 వ్యాధి కూడా అధిక బరువు ఉన్నవారిపై ముప్పు ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తోంది. ఊబకాయం ఉండి.. కరోనా బారిన పడితే అంతే సంగతలు.. చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ (PHE) నిర్వహించిన ఈ పరిశోధనలో ఊబకాయం లేదా అధిక బరువు ఉన్నవారు మరణించే ప్రమాదంతో పాటు కరోనావైరస్ నుంచి తీవ్రమైన అనారోగ్యానికి గురవుతున్నారని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

కోవిడ్ -19 సమయంలో BMI చెక్ చేశారా? :
PHE ప్రకారం.. 30-35 బాడీ మాస్ ఇండెక్స్ (BMI) ఉన్నవారికి కోవిడ్ -19 నుంచి మరణించే ప్రమాదం 40శాతం పెరుగుతుందని డేటా సూచిస్తోంది. ఆరోగ్యకరమైన బరువు ఉన్న వారితో పోలిస్తే.. 40 కంటే ఎక్కువ BMI ఉన్నవారికి 90శాతం పెరుగుతుందని తేలింది. 30 కంటే ఎక్కువ BMI ఉన్నవారిని ఊబకాయంగా వర్గీకరిస్తారు.

అధిక బరువు లేదా ఊబకాయం ఉండటం వలన మీరు కోవిడ్ -19 వైరస్ మరణ ముప్పు నుంచి తప్పించుకోలేరు. అనేక ఇతర ప్రాణాంతక వ్యాధుల నుంచి తీవ్రమైన అనారోగ్యం లేదా మరణానికి గురవుతారని ప్రస్తుత ఆధారాలు స్పష్టంగా ఉన్నాయని PHE లోని నిపుణుడు Alison Tedstone అన్నారు.

ఊబకాయం ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లను కూడా ప్రేరేపిస్తుందని అంటున్నారు. మెటబాలిక్ సిండ్రోమ్ (ఇందులో ఊబకాయం కూడా ఉంది ) వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి తీవ్రమైన వ్యాధి
ప్రమాదాన్ని పెంచుతుందని సూచిస్తుంది. వాస్తవానికి, స్థూలకాయం ఇన్ఫ్లుఎంజా వచ్చే అవకాశాలను రెట్టింపు చేస్తుంది.

ఊబకాయం ఉన్నవారిలో covid-19 వైరస్ తీవ్ర అనారోగ్యానికి ఒక ప్రమాద కారకంగా చెప్పవచ్చు. అధిక శరీర బరువు కొవ్వు డయాఫ్రాగమ్‌పై ఒత్తిడి తెస్తుంది. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుందని పరిశోధకులు సూచిస్తున్నారు. ఎక్కువగా వీరిలో శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేసే వైరల్ ఇన్ఫెక్షన్ పెరిగి క్రమంగా మరణానికి దారితీస్తుందని అధ్యయనం హెచ్చరిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు