మున్సిపల్ ఎన్నికల పోటీలో 12,956 మంది అభ్యర్ధులు

  • Publish Date - January 15, 2020 / 02:58 PM IST

రాష్ట్రంలో జనవరి 22న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్ధులు జాబితా ఖరారయ్యింది. రాష్ట్రంలోని 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి.  ఇందుకోసం  జనవరి 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించారు. 11న నామినేషన్ల పరిశీలన జరగ్గా, తిరస్కరించిన నామినేషన్లపై 12వ తేదీ వరకు అప్పీల్‌ చేసుకునే అవకాశం కల్పించారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు నిన్నటితో (మంగళవారం.జనవరి 14) ముగిసింది.

 మొత్తం 3,052 వార్డులకు గానూ,  12,956 మంది అభ్యర్థులు  బరిలో నిలిచారు. టీఆర్‌ఎస్‌ నుంచి 3,023, కాంగ్రెస్‌ 2,618, బీజేపీ 2,313, టీడీపీ 348, ఎంఐఎం 280, సీపీఐ 177, సీపీఎం నుంచి 166 మంది పోటీలో ఉన్నారు. అత్యధికంగా నిజామాబాద్‌లో 415 మంది అభ్యర్థులు బరిలో దిగారు. ఇక 3,750 మంది స్వతంత్రులుగా పోటీ  చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు