తనపై 139 మంది అత్యాచారం చేశారంటూ ఓ యువతి చేత కేసు పెట్టించిన డాలర్ భాయ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ ఉంది. భద్రాద్రి జిల్లాలో రాజ శ్రీకర్‌రెడ్డి అలియాస్ డాలర్ బాయ్‌పై ఇప్పటికే మూడు కేసులు ఉండగా.. డాలర్ భాయ్ తనను మాత్రమే కాకుండా ఎంతోమందికి అన్యాయం చేశారని బాధితురాలు ఆరోపించింది. తనకు న్యాయం చెయ్యాలని వేడుకుంది. డాలర్ బాయ్ డ్రామాలు గురించి ఆమె చెప్పారు. ఇప్పుడు ఈ విషయంలో డాలర్ భాయ్‌పై కేసు పెట్టనున్నట్లు ఆమె వివరించింది.
139మందిపై కేసులు విషయంలో కర్త కర్మ క్రియ డాలర్ భాయ్.. అలియాస్ రాజ శ్రీకర్ రెడ్డి అని.. డాలర్ భాయ్ బెదిరించి తనతో కేసు పెట్టించినట్లు చెప్పింది. అతను ఫౌండేషన్ అడ్డం పెట్టుకుని అక్రమాలు చేస్తున్నట్లు చెప్పింది. పరిచయం ఉన్న స్నేహితులు అందరినీ అత్యాచారం కేసులో ఇరికించినట్లు చెప్పింది. ప్రశాంతంగా ఉన్న జీవితం రిస్క్‌లో పడిపోయిందని, జాబ్ కోసం అని ఆన్‌లైన్‌లో వెతుకుతుంటే డాలర్ భాయ్ పరిచయం అయ్యాడని ఆమె చెప్పింది.
ఎయిర్ లైన్స్ పెట్టాలనేది తన డ్రీమ్ అని, ఫోన్‌లో ఇంటర్వ్యూ చేసేప్పుడు చెప్పాడని ఆమె చెప్పుకొచ్చింది. డాలర్ భాయ్ తన సర్టిఫికేట్లు తీసుకుని తనని బ్లాక్ మెయిల్ చేసినట్లు చెప్పింది. ఒకటన్నర నెలలుగా టార్చర్ పెట్టి, కొట్టి, నరకం చూయించి కేస్ ఫైల్ చేయించేలా చేశారని ఆమె అన్నారు. నా ద్వారా ఇబ్బంది పడిన ప్రతి ఒక్కరికి క్షమాపణలు అంటూ ఆమె చెప్పింది.
డాలర్ భాయ్ ఒత్తిడితోనే 139మందిపై కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని, హరాస్‌మెంట్ చేసి వాళ్లు తనతో ఇలా చేయించారని ఆమె చెప్పారు. తన ల్యాప్‌టాప్‌లో ఇంతకుముందు తను చంపిన వ్యక్తుల ఫోటోలు చూపించి తన ఫ్యామిలీని చంపేస్తానని బెదిరించి, ఇలా చేయించినట్లు ఆమె చెప్పింది.